Andhra Pradesh

News June 26, 2024

పది అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో శ్రీకాకుళం 19వ స్థానం

image

కాసేపటి క్రితం పది అడ్వాన్స్‌డ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం బాలబాలికలు 2,218 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,338 మంది పాసయ్యారు. మొత్తం 60.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో శ్రీకాకుళం 19వ స్థానం కైవసం చేసుకుంది.

News June 26, 2024

ఎలమంచిలి ఎమ్మెల్యే తండ్రికి గాయాలు

image

సబ్బవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తండ్రి సుందరపు సత్యనారాయణ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు వర్షం కారణంగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఎలమంచిలి నుంచి ఆనందపురం వైపు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన అతనిని అపోలో ఆసుపత్రికి తరలించారు. సబ్బవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 26, 2024

తిరుపతి కంటే చిత్తూరులో ఎక్కువ మంది పాస్

image

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో చిత్తూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 1966 మందికి 1550 మంది పాసయ్యారు. 78.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలోనే చిత్తూరు 7వ స్థానంలో నిలిచింది. తిరుపతి జిల్లాలో 3,100 మందికి 2,195 మంది పాసై 14వ స్థానంలో నిలిచారు. రెండు జిల్లాల్లో అమ్మాయిల పాస్ పర్సంటేజీనే ఎక్కువ కావడం విశేషం. మరోవైపు అన్నమయ్య జిల్లాలో 3,275 మందికి 2,662 మంది పాసై రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.

News June 26, 2024

టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ప్రకాశం@ TOP-1

image

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రకాశం జిల్లాలో 2,724 మంది పరీక్షరాయగా.. 2,619 మంది పాసయ్యారు. జిల్లాను రాష్ట్రంలోనే టాప్‌-1లో నిలిపారు. బాలురు 96.04%, బాలికలు 96.03% ఉత్తీర్ణత సాధించారు. బాపట్ల జిల్లాలో 2,430 మంది పరీక్ష రాయగా.. 2,080 పాసయ్యారు. ఈ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. బాలురు 84.11%, బాలికలు 88.06% ఉత్తీర్ణత సాధించారు.

News June 26, 2024

16, 17వ స్థానంలో సత్యసాయి, అనంత

image

కాసేపటి క్రితం పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా నుంచి 4,934 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,401 మంది పాసయ్యారు. జిల్లాలో 68.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా అనంత జిల్లా నుంచి 7,784 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,854 మంది గట్టెక్కారు. మొత్తానికి ఫలితాల్లో సత్యసాయి 16, అనంత 17వ స్థానంలో నిలిచాయి.

News June 26, 2024

12వ స్థానంలో పార్వతీపురం.. విజయనగరం@18

image

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 72.27 శాతం ఉత్తీర్ణతతో 12వ స్థానంలో నిలిచింది. 440 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 318 మంది పాసయ్యారు. విజయనగరం జిల్లాలో 2,748 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,711 మంది ఉత్తీర్ణత సాధించారు. 62.26 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.

News June 26, 2024

కృష్ణా: 233 కి.మీ. మేర పూర్తైన 3వ రైల్వే లైన్ పనులు

image

విజయవాడ-గూడూరు మధ్య నిర్మిస్తున్న 3వ రైల్వే లైన్ పనులు 233 కి.మీ. మేర పూర్తయ్యాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 288 కి.మీ. మేర నిర్మిస్తున్న ఈ లైన్‌లో పలు చోట్ల వంతెనలు నిర్మించామని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ లైన్ పనులు పూర్తై అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో వాణిజ్యం ఊపందుకోవడంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలతో మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

News June 26, 2024

అల్లూరి 9.. అనకాపల్లికి 20.. 22వ స్థానంలో విశాఖ

image

➤ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షకు అల్లూరి జిల్లాలో 1,015 మంది విద్యార్థులు హాజరవ్వగా 794 మంది పాసయ్యారు. 78.23 శాతంతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది.
➤ అనకాపల్లి జిల్లాలో 3,031 మందికి 1,648 మంది ఉత్తీర్ణత సాధించారు. 54.37 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 20వ స్థానంలో నిలిచింది.
➤ విశాఖ జిల్లాలో 3,671 మందికి 1,898 మంది పాసయ్యారు. 51.70శాతం ఉత్తీర్ణతతో జిల్లా 22వ స్థానంలో నిలిచింది.

News June 26, 2024

టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో 5వ స్థానంలో కడప

image

కాసేపటి క్రితం పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కడప జిల్లా నుంచి 2,566 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,083 మంది పాసయ్యారు. జిల్లాలో 81.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోనే కడప జిల్లా 5వ స్థానంలో నిలిచింది

News June 26, 2024

కడప: రీజనల్ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ బదిలీ

image

కడప, అనంతపురం జిల్లాల రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ షేక్ మసూం బాషాను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో కర్నూలు విజిలెన్స్ అధికారిగా ఉన్న నీలం పూజితను నూతన రీజనల్ విజిలెన్స్ అధికారిగా నియమించారు. ఇదివరకే జిల్లాలో నీలం పూజిత అడిషనల్ ఎస్పీగా పని చేశారు.