Andhra Pradesh

News June 24, 2024

కొమరోలు: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

image

కొమరోలు మండలం నల్లగుంట్ల సమీపంలో సోమవారం బైకు అదుపుతప్పి ఒకరు మృతి చెందారు. బేస్తవారిపేట-తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని, మృతుడు బేస్తవారిపేట గ్రామానికి చెందిన వాసిగా సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 24, 2024

ఇ‌న్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అశోక్

image

విశాఖపట్నం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా కె.మయూర్ అశోక్ సోమవారం ఉదయం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్ ఏ.మల్లికార్జునను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జేసీగా విధులు నిర్వహిస్తున్న మయూర్ అశోక్ బాధ్యతలు చేపట్టారు.

News June 24, 2024

కాశినాయన మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి కాశినాయన మండలంలో అత్యధిక వర్షపాతం నమోదయింది. కాశినాయన మండల పరిధిలో 7.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, బద్వేలు మండలంలో 1.6 మి.మీ., రాజుపాలెం మండల పరిధిలో 1.2 మి.మీ., వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సరాసరి 0.3 గా నమోదయింది.

News June 24, 2024

కేబినెట్ ఆమోదం.. అనంతపురం జిల్లాలో 5.60 లక్షల మందికి లబ్ధి!

image

CM చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పింఛన్ పెంపునకు ఆమోదం తెలిపింది. ₹3 వేల నుంచి ₹4 వేలకు పెంచింది. జులై 1 నుంచే పెంపును అమలు చేయనుంది. జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో అనంతపురం జిల్లాలో సుమారు 2.80 లక్షలు, సత్యసాయి జిల్లాలో 2.72 లక్షల మంది లబ్ధి పొందనున్నారు.

News June 24, 2024

కేబినెట్ ఆమోదం.. కర్నూల్ జిల్లాలో 4.69 లక్షల మందికి లబ్ధి!

image

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పింఛన్ పెంపునకు ఆమోదం తెలిపింది. ₹3 వేల నుంచి ₹4 వేలకు పెంచింది. జులై 1 నుంచే పెంపును అమలు చేయనుంది. జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో కర్నూలు జిల్లాలో సుమారు 2.45 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.24 లక్షల మంది లబ్ధి పొందనున్నారు.

News June 24, 2024

శ్రీకాకుళం: జులై 29 నుంచి BFA, MFA పరీక్షలు

image

AU పరిధిలో BFA, MFA రెండో సెమిస్టర్ పరీక్షలను జులై 29 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. 29న BFA విద్యార్థులకు హిస్టరీ, 30న ఇంగ్లిష్, 31న ఫండమెంటల్స్ ఆఫ్ డిజైన్ MFA విద్యార్థులకు 30న మోడల్ ఇండియన్ ఆర్ట్, 31న మోడల్ రెస్టారెంట్ ఆర్ట్ పరీక్షలు జరగనున్నాయి.

News June 24, 2024

మూడునాలుగు రోజుల్లో పిఠాపురానికి పవన్ రాక

image

మూడు, నాలుగు రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. ఆదివారం ఆయన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో పట్టణ శివారులోని ఇల్లింద్రాడ వద్ద ఓ రైస్‌మిల్లులో సమావేశమయ్యారు. పవన్ పిఠాపురం ప్రజలను కలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నారని తెలిపారు. ఉపముఖ్యమంత్రిగా, 5 శాఖల బాధ్యతలు ఆయనపై ఉన్నాయని, వాటికి న్యాయం చేస్తూనే నియోజకవర్గంలో పర్యటిస్తారని చెప్పారు.

News June 24, 2024

ఇక ప్రతి సోమవారం ప్రజా సమస్యల స్వీకరణ: నిర్మల్ కుమార్

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం సోమవారం నుంచి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మార్చి నెలలో ఎన్నికల షెడ్యూల్ సందర్బంగా నిలిపివేసిన స్పందన కార్యక్రమం మళ్లీ ప్రారంభించామని ప్రతి సోమవారం కార్పోరేషన్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.

News June 24, 2024

గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా రాజకుమారి

image

గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారికి ఇన్‌ఛార్జ్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన ఎం. వేణుగోపాల్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించడంతో ఆయన స్థానంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.నాగలక్ష్మిని నియమించారు. ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

News June 24, 2024

బి.కొత్తకోట: చేపల వేటకు వెళ్లి రైతు మృతి

image

ఆలేటి వాగుకు చేపల వేటకు వెళ్లి రైతు మృతి చెందాడని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. పీటీఎం మండలం, రాపూరివాండ్లపల్లె గ్రామం, ఉప్పరవాండ్లపల్లెకు చెందిన రైతు ఎస్.నాగరాజ(50)శనివారం చేపలవేటకు బి.కొత్తకోట మండలంలోని ఆలేటివాగుకు వెళ్లాడు. చేపలు వేటాడుతుండగా పొర పాటున వాగులోపడి మృతి చెందాడు. సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా వెలికితీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.