Andhra Pradesh

News June 25, 2024

సత్యసాయి జిల్లా వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

సత్యసాయి జిల్లా వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. పుట్టపర్తి పట్టణ అభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మిస్తుండటంతో మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. భవనానికి నోటీసు అతికించడంతో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణకు తాఖీదులు ఇచ్చినట్లు కమిషనర్ అంజయ్య తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదో 7 రోజులలో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

News June 25, 2024

జంగారెడ్డిగూడెం : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

జంగారెడ్డిగూడెంలో వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. పట్టణంలో రాజుల కాలనీలో ఇళ్ల మధ్య వ్యభిచార గృహం నడిపిస్తున్నారనే సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం ఎస్సై జ్యోతి బసు తన సిబ్బందితో దాడి చేశారు. ఇద్దరు విటులు , ఇద్దరు అమ్మాయిలు, ఒక నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు.

News June 25, 2024

అమలాపురం: బాలికపై అత్యాచారం..15 ఏళ్లు జైలు

image

మైనర్ బాలికను గర్భవతి చేసిన నిందితునికి 15 సంవత్సరాల జైలు శిక్ష రూ.7వేల నగదు జరిమానా విధిస్తూ కాకినాడ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. అమలాపురం మద్దాల వారి పేటలో 2018 ఏప్రిల్ 2న తల్లిదండ్రులు లేని సమయంలో మైనర్ బాలికకు మత్తు పానీయాలు ఇచ్చి గణపతి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు.

News June 25, 2024

ప్రయాణికుల రద్దీతో గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ కారణంగా గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. జులై 1వ తేదీ నుంచి సెప్టెంబరు 30 తేదీ వరకు సోమ, బుధ, శుక్రవారాల్లో ప్రత్యేక రైలు (07445) కాకినాడలో 20.10 గంటలకు బయలుదేరి విజయవాడ 00.50, గుంటూరు 01.40, సత్తెనపల్లి 02.23, పిడుగురాళ్ల 02.47, సికింద్రాబాద్ 07.15 గంటలకు చేరుతుందన్నారు.

News June 25, 2024

కాకుమాను: వివాహిత ఫోన్‌కు సందేశాలు పంపిన వీఆర్వోపై కేసు

image

ఓ మహిళ ఫోన్ ‌కు సందేశాలు పంపిన వీఆర్వోపై కేసు నమోదైంది. కాకుమాను ఎస్సై రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. గార్లపాడు సచివాలయంలో విధులు నిర్వర్తించే వీఆర్వో వద్దకు 10 రోజుల కిందట ఓ వివాహిత తన కుమారుడి జనన ధ్రువీకరణ పత్రం కోసం వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో తన ఫోన్ నంబరు తీసుకొని, అప్పటి నుంచి అసభ్యకర సందేశాలు పంపిస్తున్నట్లు మహిళ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News June 25, 2024

నెల్లూరు గ్రామీణ DSP పై వేటు!

image

నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నెల్లూరు జిల్లాలో తొలివేటు పడింది. నెల్లూరు గ్రామీణ DSP పి.వీరాంజనేయరెడ్డిని తక్షణమే పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని రాష్ట్ర DGP ద్వారకా తిరుమలరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయన్ను విధుల నుంచి రిలీవ్ చేయాలని SP కె.ఆరిఫ్ హఫీజ్‌ను ఆదేశించారు. ఈయన 2022 నవంబరులో బాధ్యతలు చేపట్టారు. నగర DSP డి. శ్రీనివాసరెడ్డికి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

News June 25, 2024

ఒంగోలులో యువకుడి గొంతు కోసి హత్య

image

ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకుడిని సోమవారం రాత్రి అత్యంత కిరాతకంగా గొంతు కోసి ఎన్నెస్పీ కాలువలో పడేశారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో చెప్పులు మాత్రమే ఉన్నాయని వేరే ఆధారాలు లభించలేదన్నారు. మృతుడు బిహార్ లేదా యూపీకి చెందిన వలస కూలీగా భావిస్తున్నామన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు DSP కిషోర్ బాబు తెలిపారు.

News June 25, 2024

VZM: ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు

image

విశాఖ – విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేయడంతో ఆర్టీటీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ద్వారక బస్ స్టేషన్ నుంచి 12 ప్రత్యేక సర్వీసులు, శ్రీకాకుళం విజయనగరం నుంచి మరో మూడు ప్రత్యేక సర్వీసులు విజయవాడకు నడుపుతామన్నారు. వందే భారత్ రైలు ప్రయాణికుల కోసం విశాఖ నుంచి విజయనగరానికి రాత్రి వేళల్లో ప్రత్యేక బస్ సర్వీసు ఏర్పాటు చేశామన్నారు.

News June 25, 2024

శ్రీకాకుళంలో 27న మినీ జాబ్ మేళా

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ యువ కేంద్రంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్న జాబ్ మేళాలో భాగంగా ఎస్.కె సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ సంస్థలో పనిచేసేందుకు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జీతం రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు ఉంటుందని తెలియజేశారు. పదో తరగతి పాసైన వారు ఈ ఉద్యోగానికి అర్హులు.

News June 25, 2024

విధుల నుంచి రిలీవ్‌ అయిన కర్నూల్ కలెక్టర్‌

image

కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి డా.జి.సృజన రిలీవ్ అయ్యారు. NTR జిల్లా కలెక్టర్‌గా బదిలీ అవడంతో జేసీ నారపురెడ్డి మౌర్యకు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. తాను జిల్లా కలెక్టర్‌గా విధులను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్క అధికారి సహకరించారని తెలిపారు. హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఎన్నికలను విజయంవంతంగా నిర్వహించామని చెప్పారు. జిల్లా అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.