Andhra Pradesh

News June 24, 2024

ఎంపీగా తెలుగులో పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం

image

గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం లోక్ సభలో ప్రమాణస్వీకారం చేశారు. మాతృభాష అయిన తెలుగులోనే ఆయన ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఆయనతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. దీంతో గుంటూరు జిల్లాలోని ఆయన అభిమానులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

News June 24, 2024

జIలై 27 నుంచి ఎమ్మెస్సీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

ఏయూ పరిధిలోని ఎమ్మెస్సీ కోర్సుల రెండవ సెమిస్టర్ పరీక్షలను జIలై 27వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు వారీగా పరీక్షల తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరుకావాలని పరీక్షల విభాగం అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం ఏయూ వెబ్సైట్‌ను సంప్రదించమన్నారు.

News June 24, 2024

ప్రొద్దుటూరులో మరో దారుణ హత్య

image

ప్రొద్దుటూరులోని YMR కాలనీలోని మాజీ MLA ఇంటి ఎదురుగా దారుణ హత్య చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. పట్టణానికి చెందిన వెంకట మహేశ్వర్ రెడ్డి భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇతడిని ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణలో భూమిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారించారు. కాగా శుక్రవారం అర్షత్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో మంత్రులు సంధ్యారాణి, శ్రీనివాస్

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉమ్మడి విజయనగరం నుంచి మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

విశాఖ: MA పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఏయూ

image

ఏయూ పరిధిలోని MA అంత్రపోలజీ, ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, కూచిపూడి క్లాసికల్ డాన్స్, హిస్టరీ, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, కర్ణాటక సంగీతం, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, ఏన్షియెంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్‌సై‌ట్‌లో అందుబాటులో ఉంచారు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో నారాయణ, ఆనం

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావడంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో హోంమంత్రి అనిత

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు ఉమ్మడి విశాఖ నుంచి హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ వినియోగం, రవాణాపై 100 రోజుల యాక్షన్‌ ప్లాన్ అమలు చేస్తున్న హోంమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది వేచిచూడాలి.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో కొల్లు రవీంద్ర, పార్థసారథి

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

శ్రీకాకుళం: ఆకాశాన్ని తాకుతున్న టమాట ధరలు

image

జిల్లాలో టమాట ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రైతు బజార్లో టమాటా ధర కిలో70 రూపాయలు, బహిరంగ మార్కెట్లో ఏకంగా 100 రూపాయలు పలుకుతుందని ప్రజలు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రైతు బజార్‌లో టమాటా నిల్వలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో తూ.గో. జిల్లా మంత్రులు

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు పవన్ కళ్యాణ్, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.