Andhra Pradesh

News June 26, 2024

జగన్‌కు ప్రతిపక్ష హోదా అడిగే హక్కు లేదు: మంత్రి సంధ్యారాణి

image

ప్రతిపక్ష హోదా అడిగే హక్కు జగన్ ‌కు లేదని మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభలో ఒక్క నిమిషం కూడా ఉండలేని జగన్ ఇంకా ప్రజా సమస్యల కోసం ఏం పోరాడుతారని ప్రశ్నించారు.

News June 26, 2024

పర్చూరు: మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు.. కేసు నమోదు

image

పర్చూరు ప్రాంతానికి చెందిన వివాహిత కందుకూరులో మహిళ పోలీసుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త యూపీ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవల తరచూ భర్త తనను బెదిరించడంతో పాటు, వేధిస్తున్నాడని ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

News June 26, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,134 టీచర్ పోస్టులు ఖాళీలు

image

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,134 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఎస్జీటీ పోస్టులు 551, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి 583 పోస్టులు ఉన్నట్లు పేర్కొంది. స్కూల్ అసిస్టెంట్‌లో లాంగ్వేజ్-1 పోస్టులు 44, లాంగ్వేజ్ -2లో 43, ఇంగ్లీష్ 59, గణితం 66, ఫిజికల్ సైన్స్ 74, బయాలజీ 62, సోషల్ స్టడీస్ 99, హిందీ 139 ఖాళీలు ఉన్నాయి.

News June 26, 2024

కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం

image

నెల్లూరు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులకు కొత్త చట్టాలపై జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన చట్టాలు జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో, నూతన చట్టాలపై పోలీస్ అధికారులకు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

News June 26, 2024

గంపలగూడెం: విద్యుత్ షాక్‌తో లారీ డ్రైవర్ మృతి

image

గంపలగూడెం మండలం పెనుగొలనులో సుబాబుల్ లోడుతో వెళుతున్న లారీకి బుధవారం విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో ఆర్సీఎం చర్చి వద్ద విగతజీవిగా పడి ఉన్న లారీ డ్రైవర్‌ను చూసిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 26, 2024

ఏయూ: ఫుడ్ సైన్స్ టెక్నాలజీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న MSC ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ కోర్స్ రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. వీటితో పాటు MSC కెమిస్ట్రీ & అనాలసిస్ ఆఫ్ ఫుడ్ డ్రగ్ రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను, MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ రెండో సెమిస్టర్ ఫలితాలు, MSC ఎనలిటికల్ కెమిస్ట్రీ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

News June 26, 2024

సీఎం చంద్రబాబు రెండవ రోజు పర్యటన వివరాలు

image

చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండవ రోజు పర్యటనలో భాగంగా ఉదయం 10:30 గంటలకు కుప్పంలోని ఆర్అండ్ బీ అతిథి గృహానికి చేరుకుని ప్రజా వినతులు స్వీకరిస్తారని పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 2:35 గంటలకు పీఈఎస్ మెడికల్ కళాశాలలో సమావేశంలో పాల్గొంటారన్నారు.

News June 26, 2024

వైసీపీ నేత హత్య కేసు సీఐడీకి అప్పగింత.!

image

సంచలనం రేపిన వైసీపీ నేత హత్య కేసు సీఐడీకి అప్పగించారు. గత ఏడాది జూన్ 23న కడపలో వైసీపీ నేత శ్రీనివాస్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీనివాసరెడ్డిని వైసీపీ కార్యకర్తలే చంపారని, ఈ హత్యకు సెటిల్మెంట్లు, భూదందాలు కారణమని ఆరోపణలు వచ్చాయి. హత్యకు కుట్ర పన్నిన వారిని పోలీసులే తప్పించారని హతుడి భార్య ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డి భార్య అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.

News June 26, 2024

కృష్ణా: ఫార్మ్-డీ కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్-డీ(మూడో ఏడాది) కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 3, 5, 8, 10, 12, 15 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News June 26, 2024

నేడు ఓటేయనున్న శ్రీకాకుళం ఎంపీ

image

పార్లమెంట్‌లో నేడు లోక్‌సభ స్పీకర్ ఎలక్షన్ ​జరగనుంది. శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటేయనున్నారు.