Andhra Pradesh

News June 26, 2024

కొలిమిగుండ్ల: ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

image

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది.కొలిమిగుండ్ల మండలకేంద్రానికి చెందిన పుల్లయ్య కుమారుడు సింహాద్రి(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరుగుతుందో లేదోనన్న ఆందోళనతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. సీఐ గోపీనాథ్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News June 26, 2024

ATP: పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య

image

నత్తితో ఇబ్బంది పడుతున్న యువకుడు తనకు వివాహం కాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన లక్ష్మీనారాయణకు(28) నత్తి ఉంది. దీంతో పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి తిమ్మక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 26, 2024

తాడేపల్లిగూడెం: పెరుగుతున్న టమాట ధర

image

టమాట సీజన్ ముగియడంతో ధర పెరిగిపోతోంది. ప్రస్తుతం దిగుమతులు తగ్గడంతో నెల రోజుల్లోనే టమాట ధర రెట్టింపైంది.  మంగళవారం తాడేపల్లిగూడెం బహిరంగ మార్కెట్లో కిలో టమాట రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయించారు. జిల్లాలోని పలు ప్రాంతాల రైతు బజార్లలో రూ.68 వరకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు టమాట అందని పరిస్థితి నెలకొంది.

News June 26, 2024

అన్నవరం సత్యదేవుని దర్శన విధానంలో మార్పులు

image

అన్నవరం సత్యదేవుని దర్శన విధానంలో మార్పులు చేపట్టారు. దశమి, ఏకాదశి, పౌర్ణమి తదితర పర్వదినాలు, రద్దీ రోజుల్లో శీఘ్ర దర్శనం రూ.200, ప్రదక్షిణ దర్శనం రూ.300 టికెట్లు మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని ఈవో ఆదేశించారు. మధ్యాహ్నం మూడు తరువాతే రూ.300 ప్రదక్షిణ దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఎక్కువ సమయం నిరీక్షించడం, సాధారణ దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News June 26, 2024

VZM: మనస్తాపంతో వ్యక్తి మృతి

image

భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన కర్రోతు నారాయన (40) మద్యానికి బానిసయ్యాడు. భార్య ఎల్లమ్మ, మిగతా కుంటంబసభ్యులు తాగొద్దని పలుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణ ఈనెల 21న పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటింబీకులు విజయనగంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.

News June 26, 2024

ఒంగోలులో దారుణ హత్యను ఛేదించిన పోలీసులు

image

ఒంగోలులో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వారి వివరాల మేరకు.. యూపీకి చెందిన ధ్రువ్ చంద్రవర్మ ఒంగోలులో ఉంటూ మేస్త్రీ పనిచేస్తుంటాడు. శ్రీవాస్తవ అనే యువకుడు ధ్రువ్ వద్ద పనికి కుదిరి, రూ.10 వేలు కావాలనగా సాధ్యం కాదని చెప్పాడు. శ్రీవాస్తవ కోపంతో చంపేస్తానని బెదిరించాడు. కూలీల ముందు తనను అవమానించాడని రాంచరణ్ అనే వ్యక్తితో కుట్ర పన్ని శ్రీవాస్తవని గొంతు కోసి హత్య చేశారు.

News June 26, 2024

శ్రీకాళహస్తి: ప్రాణం తీసిన గాజు ముక్క

image

గాజు ముక్క ప్రాణం తీసిన ఘటన శ్రీకాళహస్తి మండలంలో జరిగింది. CI నరసింహారావు కథనం మేరకు.. పోలి గ్రామంలోని SCకాలనీకి చెందిన బాలాజీ, భార్య ధనలక్ష్మి(32) మధ్య ఆదివారం చిన్నపాటి వివాదం నెలకొంది. ఈనేపథ్యంలోనే బాలాజీ గడ్డం గీసుకుంటున్న సమయంలో కోపంతో చేతిలోని అద్దాన్ని భార్యపైకి విసిరాడు. దీంతో అద్దం గాజు ముక్క ధనలక్ష్మి గొంతుకు తగిలి తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తెలిపారు.

News June 26, 2024

విశాఖ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

గాజువాక కణితి రోడ్ సింహగిరి కాలనీలో గ్రామ దేవత తుంపాలమ్మ తల్లి పండుగలో మంగళవారం లైటింగ్ పెడుతున్న ఎలక్ట్రీషియన్ కోలా జోగి బాబుకి కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందారు. కరెంట్ తీగను నోటితో పట్టి లాగి తీగలను అతికించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.

News June 26, 2024

నెల్లూరు: టీడీపీ కీలక నేత కిలారి వెంకటస్వామి నాయుడు మృతి

image

నెల్లూరు జిల్లా టీడీపీ ముఖ్య నేత, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు కాసేపటి క్రితం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సుదీర్ఘకాలం టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. నిన్న సాయంత్రం వరకు ఎంతో చలాకీగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన… రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. బీవీ నగర్ సాయిబాబా మందిరం ఛైర్మన్‌గా కూడా కిలారి వెంకటస్వామి నాయుడు వ్యవహరిస్తున్నారు.

News June 26, 2024

శ్రీకాకుళం: దరఖాస్తుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పాతపట్నం, నందిగాం, తదితర మండలాల్లో ఉన్న గురుకులాల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. ఈ నెల 29న ఉ.10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.