Andhra Pradesh

News June 26, 2024

మీ సేవల నిర్వాహకులకు న్యాయం చేస్తాం: పల్లా

image

గత ప్రభుత్వం మీ సేవలను నిర్వీర్యం చేసిందని మీసేవా నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ సేవ నిర్వాహకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో మీ సేవ నిర్వాహకులకు పూర్తిగా న్యాయం చేస్తామన్నారు.

News June 26, 2024

త్వరలో నామినేటెడ్ పదవులు.. రేసులో ఉన్నదెవరు?

image

త్వరలోనే నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో టికెట్ ఆశించిన భంగపడ్డ పలువురు నేతలకు సైతం అధిష్ఠానం నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎవరికి ఏ నామినేటెడ్ పదవి వస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News June 26, 2024

విశాఖ:పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

వాల్తేర్ డివిజన్ పరిధిలో నౌపడ ప్రధాన లైన్ లో వంతెన ఆధునికరణ పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలాస-విశాఖ-పలాస పాసెంజర్ రైలు, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైళ్లను ఈనెల 27న రద్దు చేసినట్లు తెలిపారు. విశాఖ-కోరాపుట్ పాసింజర్ రైలు 26న, కోరాపుట్-విశాఖ పాసింజర్ రైలు 27న రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News June 26, 2024

శ్రీకాకుళం: పలు రైళ్లను రద్దు చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే

image

ట్రాఫిక్ బ్లాక్ కారణంగా శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే రెండు ప్యాసింజర్ రైళ్లను రేపు గురువారం రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. *పలాస- విశాఖపట్నం 07471 నంబరు గల రైలు * విశాఖపట్నం- పలాస 07470 నం. గల రైలు * గుణుపూర్- విశాఖపట్నం 08521 నంబరు గల రైలు * విశాఖపట్నం- గుణుపూర్ 08522 నంబరు గల రైలు రద్దు చేశారు.

News June 26, 2024

మడకశిరలో ఐదు మంది వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా

image

మడకశిర మున్సిపాలిటీలో వైసీపీకి బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదు మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, నియోజవర్గ టీడీపీ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే రాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News June 26, 2024

ఉమ్మడి గుంటూరులో భారీగా పెరిగిన డయేరియా కేసులు

image

విరోచనాలు, వాంతులతో బాధపడుతూ.. 40 మందికిపైగా బాధితులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రావడం కలకలం రేపింది. మూడు రోజులుగా నగరానికి చెందిన వారే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ పట్టణాల నుంచి నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడుతూ.. వచ్చిన రోగులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. బాధితులందరిని ప్రత్యేక ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

News June 26, 2024

చిత్తూరు జిల్లాలో మళ్లీ సగం మంది ఫెయిల్

image

ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల్లోనూ ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటలేకపోయారు. తిరుపతి జిల్లాలో 8256 మంది పరీక్షలు రాయగా 3,719 మందే(45శాతం) పాసయ్యారు. రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచారు. చిత్తూరు జిల్లాలో 5,817 మందికి 2,597 మంది ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 5,371 మందికి 2,597 మంది పాసై 46 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానంలో నిలిచారు.

News June 26, 2024

ఇంటర్ సప్లిమెంటరీలో ప్రకాశం జిల్లాకు 14వ స్థానం

image

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రకాశం జిల్లాలో 6,445 మంది పరీక్షలు రాయగా.. 2,709 మంది పాసయ్యారు. మొత్తం 42% మంది ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రంలో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. అలాగే బాపట్లలో 2,782 మంది రాయగా.. 1,119 మంది పాసయ్యారు. 40% ఉత్తీర్ణులవ్వగా.. జిల్లా 20వ స్థానంలో నిలిచింది. దాంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఒకేషనల్‌కు 884 మంది పరీక్ష రాయగా 442 మంది పాసయ్యారు.

News June 26, 2024

శ్రీకాకుళం: ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 12వ స్థానం

image

కాసేపటి క్రితం ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి 7,113మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,047 మంది పాసయ్యారు. జిల్లాలో 43శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోనే శ్రీకాకుళం 12వ స్థానంలో నిలిచింది. అలాగే ఒకేషనల్‌ గ్రూప్‌లో 341 విద్యార్థులు రాయగా 187మంది పాసయ్యారు. దీనిలో 55శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది.

News June 26, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు..4వ స్థానంలో గుంటూరు జిల్లా

image

ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. గుంటూరు జిల్లా నుంచి మెత్తం 5,097 మంది పరీక్ష రాయగా 2,433 మంది(48శాతం)ఉత్తీర్ణత సాధించారు. కాగా గుంటూరు జిల్లా ఈ ఫలితాలలో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.