Andhra Pradesh

News June 27, 2024

వర్షాలకు ఛాన్స్.. పాపికొండలకు బోట్ యాత్ర నిలిపివేత

image

దేవీపట్నం మండలం గోదావరిలో పాపికొండల బోట్ విహార యాత్రను భారీ వర్షం కారణంగా బుధవారం నుంచి నిలిపివేస్తున్నామని టూరిజం అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో రెండు రోజుల పాటు పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ ప్రకటించడంతో సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి ప్రకటించే వరకు బోట్ యాత్ర ఉండదని పర్యాటకులు గమనించాలని కోరారు.

News June 27, 2024

ఔత్సాహిక రంగాల్లో యువత రాణించాలి: జానకిరామ్

image

కమ్యూనికేషన్, టీం వర్క్, క్రిటికల్ థింకింగ్, భావోద్వేగ మేధస్సు వంటి నైపుణ్యాలను అలవర్చుకొని ఔత్సాహిక రంగాల్లో యువత అభివృద్ధి చెందాలని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి.జానకిరామ్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. స్టూడెంట్ అఫైర్స్ డీన్ సలోమి సునీత, అధ్యాపకులు పాల్గొన్నారు.

News June 27, 2024

IIIT అడ్మిషన్ల పక్రియ కన్వీనర్‌గా అమరేంద్ర

image

ఆర్జీయూకేటీ పరిధిలోని ఆయా IIITలో 2024-25 సంవత్సరానికి జరిగే అడ్మిషన్ల పక్రియ అధ్యాపకుడిగా డా.అమరేంద్ర కుమార్‌ను అధికారులు నియమించారు. దీనిపై ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో అమరేంద్ర కుమార్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా పని చేశారన్నారు.

News June 27, 2024

కడపను కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: డీఆర్ఓ గంగాధర్

image

వైఎస్సార్ జిల్లాను కుష్ఠు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డీఆర్ఓ గంగాధర్ గౌడ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో లెప్రసీ కేసెస్ డిటెక్షన్ క్యాంపెయిన్‌పై జిల్లా సమన్వయ కుష్ఠు వ్యాధి కమిటీ సమావేశం జరిగింది. డీఆర్ఓ మాట్లాడుతూ.. జాతీయ కుష్ఠు వ్యాధి గుర్తింపు అవగాహన కార్యక్రమాన్ని జిల్లాలో జులై 18 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు 15 రోజులు నిర్వహిస్తామన్నారు.

News June 27, 2024

16, 17వ స్థానంలో సత్యసాయి, అనంత

image

కాసేపటి క్రితం పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా నుంచి 4,934 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,401 మంది పాసయ్యారు. జిల్లాలో 68.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా అనంత జిల్లా నుంచి 7,784 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,854 మంది గట్టెక్కారు. మొత్తానికి ఫలితాల్లో సత్యసాయి 16, అనంత 17వ స్థానంలో నిలిచాయి.

News June 27, 2024

రుషికొండ వెంకన్న సేవలో భక్తులు పాల్గొనే అవకాశం

image

టీటీడీకి చెందిన రుషికొండ వద్దగల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జులై 1వ తేదీ నుంచి శ్రీవారి సేవలో భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. సుప్రభాత సేవకు రూ.100, పుష్పాలంకరణకు రూ.12,000 (నలుగురు కుటుంబ సభ్యులు) తోమాలసేవకు ఒక్కొక్కరికి రూ.200, సహస్రనామార్చనకు రూ.200 నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News June 27, 2024

నేడు పార్వతీపురం రానున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి

image

రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యా రాణి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్వతీపురం కలెక్టర్ కార్యాలయానికి గురువారం ఉదయం 10 గంటలకు రానున్నారు. ముందుగా పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

News June 27, 2024

మహానంది పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్లో చిరుత పులి సంచారం – జాగ్రత్తలపై జాయింట్ కలెక్టర్ టి. రాహు కుమార్ రెడ్డితో కలిసి అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ మీనా, నంద్యాల డీఎఫ్ఓ శివ శంకర్ రెడ్డిలతో సమీక్షించారు.

News June 27, 2024

పది అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో శ్రీకాకుళం 19వ స్థానం

image

కాసేపటి క్రితం పది అడ్వాన్స్‌డ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం బాలబాలికలు 2,218 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,338 మంది పాసయ్యారు. మొత్తం 60.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో శ్రీకాకుళం 19వ స్థానం కైవసం చేసుకుంది.

News June 27, 2024

టెక్నికల్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షకు జులై 1వ తేదీలోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సుభద్ర తెలిపారు. ఈ పరీక్ష విశాఖపట్నం, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాలలో జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.