Andhra Pradesh

News June 26, 2024

అల్లూరి ఒకటి.. విశాఖకి 13.. 24వ స్థానంలో అనకాపల్లి

image

➤ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలకు అల్లూరి జిల్లాలో 2,655 మంది విద్యార్థులకు 1,766 మంది పాసయ్యారు. 67 శాతంతో రాష్ట్రంలో ఒకటో స్థానంలో నిలిచింది.
➤ విశాఖ జిల్లాలో 7,984 మంది విద్యార్థులు హాజరవ్వగా 3,407 మంది పాసయ్యారు. 43 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 13వ స్థానంలో నిలిచింది.
➤ అనకాపల్లి జిల్లాలో 4,411 మందికి 1,504 మంది ఉత్తీర్ణత సాధించారు. 34 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 24వ స్థానంలో నిలిచింది.

News June 26, 2024

ఇంటర్ ఫలితాల్లో నెల్లూరుకు రెండో స్థానం

image

ఇంటర్ మొదటి సంవత్సరం సప్లమెంటరీ ఫలితాల్లో నెల్లూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 2,655 మంది పరీక్షలు రాయగా 1,766 మంది పాసై 67 శాతంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచారు. ఒకేషనల్ విద్యార్థులు 317 మందికి 211 మంది పాసయ్యారు. రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచారు. తిరుపతి జిల్లాలో 8,256 మందికి కేవలం 3,719 మందే పాసయ్యారు. ఇదే జిల్లాలో ఒకేషనల్ విద్యార్థులు 438 మందికి 239 మంది ఉత్తీర్ణత సాధించారు.

News June 26, 2024

మూడో స్థానంలో పార్వతీపురం.. 8వ స్థానంలో విజయనగరం

image

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 53 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచింది. 1,679 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 884 మంది పాసయ్యారు. విజయనగరం జిల్లాలో 5,673 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,502 మంది ఉత్తీర్ణత సాధించారు. 44 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది.

News June 26, 2024

గుంటూరులో ఈనెల 28న మెగా జాబ్ మేళా

image

యువత కోసం గుంటూరులోని హిందూ ఫార్మసీ కళాశాల అమరావతి రోడ్డులో ఈనెల 28వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రఘు బుధవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 30 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన వారు అర్హులని చెప్పారు.

News June 26, 2024

కృష్ణా: B.A. LL.B కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని B.A. LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన నాలుగవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 25,27,30, ఆగస్టు 1వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News June 26, 2024

తూ.గో జిల్లాలో డ్రగ్స్ నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

image

ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేను పురస్కరించుకొని ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం, వాటి దుష్ప్రభావాలపై చేపట్టిన ఈ ర్యాలీని పుష్కర్ ఘాట్ వద్ద ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సమాజానికి చేటు చేస్తున్న డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

News June 26, 2024

నకిలీ యప్‌ల ద్వారా రూ. 67 లక్షలు స్వాహా: బొబ్బిలి సీఐ

image

నకిలీ షేర్ మార్కెట్ యాప్‌ల ద్వారా రూ.67 లక్షలు నష్ట పోయారని బొబ్బిలి పట్టణ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్, లోన్ యాప్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధిక మొత్తాలకు ఆశపడితే మోసపోవడం తప్ప.. చేయగలిగిందేమి లేదన్నారు.

News June 26, 2024

అమ్మల కోసం అమ్మ ప్రేమగా..!: రోజా

image

తాజా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మాజీ మంత్రి రోజా తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరి, పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బుధవారం గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ‘కడుపు నిండా బోజనం చేసిన నిండు తల్లులు కడుపునిండి దీవించి వెళ్తుంటే అందులోని సంతోషం ఇంకెక్కడ దొరుకుతుంది. అమ్మల కోసం అమ్మ ప్రేమగా’ అని ఆ ఫోటోలను రోజా ట్వీట్ చేశారు. కాగా ఆమె రెండోసారి గెలిచిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేశారు.

News June 26, 2024

మహానందిలో చిరుత పాదముద్రలు గుర్తింపు

image

మహానంది పుణ్యక్షేత్రంలోని గోశాల వద్ద బుధవారం తెల్లవారుజామున చిరుత పులి సంచరించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. డీఆర్ఓ హైమావతి, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిరుత పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. చిరుత పాదముద్రలను గుర్తించారు. మరోవైపు మహానంది గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆలయ సిబ్బంది సూచించారు.

News June 26, 2024

వైసీపీ భవనాన్ని సర్కారు స్వాధీనం చేసుకుంటుంది: ఎమ్మెల్యే దగ్గుపాటి

image

అనంతపురం నగరంలో నూతనంగా నిర్మించిన జిల్లా వైసీపీ కార్యాలయాన్ని అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో ఎలాంటి మున్సిపల్, అహుడా అనుమతులు తీసుకోకుండా కార్యాలయాన్ని నిర్మించారని తెలిపారు. త్వరలోనే వైసీపీ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన తెలిపారు. ఆ భవనం ప్రజలకు ఉపయోగపడే విధంగా చూస్తామని తెలిపారు.