Andhra Pradesh

News June 24, 2024

అనంతలో మిద్దె మీద నుంచి జారి పడి వ్యక్తి మృతి

image

అనంతపురం నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఐదో వార్డ్ జిఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సోమవారం వెంకటేశ్ నాయక్ మిద్దె మీద నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూమృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

News June 24, 2024

రాజమండ్రి: అర్జీలు స్వీకరించిన ఎస్పీ జగదీష్

image

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం (పీజీఆర్ఎస్)’ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో తూ.గో జిల్లా ఎస్పీ పి.జగదీష్ సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను ఎస్పీ జగదీష్ స్వయంగా పరిశీలించి స్వీకరించారు. ప్రజా సమస్యలపై వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు.

News June 24, 2024

పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తాం: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా కల్పించారు. సమస్యలపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు.

News June 24, 2024

శభాష్ నితీశ్ కుమార్ రెడ్డి..!

image

విశాఖ బ్యాటింగ్ డైనమైట్, SRH ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇండియా టీ-20 టీంకు ఎంపికైన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. క్రికెట్ చరిత్రలో విశాఖ పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేస్తున్న సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నితీశ్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల ACA గౌరవఅధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

News June 24, 2024

నరసన్నపేట: చోరీ కేసులో ఆరు నెలల జైలు శిక్ష

image

చోరీ కేసులో ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ నరసన్నపేట సివిల్ జడ్జి సి.హరిప్రియ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. 2019 నవంబర్ 6 తేదీన నరసన్నపేటలో విద్యుత్ శాఖ ఏఈ పల్లి బాలకృష్ణ ఇంట్లో మండలానికి చెందిన బమ్మిడి దేవకుమార్ బంగారం దొంగతనం చేశాడు. ఈ మేరకు నేరం రుజువు కావడంతో ఆరు నెలల జైలు శిక్ష ఆమె విధించారు. ఈ క్రమంలో ముద్దాయిని రిమాండ్‌కు తరలించారు.

News June 24, 2024

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

తుగ్గలి మండలం పరిధిలోని ముక్కెళ్ల గ్రామానికి చెందిన రాజశేఖర్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముక్కెళ్ల సమీపంలో రాజశేఖర్ ఉండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. అతడిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో రాజశేఖర్ మృతి చెందారు.

News June 24, 2024

తిరుమలకు చేరుకున్న శ్రీలీల

image

వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం సినీనటి శ్రీలీల సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ముందుగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జీఎంఆర్ అతిథి భవనానికి వచ్చారు. రాత్రికి ఇక్కడే బస చేసి మంగళవారం వేకువజామున అష్టదళ పాద పద్మారాధన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకోనున్నారు.

News June 24, 2024

కర్నూలు: గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి మృతి

image

తుగ్గలి మండలం పరిధిలోని రాతన గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాముడు(58) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. సంజామల మండలానికి చెందిన ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ , ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలు ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

News June 24, 2024

టీడీపీ దాడులను అరికట్టండి: వైసీపీ

image

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మకమైన దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ దాడులను అరికట్టాలని కోరారు. ఈ మేరకు నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌ను వైసీపీ అగ్ర నేతలు సోమవారం సాయంత్రం కలిశారు. దాడుల గురించి ఎస్పీకి వివరించారు.

News June 24, 2024

విశాఖ: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. విజయవాడ డివిజన్ లో ఆధునికరణ పనులు కారణంగా రద్దు చేసిన రైళ్లల్లో కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. రైళ్ల రద్దుపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్ రైళ్లను ఈనెల 25 నుంచి యథావిధిగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితోపాటు రద్దీ తగ్గించేందుకు మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది.