Andhra Pradesh

News June 27, 2024

ఉంగుటూరు: రోడ్డు ప్రమాదంలో TDP మహిళా నేత మృతి

image

ఉంగుటూరు టీడీపీ మండల అధ్యక్షురాలు రమ్యకృష్ణ బుధవారం షిరిడీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయితే షిరిడీ వస్తానని ఆమె మొక్కుకున్నారు. ఆ మేరకు మొక్కులు తీర్చుకొని తిరిగి బయలుదేరిన సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహిళా నేత మృతిపై చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.

News June 27, 2024

అర్ధవీడు: చిన్నారి గొంతుకోసిన టీచర్ సస్పెండ్

image

అర్ధవీడులోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఒకేషనల్ టీచర్ వెంకట రమణారెడ్డిని సస్పెండ్ చేసినట్లు హెచ్‌ఎమ్ అబ్దుల్ సత్తార్ బుధవారం తెలిపారు. ఇటీవల పెంచుకున్న 9 ఏళ్ల పాపను కిరాతకంగా కొంతు కోసి హత్య చేసిన ఉదంతంలో ఉపాధ్యాయుడితోపాటు ఆయన భార్య పద్మావతి సైతం జైలు పాలయ్యారు. డీఈవో ఉత్తర్వుల మేరకు జూన్ 6 నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు అమలైనట్లు ఆయన వెల్లడించారు.

News June 27, 2024

కృష్ణపట్నంలో సగం రేటుకే బంగారమని మోసం

image

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కృష్ణపట్నం పోర్టులో సగం రేటుకు బంగారం ఇప్పిస్తామని నమ్మబలికి కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.15 లక్షలు దోచుకున్నారు. జెన్కో రోడ్డు వద్ద పోలీసుల వేషధారణలో వచ్చిన నిందితులు బాధితులను ఆటోలో ఎక్కించుకున్నారు. తర్వాత నగదు తీసుకుని వారిని వదిలేసి వెళ్లిపోయారు.

News June 27, 2024

౩౦న వకుళామాత ఆలయ వార్షికోత్సవం

image

తిరుపతి సమీపంలోని పేరూరు బండపై ఉన్న శ్రీవకుళామాత ఆలయంలో జూన్ 30వ తేదీ వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు అష్టోత్తర కలశాభిషేకం జరగనుంది.

News June 27, 2024

నెల్లూరు: లా ఫలితాల విడుదల

image

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ లా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 3 ఏళ్ల కోర్స్ విద్యార్థుల 5వ సెమిస్టర్, 5 సంవత్సరాల కోర్స్ విద్యార్థుల 3, 7, 9వ సెమ్‌ ఫలితాలు వెలువడినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా రీ వాల్యుయేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News June 27, 2024

‘దిశ వన్ స్టాప్ సెంటర్ ’ను తనిఖీ చేసిన కలెక్టర్

image

బాధిత మహిళల సహాయం కోసం ఏర్పాటు చేసిన ‘వన్ స్టాప్ సెంటర్‌’లో మెరుగైన సహాయం అందించాలని ఏలూరు నూతన కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ‘దిశ వన్ స్టాప్ సెంటర్’ను బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధిత మహిళలు, పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు. సెంటర్‌కు వచ్చిన మహిళలు, పిల్లలకు సిబ్బంది సరైన మార్గదర్శకం చేయాలన్నారు.

News June 27, 2024

ప్రధాని మోదీతో వేమిరెడ్డి భేటీ

image

దేశ ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఈ భేటీలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఎంపీలతో ప్రధాని చర్చించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు, లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై వారు మాట్లాడారు.

News June 27, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులు రాయాల్సిన 5, 6వ సెమిస్టర్ పరీక్షల(అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ) షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు జూలై 25 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధరుసుం లేకుండా జూలై 6లోపు చెల్లించాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫీజు వివరాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/examinationsection చెక్ చేసుకోవచ్చు.

News June 27, 2024

30న స్వగ్రామనికి మాజీ సీఎం నల్లారి రాక

image

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈనెల 30వ తేదీ తన సొంత ఊరికి రానున్నారు. బెంగళూరు నుంచి కలికిరికి చేరుకుంటారు. కలికిరిలోని బీజేపీ కార్యాలయంలో 1, 2, 3వ తేదీల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణప్ప తెలిపారు.

News June 27, 2024

యువ‌త మాదక‌ద్ర‌వ్యాల‌కు దూరంగా ఉండాలి: సృజ‌న

image

స‌మ‌ష్టి కృషితో మాద‌క ద్ర‌వ్యాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు వివిధ శాఖ‌ల అధికారులు.. స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారంతో కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న సూచించారు. అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల దుర్వినియోగం, అక్ర‌మ ర‌వాణా వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. అనంతరం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. యువ‌త మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.