Andhra Pradesh

News June 25, 2024

టెక్కలి: రైతు భరోసా పథకం ‘అన్నదాత సుఖీభవ’ గా మార్పు

image

రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఇక ‘అన్నదాత సుఖీభవ’గా కొనసాగనుంది. ఈ మేరకు మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు సంబంధిత వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వ్యవసాయ పథకాలకు సంబంధించిన పేరును మార్పు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేరుతో పాటు ఏపీ ప్రభుత్వం లోగోను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

News June 25, 2024

కృష్ణా: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కాకినాడ టౌన్(CCT)- లింగంపల్లి(LPI) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07445 CCT- LPI రైలును జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు వారంలో 3 రోజులు, నం.07446 LPI- CCT రైలును జూలై 2 నుంచి అక్టోబర్ 1 వరకు వారంలో 3 రోజులు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడతో పాటు గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News June 25, 2024

చిత్తూరు జిల్లాలో కొత్తగా 2 మండలాలు

image

చిత్తూరు జిల్లాలో కొత్తగా 2 మండలాల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘కుప్పం నియోజకవర్గంలో మల్లనూరు, రాళ్లబూదగూరును మండలాలు చేయాలని కోరారు. నిన్ననే వీటి మీద ఆదేశాలు ఇచ్చా. ఇక కుప్పంలో 6 మండలాలు, ఓ మున్సిపాల్టీ ఉంటుంది. కుప్పం డిపో బస్సులను కూడా దొంగలించారు. వాటిని వెనక్కి తీసుకొచ్చాం. త్వరలో ఎలక్ట్రికల్ బస్సులను కుప్పం డిపోకు ఇస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.

News June 25, 2024

ప్రకాశం: పెరిగిన ధరతో లబ్ధి ఎంతంటే..

image

జిల్లాలో 4.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతున్నాయి. అందులో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఎకరాకు సగటున 1,900 కిలోల వరి దిగుబడి లభిస్తుంది. రూ.117 అదనపు ధర లభించడంతో వరి రైతులకు రూ.95కోట్లు అదనంగా సమకూరనుంది. మొక్కజొన్న మీద క్వింటాకు రూ.135 పెరగడంతో అదనంగా రూ.3,750 లాభం రానుంది. పత్తిపై అదనంగా క్వింటాకు రూ.501 పెంచడంతో అదనంగా రూ.6వేల వరకు లాభం చేకూరనుంది.

News June 25, 2024

పార్వతీపురం జిల్లాలో ఆడ ఏనుగు మృతి

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి కర్రల డిపో వద్ద ఓ ఆడ ఏనుగు(మహాలక్ష్మి) అనారోగ్య కారణాలతో మృతి చెందింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకొని పరిశీలించారు. మృతికి గల కారణాలను తెలుసుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాలతో అక్కడే గొయ్యి తీసి ఖననం చేశారు.

News June 25, 2024

విజయనగరం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంబేడ్క‌ర్

image

విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్ అంబేద్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లాకు బదిలీ మీద వెళ్తున్న ప్రస్తుత కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి నుంచి ఆయన చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని రంగాలపై అవగాహన పెంచుకుంటానని, ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు చేసేందుకు, ప్రజోపయోగ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

News June 25, 2024

మళ్లీ కుప్పం బిడ్డగానే పుడతా: చంద్రబాబు

image

కుప్పంలో చంద్రబాబు బహిరంగ సమావేశం ప్రారంభం కాగానే వర్షం మొదలైంది. దీంతో సమావేశం కొనసాగిద్దామా? కాసేపు ఆపుదామా అని సీఎం కోరగా.. కొనసాగించాలని కార్యకర్తలు కోరారు. ‘కుప్పం దేవుళ్లను నేరుగా చూడటానికి ఇక్కడికి వచ్చా. కుప్పంలో నా సామాజికవర్గ ప్రజలు లేరు. 40 ఏళ్లుగా గెలిపిస్తున్న ఈ వెనుకబడ్డ ప్రజలే నా సామాజికవర్గం. మరోసారి కుప్పం బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నా’ అని చంద్రబాబు అన్నారు.

News June 25, 2024

సంత్రాగచ్చి-విశాఖ రైలు రీ షెడ్యూల్

image

సంత్రాగచ్చి-విశాఖ రైలును రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సంత్రాగచ్చిలో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 8.20 గంటలకు బయలుదేరుతుందని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన రైలు ఆలస్యంగా వస్తుండడంతో దీనిని రీ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News June 25, 2024

ఏలూరు: GOOD NEWS.. 6 రైళ్ల పునరుద్ధరణ

image

ట్రాఫిక్ మెయింటనెన్స్ దృష్ట్యా గతంలో రద్దు చేసిన 6 రైళ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు విశాఖ-లింగంపల్లి(12805నెంబర్ రైలు), చంగల్‌పట్టు-కాకినాడ పోర్టు(17643) రైళ్లు.. జూన్ 26న విజయవాడ-కాకినాడ(17257), కాకినాడ పోర్టు-విజయవాడ(17258), లింగంపల్లి-విశాఖ(12806), కాకినాడ పోర్టు-చంగల్‌పట్టు(17644) రైళ్లు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు.

News June 25, 2024

దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌గా ఆచార్య విజయమోహన్

image

ఆంధ్రవిశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం సంచాలకుడిగా ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం సీనియర్ ఆచార్యులు ఎన్.విజయ్ మోహన్ నియమితులయ్యారు. ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి నియామక ఉత్తర్వులను ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య విజయ్ మోహన్‌ను విభాగ ఆచార్యులు, ఉద్యోగులు అభినందించారు.