Andhra Pradesh

News June 26, 2024

కావలి: అన్న మరణాన్ని తట్టుకోలేక తమ్ముడు గుండెపోటుతో మృతి

image

ఇంట్లో జారిపడి అన్న మృతి చెందగా ఆ బాధతో గుండెపోటుకు గురై తమ్ముడు మరణించిన విషాదకరమైన ఘటన కావలిలో జరిగింది. కావలి పట్టణంలోని క్రిస్టియన్‌పేటలో నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి సుధాకర్‌రెడ్డి(70) ఆదివారం తన ఇంట్లో జారిపడి మృతి చెందాడు. అన్న మృతదేహం వద్ద మనోవేదనకు గురైన ఆయన సోదరుడు వెంకటశేషారెడ్డి ఇంట్లోకి వెళ్లి అక్కడే కుప్పకూలిపడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.

News June 26, 2024

డాక్టర్ కాదు కామాంధుడు

image

శ్రీసత్యసాయి జిల్లాలో కామాంధ వైద్యుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని వైద్యుడు ఉదయ్‌ రోజూ రాత్రి 9 తర్వాత ఆసుపత్రి, సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు సెల్‌ఫోన్లలో అసభ్యకర సందేశాలు పంపుతున్నాడు. ‘మీరు కాకపోతే మీ పిల్లలను పంపించండి’ అంటూ ఒత్తిడి చేస్తుండటతో ఐదుగురు ఏఎన్‌ఎంలు మంగళవారం జిల్లా వైద్యాధికారిణి మంజువాణికి ఫిర్యాదు చేశారు. ఆమె దీనిపై విచారణకు ఆదేశించారు.

News June 26, 2024

విజయవాడ: ప్రేమించిన వ్యక్తి మాట్లాడటం లేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది..

image

ప్రేమించిన వ్యక్తి 2 నెలలుగా మాట్లాడటం లేదని ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మేరకు యువతి సోదరుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిజియోథెరపి చదవిన యువతికి 6 నెలల కిందట ఓ ప్రొఫెసర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తనను నమ్మించి మోసం చేశాడని, 2 నెలలుగా మాట్లాడట్లేదనే మనస్తాపంతో యువతి ఈ నెల 23న ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

News June 26, 2024

ఒంగోలు: అంబులెన్స్ వాహనాల్లో ఉద్యోగ అవకాశాలు

image

జిల్లాలో 1962 పశు సంచార అంబులెన్స్ వాహనాలకు సంబంధించి ఖాళీగా ఉన్న పైలట్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ నెమలి శివశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీలో భాగంగా పైలట్ పోస్టుకి పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి హెవీ లైసెన్స్ లేదా బ్యాడ్జి లైసెన్స్ కలిగి ఉండాలన్నారు . ఈ నెల 28వ తేదీ ఒంగోలు బస్టాండ్ సమీపంలో ఉన్న కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News June 26, 2024

తూ.గో: తల్లి మరణించిన కాసేపటికే కొడుకు కన్నుమూత

image

తల్లి మరణించిన కాసేపటికి కొడుకు కన్నుమూసిన విషాద ఘటన తాళ్లరేవులో జరిగింది. మృతుడి భార్య 8ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. నూకరాజుకు పక్షవాతం ఉండడంతో తల్లి కామేశ్వరి చేపల వ్యాపారం చేసి చూసుకొనేది. మంగళవారం రక్తపోటు రాగా ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. నూకరాజుకు తల్లిని చూపించి దహనసంస్కారాలకు తీసుకెళ్లారు. దీంతో కాసేపటికే కొడుకు కన్నుమూశారు.

News June 26, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

చాగల్లు-రాజమండ్రి సెక్షన్ల మధ్య ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన విజయవాడ- కాకినాడ పోర్ట్ మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లను యధావిధిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు విజయవాడ రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.17257 విజయవాడ- కాకినాడ పోర్ట్, నం.17258 కాకినాడ పోర్ట్- విజయవాడ రైళ్లను యధావిధిగా నడుపుతామన్నారు.

News June 26, 2024

తిరుపతి: నేటి నుంచి ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్

image

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నుంచి ఏపీ ఈసెట్- 2024 కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిప్లొమా (ఇంజినీరింగ్ ) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ బుధవారం నుంచి జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేటర్ డా. వై.ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. వివరాలకు_https://ets. apsche.ap.gov.in చూడాలన్నారు.

News June 26, 2024

కర్నూల్: కుక్కను హింసించిన యువకుడిపై కేసు

image

కర్నూలు జిల్లాలో జంతువుపై క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తికి పోలీసులు బుద్ధి చెప్పారు. ఆలూరుకు చెందిన వినోద్‌ తన పెంపుడు కుక్క కాళ్లు పట్టుకొని పైకి లేపి తిప్పుతూ హింసించాడు. పైగా ఈ వీడియోను ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేశాడు. తెలంగాణకు చెందిన స్ట్రే యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రతినిధులు వినోద్‌ కుక్కను హింసించాడని కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాలతో అతడిపై ఆలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 26, 2024

ప్రొద్దుటూరు: పోలీసుల అదుపులో హంతకుడు

image

వైఎంఆర్ కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన వెంకట మహేశ్వరరెడ్డి (30) హత్య కేసులో నిందితుడు భూమిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహేశ్వరరెడ్డిని ఎందుకు అంత కిరాతకంగా హత్య చేయాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తులో ఉంది. కాగా మహేశ్వరరెడ్డిని ముక్కలుగా నరికి సంచుల్లో వేసుకొని మైలవరం కాలువ వద్ద వేసిన విషయం తెలిసిందే.

News June 26, 2024

తిరుపతి: కాకినాడ, విశాఖ రైళ్ల రద్దు

image

విజయవాడ డివిజన్ లోని నిడదవోలు-కడియం సెక్షన్లో నిర్వహణ పనుల కారణంగా తిరుపతి నుంచి రాకపోకలు సాగించే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి-కాకినాడ టౌన్ (17249) రైలును ఆగస్టు 10,కాకినాడ టౌన్-తిరుపతి (17250) రైలును ఆగస్టు 11,తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్ (22708) ను ఆగస్టు 9వరకు, విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ (22707) రైలును 10వ తేదీ వరకు రద్దు చేశారు.