Andhra Pradesh

News June 26, 2024

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో బైరెడ్డి ఫ్యామిలీ

image

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతికి శ్రీశైల మల్లికార్జున స్వామి ప్రసాదం, వస్త్రాన్ని అందించారు. త్వరలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తానని రాష్ట్రపతి చెప్పినట్లు శబరి తెలిపారు.

News June 26, 2024

పూసపాటిరేగ మండలంలో విషాదం

image

పూసపాటిరేగ మండలంలో విషాదం అలముకుంది. గోవిందపురానికి చెందిన శ్రీను జూనియర్ లైన్‌మెన్ వద్ద పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఘటనలో వెల్దూరికి చెందిన అర్జున్ రెడ్డి(38) మద్యానికి బానిస అవ్వడంతో కడుపునొప్పితో బాధపడేవాడు. రెండురోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో వెతకగా.. మంగళవారం ఓ తోటలో పురుగుమందు తాగి మృతిచెందినట్లు గుర్తించారు.

News June 26, 2024

మదనపల్లె: లాడ్జిలో ఉద్యోగి ఆత్మహత్యా యత్నం

image

బెంగళూరులో పనిచేసే ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మదనపల్లె లాడ్జిలో విషంతాగి ఆత్మ హత్యాయత్నంకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు..కేవీ పల్లెకు చెందిన శ్రీనివాసులు(38) బెంగుళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం స్వగ్రామంవచ్చి తిరిగి బెంగళూరు వెళ్లేందుకు సోమవారం మదనపల్లెకు వచ్చాడు. ఏం జరిగిందో ఏమో ఓలాడ్జిలో బసచేసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అస్పత్రికి తరలించారు.

News June 26, 2024

జగన్‌పై మండిపడ్డ మంత్రి గొట్టిపాటి రవి

image

స్పీకర్ పై మంగళవారం జగన్ రాసిన లేఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకనైన ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలని లేకపోతే క్రికెట్ టీం కాస్తా వాలీబాల్ టీం అవుతందని విమర్శించారు. ‘ప్రజలు జగన్ ను పాతాలానికి తొక్కేసినా చంద్రబాబు పెద్దమనసుతో గౌరవం ఇచ్చి అసెంబ్లీలో గౌరవం లభించేలా చేశారన్నారు. జగన్ వక్రభాష్యంతో లేఖ రాశారన్నారు’.

News June 26, 2024

నేడు ఓటేయనున్న అనంత, హిందూపురం ఎంపీలు

image

పార్లమెంట్‌లో నేడు లోక్ సభ స్పీకర్ ఎలక్షన్​ జరగనుంది. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, హిందూపురం ఎంపీ పార్థసారథి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇరువురు టీడీపీ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటేయనున్నారు.

News June 26, 2024

కడపలో తల్లి-కుమార్తెల ఆత్మహత్యాయత్నం

image

కడపలో తల్లీ-కుమార్తెలు ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంకరాపురానికి చెందిన శారదకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె స్వాతి కానిస్టేబుల్ పవన్ కుమార్‌ను కులాంతర వివాహ చేసుకుని దూరంగా ఉంటున్నారు. పవన్‌కుమార్ తనను, తన పెద్ద కుమార్తె మానసికంగా వేధిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్నాడంది. వేధింపులు భరించలేక ఇద్దరు విషద్రావణం తాగారు. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

News June 26, 2024

పరవాడ: ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు

image

పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలో ఓ దళిత మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనలో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు పరవాడ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. భర్త చనిపోయిన యశోదతో కె.రమేశ్ సహజీవనం చేస్తున్నాడు. ఇది రమేశ్ తండ్రి సత్యనారాయణకు ఇష్టం లేదు. ఈనెల 23న చెక్ పోస్ట్ వద్ద యశోదతో రమేశ్ మాట్లాడుతుండగా అతని తండ్రి, చెల్లి యశోదపై కత్తితో దాడి చేశారు.

News June 26, 2024

విపరీతంగా పెరిగిపోతున్న కూరగాయల ధరలు

image

నగరంలో కాయగూరలు ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్‌లో రెండు మూడు రకాలు మినహా దాదాపు అన్నీ కిలో రూ.40 కి చేరాయి. బహిరంగ మార్కెట్‌లో అయితే అదనంగా మరొక రూ.20 బాదుతున్నారు. దొండ రూ.28 రూపాయలు, క్యాబేజీ రూ.30, బీట్రూట్ రూ.32, క్యారెట్ రూ.38, బెండ రూ.34, వంకాయలు తెల్లవి రూ.44, నల్లవి రూ.54, టమాటా రూ.64, బరబాటి రూ.54, బీన్స్ రూ.120, అల్లం రూ.160 బంగాళదుంపలు రూ.32 ఉల్లిపాయలు రూ.36 గా ధర పలుకుతున్నాయి.

News June 26, 2024

పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజల నుంచి పద్మ పురస్కారాలు-2025 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుందని ఉమ్మడి గుంటూరు స్టెప్ సీఈవో కె. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సాంఘిక సేవా కార్యక్రమాలు, సైన్స్ రంగాల్లో విశేష కృషి, సాధించిన ప్రగతిని తెలియజేస్తూ 800 పదాలు మించకుండా నివేదికను తయారుచేసి నిర్ణీత దరఖాస్తును ఆన్ లైన్ లో సమర్పించాలన్నారు.

News June 26, 2024

శ్రీకాకుళం: చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష

image

చెక్ బౌన్స్ కేసులో రాజు అనే వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ సిటీ యూనియన్ ఫైనాన్స్ కంపెనీ వద్ద రాజు రూ.4 లక్షల రుణం తీసుకున్నాడు. కొంత నగదుకు సరిపడా చెక్ ఇచ్చారు. సొమ్ము జమ చేస్తున్న సమయంలో బ్యాంకు ఖాతాలో నగదు లేనందున సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ జరిపి ప్రిన్సిపల్ జుడీషియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శారదాంబ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.