Andhra Pradesh

News June 25, 2024

జలుమూరు: కారు ఢీకొని వృద్ధుడి మృతి

image

కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన జలుమూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జలుమూరు మండలం రాణ గ్రామానికి చెందిన వాన సింహాచలం(73) తన ద్విచక్ర వాహనంపై సారవకోట వెళుతుండగా గంగాధర పేట వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు జలుమూరు ఎస్సై మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 25, 2024

ఏలూరు: వివాహితతో ఎఫైర్.. ఆమె కూతురిపై అత్యాచారం

image

ఏలూరు జిల్లా ముదినేపల్లిలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. HYDలో ముద్దాయిని పట్టుకొని కైకలూరు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపర్చినట్లు తెలిపారు.

News June 25, 2024

టాలీవుడ్ స్టోరీస్ C/O ఉత్తరాంధ్ర

image

ఉత్తరాంధ్రలో జరిగిన యధార్థగాథలే.. కథలుగా వెండితెరపై అలరిస్తున్నాయి. ఇటీవల పలాస, జయమ్మ పంచాయతీ, కోటబొమ్మాళి లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తాజాగా.. పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న సిక్కోలు మత్స్యకారుడి స్టోరీలో నాగచైతన్య-సాయి పల్లవి నటిస్తున్నారు. రామ్‌చరణ్-బుచ్చిబాబు సినిమాకు కోడి రామ్మూర్తి జీవిత చరిత్రే ఆధారమని టాక్. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

News June 25, 2024

ప్రజల్లోకి వచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

image

వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రజల్లోకి రాలేదు. ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. తర్వాత జగన్‌తో జరిగిన సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు. ఈరోజు కర్ణాటక రాష్ట్రం హోస్‌కోటలో రామకుప్పం జడ్పీటీసీ సభ్యుడు నితిన్ రెడ్డి వివాహం జరిగింది. పెద్దిరెడ్డితో పాటు పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు ZP ఛైర్మన్ శ్రీనివాసులు ఇందులో పాల్గొన్నారు.

News June 25, 2024

టాలీవుడ్ స్టోరీస్ C/O ఉత్తరాంధ్ర

image

ఉత్తరాంధ్రలో జరిగిన యధార్థగాథలే.. కథలుగా వెండితెరపై అలరిస్తున్నాయి. ఇటీవల పలాస, జయమ్మ పంచాయతీ, కోటబొమ్మాళి లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తాజాగా.. పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న సిక్కోలు మత్స్యకారుడి స్టోరీలో నాగచైతన్య-సాయి పల్లవి నటించారు. రామ్‌చరణ్-బుచ్చిబాబు సినిమాకు కోడి రామ్మూర్తి జీవిత చరిత్రే ఆధారమని టాక్. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

News June 25, 2024

ఎన్టీఆర్: DSC పరీక్షకు సిద్ధమయ్యే వారికి ముఖ్య గమనిక

image

DSC పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం అభ్యర్థులు 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ స్టడీ సర్కిల్ ఎన్టీఆర్ జిల్లా సంచాలకులు ఈ.కిరణ్మయి తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పండరీపురం రోడ్ నెం.8, అశోక్‌నగర్‌లోని స్టడీ సర్కిల్‌లో కుల, ఆదాయ, విద్యార్హతల ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తామన్నారు.

News June 25, 2024

ప.గో: విషాదం.. వివాహిత ఆత్మహత్య

image

ప.గో జిల్లాలో వీరవాసరం మండలం పెరికిపాలెం గ్రామానికి చెందిన జ్యోతి(38) ఈనెల 24వ తేదీన ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి పాలకొల్లు ఆసుపత్రి తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు భర్త పోతరాజు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వీరవాసనం ఎస్సై రమేష్ తెలిపారు.

News June 25, 2024

ప్రకాశం: షాప్ ముందుకు నీళ్లు వచ్చాయని మర్డర్: ఎస్సై

image

చీరాలలో ఈనెల 23న పట్టపగలు జరిగిన హత్యలో నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. పోలీసుల వివరాలు.. కర్రీస్‌ పాయింట్‌ నిర్వాహకుడు కే.సంతోష్‌ రోడ్డుపై బబుల్‌తో నీళ్లు దొర్లించాడు. పక్కనే ఉన్న పండ్లషాప్ ముందుకు వెళ్లడంతో అందులో పనిచేసే ఉమామహేశ్వరరావు వాగ్వావాదానికి దిగాడు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. షాపు యజమాని యోసేఫ్‌ ప్రోద్బలంతో కత్తితో దాడి చేసి పరార్ అయ్యాడు.

News June 25, 2024

నంద్యాల: చిరుత పులి దాడిలో మహిళ మృతి

image

చిరుత పులి దాడిలో మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. మహానంది, సిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న పచ్చళ్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ షేక్ మెహరూన్ బి కట్టెల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లగా ఆమెపై చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో మృతి చెందిందని  బంధువులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News June 25, 2024

ఎక్కువ మంది పిల్లలను కనొద్దు: గీతాలక్ష్మి

image

సమాజంలో మహిళల ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ గీతాలక్ష్మి సూచించారు. ఎక్కువమంది పిల్లలను కనడం, ఎక్కువసార్లు ఆపరేషన్లు చేయడం ఆడవారి ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్పారు. సంతానం విషయంలో ప్రతిఒక్కరూ అవగాహనతో మెలగాలన్నారు. ‘ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు’ అనే నినాదాన్ని పాటించాలని పిలుపునిచ్చారు.