Andhra Pradesh

News June 25, 2024

ప్రధాని మోదీతో ఎంపీ బైరెడ్డి ఫ్యామిలీ

image

ప్రధాని నరేంద్ర మోదీని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిశారు. తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని పార్లమెంట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానితో కాసేపు ముచ్చటించారు. ఈ ఫొటోలను బైరెడ్డి శబరి నెట్టింట పోస్ట్ చేశారు. ‘ప్రధాని మోదీని నా కుటుంబ సభ్యులతో కలిసి ఆశీస్సులు తీసుకున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.

News June 25, 2024

శ్రీకాకుళం: అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

image

వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ అధికారులతో టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం విజయవాడ వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఎరువులను సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో భూసార పరీక్షలు జరపాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల నమూనాలు సేకరించి ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించారు.

News June 25, 2024

‘నా పెళ్లికి రండి’.. బాలకృష్ణకు నటి వరలక్ష్మి ఆహ్వానం

image

నటి వరలక్ష్మి శరత్ కుమార్ హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణను ఆయన నివాసంలో కలిశారు. బాలకృష్ణ దంపతులకు కార్డు అందించి, తన వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే కొత్త జంటకు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియుడు నికోలయ్‌‌ సచ్‌దేవ్‌తో వరలక్ష్మి ఏడడుగులు వేయబోతున్నారు. జులై 2న వీరి పెళ్లి జరగనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News June 25, 2024

ఆల్ ది బెస్ట్ బ్రదర్: మంత్రి లోకేశ్

image

ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా ఇండియా టీ-20 టీంకు ఎంపికైన నితీశ్ కుమార్‌కు మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. వచ్చే నెలలో జింబాబ్వేలో జరిగే టీ-20 మ్యాచ్‌లో ఆడనున్న నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటి క్రికెట్‌లో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఐపీఎల్‌‌‌లో నితీశ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచనట్లు పేర్కొన్నారు.

News June 25, 2024

తాడేపల్లిగూడెం: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

image

తాడేపల్లిగూడెంలో ఆదివారం గల్లంతయిన బాలుడి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. మణికంఠ అనే బాలుడు సెలూన్ షాపుకు వెళ్లి యాగర్లపల్లి ఏలూరు కాలువలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన బాలుడి కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం తాడేపల్లిగూడెంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మణికంఠ మృతదేహం గుర్తించారు.

News June 25, 2024

ఏయూ పరీధిలోని MA పరిక్షా ఫలితాల విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని MA సంస్కృతం, MA ఇంగ్లీష్, MA తెలుగు, MA హిందీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ – సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షల విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచామని చెప్పారు.

News June 25, 2024

శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం

image

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో మంగళవారం ఉదయం భానుడు తన ప్రతాపం చూపడంతో ప్రజలు ఉక్క పోతతో అల్లాడారు. మధ్యాహ్నం ఎట్టకేలకు ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకుంటూ భారీ వర్షం కురవడంతో ఆయా ప్రాంత ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ఇటు పల్లపు ప్రాంత రైతులు ఈ వర్షం వరి నాట్లు వేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తపరిచారు.

News June 25, 2024

అనంతపురం జిల్లాలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

image

జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అనంతపురం జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.48 ఉండగా ఆ ధర నేటికి రూ.109.25కి చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.97.33 నుంచి రూ.97.11కి తగ్గింది. సత్యసాయి జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.110.62 ఉండగా ఆ ధర నేటికి రూ.110.28కి చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.98.39 నుంచి రూ.98.05కి తగ్గింది.

News June 25, 2024

అమ్మవారి మాలధారణలో పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ అమ్మవారి మాలలో దర్శమమిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ MLAలకు ఆయన శాసనసభ వ్యవహారాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే నియోజక వర్గంలోని సమస్యలపై ఆయన దూకుడు కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ అవగాహన కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కూడా హాజరయ్యారు.

News June 25, 2024

జగన్‌ది కిమ్‌ను తలదన్నే వ్యవహారశైలి: దేవినేని ఉమా

image

మాజీ సీఎం జగన్‌ది కిమ్‌ను తలదన్నే పెత్తందారీ వ్యవహార శైలి అని TDP సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు. ‘ఆయన ఇంట్లో ఉంటేనే 986 మందితో రక్షణ. బయటకొస్తే పరదాలతో పాటు 3 రెట్లు అదనం. కుటుంబం, రాజభవనాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. తాడేపల్లి ప్యాలెస్‌కు దగ్గర్లోని అరాచకాలు పట్టించుకోలేదు. ప్రజల భద్రత గాలికి వదిలేసి విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేంటి?’ అని జగన్‌ను ఆయన Xలో ప్రశ్నించారు.