Andhra Pradesh

News June 25, 2024

కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు: జేసీ

image

ఏలూరు జిల్లాలో కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జేసీ బి. లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. టమాటా, ఉల్లి, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాటి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో పుష్పమణి , జిల్లా వ్యవసాయ శాఖాధికారి హబీబ్ బాషా, ఉద్యాన శాఖ ఏడీ రామ్మోహన్ పాల్గొన్నారు.

News June 25, 2024

కర్నూలు జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే?

image

మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1801 ఎస్టీటీలతో కలిపి మొత్తం 2678 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్‌లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.

News June 25, 2024

అనంతపురం జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే?

image

మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 183 ఎస్టీటీలతో కలిపి మొత్తం 811 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్‌లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.

News June 25, 2024

ఈనెల 27న మార్కాపురంలో జాబ్ మేళా

image

మార్కాపురంలో ఈనెల 27న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సోమవారం ప్రిన్సిపల్ నరేంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఏడు కంపెనీలకు చెందిన వారు పాల్గొని, విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఐటీఐ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ మేళాలో పాల్గొనాలని సూచించారు.

News June 25, 2024

విజయవాడ: నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

విజయవాడలో ఎలాంటి అనుమతులు, ప్లాన్ అప్రూవల్ లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారంటూ నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. విద్యాధరపురం కార్మిక శాఖ స్థలంలో కనీసం ప్లాన్ అప్రూవల్ కూడా లేకుండా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం పూర్తిగా అక్రమ నిర్మాణమని అధికారులు పేర్కొన్నారు. 7 రోజుల్లోపు సమాధానం ఇవ్వకపోతే కూల్చివేస్తామని వారు వెల్లడించారు.

News June 25, 2024

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు అంతర్జాతీయ నిపుణులు

image

పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఈ నెల 27న రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టు పరిశీలనకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన నలుగురు ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం రానుంది. ప్రాజెక్టు వద్ద ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి సవాలుగా ఉన్న డయాఫ్రంవాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల సీపేజీ అంశాలను పరిశీలించనున్నారు.

News June 25, 2024

తిరుపతి: హత్యకేసులో బాలుడు సహా నలుగురి అరెస్టు

image

మద్యం మత్తులో ఒకరిని గొంతుకోసి హతమార్చిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడైన మైనర్‌ను జువైనల్ హోమ్‌కు తరలించినట్లు అలిపిరి సీఐ రామారావు పేర్కొన్నారు. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు గ్రామానికి చెందిన ప్రసాద్ ఈనెల 14న ఆటోనగర్ చైతన్యపురం వద్ద హత్యకు గురయ్యారు.

News June 25, 2024

తూ.గో: కాలువల అభివృద్ధికి రూ.20.76 కోట్లు

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట కాలువలు, మురుగు కాలువలు, గుర్రపు డెక్క తొలగింపునకు ఆమోదం లభించిందని గోదావరి డెల్టా చీఫ్ ఇంజినీర్ సతీశ్ కుమార్ సోమవారం తెలిపారు. మొత్తం 306 పనులకు రూ.20.76 కోట్లు మంజూరు చేశారన్నారు. రూ. 31.50 కోట్లతో 430 పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించగా.. తొలి ప్రాధాన్యతగా 306 పనులకు నిధులు కేటాయించారని తెలిపారు. మిగిలిన పనులకు త్వరలో నిధులు మంజూరు అవుతాయన్నారు.

News June 25, 2024

విజయనగరం జిల్లా కలెక్టర్‌కు వీడ్కోలు

image

జిల్లా కలెక్టర్‌గా గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నగరంలో సోమవారం సాయంత్రం జరిగింది. జిల్లా అధికారుల సంఘం, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీ.సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.దీపిక, జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ పాల్గొని కలెక్టర్‌కు వీడ్కోలు తెలిపారు.

News June 25, 2024

ఉంగుటూరు: తెల్లవారుజామున ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

ఉంగుటూరు- ఆత్కూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టమాటా లోడుతో వెళుతున్న లారీకి పంక్చర్ పడగా, టైరు మార్చేందుకు అటుగా వెళ్తున్న టాటా మ్యాజిక్ డైవర్ సాయం వచ్చాడు. ఈ క్రమంలో సిమెంట్ లారీ అతివేగంగా వచ్చి వీరిని ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.