Andhra Pradesh

News June 26, 2024

గుంటూరు: ఆరోగ్యం, వ్యవసాయంపై కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మి బుధవారం తన కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వేరు వేరుగా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అభివృద్ధి పనులు తదితర వివరాలను అందివ్వాలని వైద్యశాఖ అధికారులను, నకిలీ విత్తనాలు, ఎరువులు అరికట్టడానికి చేపట్టిన చర్యలపై నివేదికలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

News June 26, 2024

గుత్తి: 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

image

గుత్తి మండలంలోని రజాపురంలో ఉన్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆహార కల్తీ వల్ల సుమారు 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసులు రెడ్డి, తహశీల్దార్ భారతి ఎంపీడీవో శ్రీనివాసులు బుధవారం పాఠశాలను సందర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.

News June 26, 2024

శ్రీకాకుళం: నిరుద్యోగులకు శుభవార్త

image

జూన్ 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధా బుధవారం తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఐటిఐ, బలగ రోడ్‌లో ఉదయం 10గంటలకు ఐటీఐ, టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన 18 నుంచి 40 సంవత్సరాలలోపు గల యువత ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని ఆమె తెలిపారు. WWW.NCS.GOV.IN, www.empolyment.ap.gov.in వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News June 26, 2024

విశాఖ టెక్ మ‌హీంద్రాలో ఉద్యోగ అవకాశాలు

image

విశాఖలో టెక్ మహీంద్రాలో 328 ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ తెలిపారు. ఈనెల 29న విశాఖ‌ప‌ట్నంలోని డా. విఎస్ కృష్ణా ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో జాబ్ మేళా జ‌రుగుతుంద‌న్నారు. ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను సంబంధిత వెబ్‌సైట్‌లో ఈనెల 28లోగా న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్లకి ప్రాధాన్యత.

News June 26, 2024

కాకినాడ: బావిలో యువకుడి మృతదేహం

image

కాకినాడ జిల్లా తుని మండలం RSపేటలోని ఓ బావిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు బీహార్‌కు చెందిన ఉత్తమ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బేకరీలో కుక్‌గా పని చేస్తున్న ఉత్తమ్.. గత 10 రోజులుగా కనబడటం లేదని బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడు బావిలో శవమై కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News June 26, 2024

అనకాపల్లి జిల్లాలో ఫోన్ పేలి యువకుడి మృతి

image

అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం గాదిరాయిలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం వర్షం పడుతున్న సమయంలో గేదెల పాకపై పిడుగు పడింది. పక్క పాకలో వడ్డాది భవాని శంకర్ (21) ఫోన్ చూస్తుండగా అది పేలి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. పిడుగు పడిన సమయంలో మృతిని పక్కనే తల్లిదండ్రులు ఉన్నారు. చేతికందిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

News June 26, 2024

ప్రకాశం: రికార్డ్ ధర పలికిన వర్జీనియా పొగాకు

image

ప్రకాశం జిల్లాలోని వెల్లంపల్లి వేలం కేంద్రంలో మేలిమి రకం పొగాకుకు బుధవారం రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా వర్జీనియా రకం పొగాకు క్వింటాకు రూ.36,100 ధర పలికిందని టంగుటూరు వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. గత రెండురోజులుగా పొగాకు ధరలు క్రమంగా పెరుగుతుండటంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. ధరలు అశాజనకంగా ఉండటంతో ఈ పంట సాగు చేసే పొలాలకు కౌలు ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

News June 26, 2024

ఖాజీపేట: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి..

image

కడప జిల్లా ఖాజీపేట వాసి ముత్తూరు రమణ నాయుడు తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామ సమీపంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన చెల్లి గ్రామమైన వేముల గొందికి కుటుంబ సమేతంగా వెళ్లాడు. ఈ క్రమంలో బుధవారం చికెన్ కోసం బైక్‌పై వెళుతుండగా అదుపుతప్పి కింద పడి మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 26, 2024

విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది?

image

విజయనగరం జిల్లాలో పురుషుల కంటే మ‌హిళ‌ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, విద్యార్థుల్లో బాలికల నిష్పత్తి ఎందుకు త‌గ్గుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ప్ర‌శ్నించారు. దీనిపై అధ్య‌య‌నం చేసి, వారం రోజుల్లో త‌న‌కు నివేదిక స‌మ‌ర్పించాల‌ని విద్యాశాఖ‌ను ఆదేశించారు. విద్య‌, అనుబంధ‌ సంక్షేమ వసతిగృహాలపై తన ఛాంబర్‌లో బుధవారం సమీక్షించారు.

News June 26, 2024

సాలూరు ప్రజలకు రైలు సౌకర్యం ఎప్పుడు?

image

సాలూరు నుంచి ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు 6 లైన్ల రహదారి తయారవుతుంది కానీ.. రైలు పట్టాలు సరిచేయడం లేదు. విద్యుదీకరణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా రైలు మాత్రం పట్టాలెక్కడం లేదు. గత దసరాకు సాలూరు నుంచి విశాఖకు రైలు వేస్తున్నామని ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. కానీ ఇంతవరకు రియల్ రన్ లేదు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.