Andhra Pradesh

News June 25, 2024

VZM: ఇంటింటికి ORS ప్యాకెట్లు, జింక్ మాత్రల పంపిణీ.. జేసీ

image

విజయనగరం జిల్లాలో అతిసారం వ్యాధి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ కే.కార్తీక్ చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఐదేళ్ల లోపు పిల్లలు వ్యాధి బారిన పడకుండా ఇంటికి ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను, జింక్ మాత్రలను పంపిణీ చేయాలన్నారు.

News June 25, 2024

పలమనేరులో సందడి చేసిన ‘వృషభ’ సినీ బృందం

image

పెద్దపంజాణి మండలం ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో ‘వృషభ’ సినిమా షూటింగ్ సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగింది. చిత్రంలో నటించిన పలువురు జూనియర్, సీనియర్ నటులను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. కాగా పలమనేరు నియోజకవర్గంలో గత కొన్నిరోజుల నుంచి వరుస షూటింగ్లు జరుగుతుండడంతో సందడి నెలకొంది. నిర్మాత ఉమాశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. పలమనేరులో లొకేషన్స్ బాగుంటాయని కితాబు ఇచ్చారు.

News June 25, 2024

తాడేపల్లిగూడెం: దొరకని బాలుని ఆచూకీ.!

image

తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామానికి చెందిన మణికంఠ(16) ఆదివారం ఉదయం పట్టణంలోని యాగర్లపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఏలూరు కాలువలో పడి గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సోమవారం గాలింపు చర్యలు కొనసాగించారు. గజఈతగాళ్లు, మరబోట్లు సాయంతో కాలువలో గాలించినా ఆచూకీ దొరకలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలు విరమించుకున్నారు. అతని ఆచూకీ ఇంకా దొరకక పోవడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

News June 25, 2024

కృష్ణా: ఈ నెల 30తో ముగియనున్న గడువు

image

దూరవిద్యా విధానంలో MBA, పీజీ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్లకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులో చేరాలనుకున్న విద్యార్థులు జూన్ 30లోపు అడ్మిషన్ పొందవచ్చని ఇగ్నో వర్సిటీ సూచించింది. అడ్మిషన్లకై https://ignouadmission.samarth.edu.in/అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్ వర్గాలు సూచించాయి.

News June 25, 2024

27న జిల్లాకు కొత్త కలెక్టర్ తమీమ్ అన్సారియా

image

జిల్లాకు తాజాగా నియమితులైన కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈనెల 27న రానున్నారు. ఆరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసి అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ అయిన ఏఎస్ దినేష్ కుమార్ ఈనెల 26న రిలీవ్ కానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు జిల్లా అధికారులు వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు.

News June 25, 2024

నెల్లూరు: వచ్చే నెలలో రొట్టెల పండుగ

image

రాష్ట్ర పండుగగా జరుపుకునే నెల్లూరులోని బారాషహీద్ రొట్టెల పండుగకు ఈసారి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 17వ తేదీ నుంచి ఐదు రోజులపాటు స్వర్ణాల చెరువు చెంతన జరిగే ఈ వేడుకకు ముస్లింలతో పాటు హిందువులు భారీగా తరలివస్తారు. ఇందుకోసం నగర పాలక సంస్థ వివిధ ప్రజా అవసరాల పనులకు రూ.3.1 కోట్లు కేటాయించింది. ప్రైవేట్ కూలీలు, చెత్త తరలింపునకు ప్రైవేట్ వాహనాలు అంశాలతో కూడిన 11 పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.

News June 25, 2024

ప్రొద్దుటూరు: ముక్కలు ముక్కలుగా నరికి.. సంచుల్లో..

image

ప్రొద్దుటూరులో సోమవారం దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. YMR కాలనీలో నివాసం ఉండే రత్నమ్మ భర్త చనిపోవడంతో రామచంద్రారెడ్డితో సహజీవనం చేస్తున్నారు. రత్నమ్మకు కొడుకు మహేశ్వరరెడ్డి ఉండగా, ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు. మహేశ్వరరెడ్డికి, రామచంద్రారెడ్డి మధ్య గొడవ జరిగింది. దీంతో రామచంద్రారెడ్డి మహేశ్వరరెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికి, సంచుల్లో వేసుకొని మైలవరం ఉత్తర కాలువవద్ద పడేశాడు.

News June 25, 2024

విశాఖ: ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు

image

విశాఖ – విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేయడంతో ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ద్వారక బస్ స్టేషన్ నుంచి 12 ప్రత్యేక సర్వీసులు, శ్రీకాకుళం విజయనగరం నుంచి మరో మూడు ప్రత్యేక సర్వీసులు విజయవాడకు నడుపుతామని తెలిపారు. వందే భారత్ రైలు ప్రయాణికుల కోసం విశాఖ నుంచి విజయనగరానికి రాత్రి వేళల్లో ప్రత్యేక బస్ సర్వీసు ఏర్పాటు చేశామన్నారు.

News June 25, 2024

VZM: నేడు జిల్లాకు కొత్త కలెక్టర్

image

విజయనగరం జిల్లా కలెక్ట‌ర్‌గా నియమితులైన బీ.ఆర్.అంబేడ్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం జిల్లాకు చేరుకుంటారు. కలెక్టరే‌ట్‌లో మధ్యాహ్నం ప్రస్తుత కలెక్టర్ నాగ లక్ష్మి ఆయనకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అవుతారని తెలియజేశారు.

News June 25, 2024

కర్నూలు: నకిలీ బంగారు గాజులతో బురిడీ

image

నకిలీ బంగారు గాజులు తాకట్టు పెట్టి రూ.లక్షల రుణం తీసుకునన్న ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ మండలం మాయలూరుకు చెందిన లక్ష్మీనారాయణ, పేరుసోములకు చెందిన అమీర్‌ గతేడాది కోవెలకుంట్లలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌‌లో నకిలీ బంగారు తాకట్టు పెట్టి రూ.6.66లక్షలు రుణంగా తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో ఆ గాజులు నకిలీవని తేలడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు కోవెలకుంట్ల ఎస్సై వరప్రసాద్‌ తెలిపారు.