Andhra Pradesh

News June 24, 2024

అర్జీలు స్వీకరించిన నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రభుత్వం మారిన తర్వాత మొదటి కార్యక్రమం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కలెక్టర్ ఎం.హరి నారాయణన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో లవన్న, జడ్పీ సీఈవో కన్నమ నాయుడు తదితర అధికారులు పాల్గొని అర్జీలు తీసుకున్నారు.

News June 24, 2024

భామిని: అడుగంటిపోయిన వంశధార

image

గతేడాది నవంబర్ నెల నుంచి వర్షాలు లేకపోవడంతో వంశధార నదిలో చుక్క నీరు లేక అడుగంటి పోయింది. వంశధార నది పరివాహ ప్రాంతమైన ఒడిశాలోను వర్షాలు కురవక పోవడంతో నదిలో నీటి ప్రవాహం లేకుండా పోయిందని తీర ప్రాంతాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. భామిని మండలంలో పసుకుడి గ్రామం వద్ద వంశధార నది ఎడారిని తలపింస్తోంది. ఈ ఏడాది వరి సాగుకు నీటి లభ్యత ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 24, 2024

విజయనగరం వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

విజయనగరం జిల్లా కేంద్రం రింగురోడ్డు సమీపంలోని మహరాజుపేట వద్ద నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయ భవనం అక్రమమని నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీచేశారు. వీఎంఆర్డీఏ అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంటూ.. నిర్మాణ పనులు తక్షణం నిలుపు చేయాలని, వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. కాగా సుమారు ఎకరా స్థలంలో ఇక్కడ వైసీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది.

News June 24, 2024

నెల్లూరు: ఇంటి వద్దకే పింఛన్.. మీ కామెంట్

image

నెల్లూరు జిల్లాలో దాదాపు 3.17 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ఏప్రిల్ నెల నుంచే పెరిగిన పింఛన్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో పాత బకాయిలు రూ.3వేలతో కలిపి జులైలో ఒక్కొక్కరికీ రూ.7 వేలు చొప్పున డబ్బులు అందుతాయి. వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బందే ఇంటికి వచ్చి నగదు అందజేస్తారని తాజాగా మంత్రి పార్థసారథి ప్రకటించారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను పక్కన పెట్టడంపై మీ కామెంట్.

News June 24, 2024

చిత్తూరు: టీ, బిస్కెట్లకే రూ.35 లక్షలు..!

image

చిత్తూరు ZP సమావేశాల్లో ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో సమావేశంలో టీ, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు, డ్రైఫూట్స్‌కు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఈ ఏడాది జనవరి సమావేశంలో ఏకంగా రూ.7.45 లక్షలు వాటికే వినియోగించారు. ఇలా 7 సమావేశాలకు రూ.35.61 లక్షల బిల్లులు పెట్టారు. ఈ తరహా ఖర్చులకు జనరల్ ఫండ్ నుంచి 15% వినియోగించాలని నిబంధన ఉండగా.. ఉల్లంఘించారని విచారణలో తేలింది.

News June 24, 2024

టెక్కలి: వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలు

image

టెక్కలి పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. టెక్కలి పోలీస్‌ స్టేషన్‌తో పాటు పోలీస్ సర్కిల్ కార్యాలయం, సబ్ డివిజనల్ కార్యాలయాల అధికారులు టెక్కలిలో ఉన్నప్పటికీ దుండగులు యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నగదు, బంగారం, బైక్‌లతో పాటు ఇతర విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయి.

News June 24, 2024

చాగల్లు రిజర్వాయర్‌లో మరో మృతదేహం లభ్యం

image

పెద్దపప్పూరు మండలం చాగల్లు డ్యామ్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉదయం మహిళ నజయా మృతదేహం లభ్యం కాగా.. తాజాగా మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీకి చెందిన మహబూబ్ బాషాగా పోలీసులు గుర్తించారు. వీరు ఇద్దరు మరిది, వదినలని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 24, 2024

ప్రజల మనసును గెలుచుకున్న కలెక్టర్

image

కేవ‌లం 14 నెల‌ల కాలంలోనే ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు కలెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి. ఈ కొద్ది రోజుల్లోనే ఆమె అజాత శ‌తృవుగా, అంద‌రికీ అభిమాన‌పాత్రుల‌య్యారు. జిల్లా అభివృద్ధి ప‌ట్ల త‌ప‌న, నిరంత‌ర శ్ర‌మ, ఎటువంటి భేష‌జాలులేని ప‌నితీరుతో ఆమె అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఒక‌వైపు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అధికారయంత్రాంగాన్ని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, విధులు నిర్వహించారని అధికారులు గుర్తు చేసుకున్నారు.

News June 24, 2024

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల సమావేశం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం ప్రారంభమైంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్‌కి నివేదించనున్నారు.

News June 24, 2024

ఆర్టీసీ బస్సులో నగర మేయర్.. సైకిల్‌పై కమిషనర్

image

పర్యావరణహితంగా నడుచుకోవాలని సందేశాన్ని చాటుతూ నగర మేయర్ హరి వెంకట కుమారి ఆర్టీసీ బస్సులో, జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ సైకిల్ పై ఈరోజు విధులకు హాజరయ్యారు. ప్రతి సోమవారం జీవీఎంసీ కార్యాలయంలోకి వాహనాలను అనుమతించరు. వీలైనంతవరకు ఉద్యోగులు, ప్రజలు ప్రజారవాణా వినియోగించాలని, కాలుష్యాన్ని నివారిస్తూ పర్యావరణహితంగా ఉండాలని ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తున్నారు.