Andhra Pradesh

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో గుంటూరు జిల్లా మంత్రులు

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో ప.గో. జిల్లా మంత్రులు

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో అనంతపురం జిల్లా మంత్రులు

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్, ఎస్.సవిత, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో కర్నూల్ జిల్లా మంత్రులు

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్, ఫరూక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

విశాఖ: MA పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఏయూ

image

ఏయూ పరిధిలోని MA అంత్రపోలజీ, ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, కూచిపూడి క్లాసికల్ డాన్స్, హిస్టరీ, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, కర్ణాటక సంగీతం, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, ఏన్షియెంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్‌సై‌ట్‌లో అందుబాటులో ఉంచారు.

News June 24, 2024

చీరాల: సముద్ర తీరాలకు పర్యాటకుల నిలిపివేత?

image

చీరాల, బాపట్ల పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులను అధికారులు నిలిపివేస్తున్నారు. రెండ్రోజుల్లో ఆరుగురు పర్యాటకులు మృతిచెందడం, పలువురు గల్లంతు అయిన నేపథ్యంలో కొన్నిరోజుల పాటు పర్యాటకులను నిలిపివేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే చీరాల, బాపట్ల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. పర్యాటకులు గల్లంతు కాకుండా చర్యలు చేపట్టారు.

News June 24, 2024

సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్లిన విజయనగరం MP

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేడు ఢిల్లీలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు బయలుదేరారు. ముందుగా ఆయన తన తల్లికి పాదాభివందనం చేసి పార్లమెంటుకు వెళ్లారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు హాజరయ్యారు.

News June 24, 2024

నేటి నుంచి పాఠశాలల్లో విద్యా ప్రవేశం: డీఈవో

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నుంచి నాలుగు వారాల పాటు విద్యాప్రవేశం కార్యక్రమం అమలు జరుగుతుందని డీఈవో డి.సుభద్ర పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సమగ్రశిక్ష సంస్థ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు నూరుశాతం విద్యార్థుల నమోదు చేయించాలన్నారు. పర్యవేక్షణ కోసం దీక్ష యాప్‌ను వినియోగించుకోవాలన్నారు

News June 24, 2024

బాపట్ల: సముద్ర తీరాలకు పర్యాటకుల నిలిపివేత

image

బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులను అధికారులు నిలిపివేస్తున్నారు. రెండ్రోజుల్లో ఆరుగురు పర్యాటకులు మృతిచెందడం, పలువురు గల్లంతు అయిన నేపథ్యంలో కొన్నిరోజుల పాటు సముద్రతీరాలకు పర్యాటకులను నిలిపివేయాలని బాపట్ల పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే చీరాల, బాపట్ల పరిధిలో ఉన్న తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. పర్యాటకులు గల్లంతు కాకుండా చర్యలు చేపట్టారు.

News June 24, 2024

బీపీఈడీ, డీపీఈడీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. ఏప్రిల్ నెలలో జరిగిన పార్ట్-ఎ, పార్ట్-బీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలను విడుదల చేసి విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచినట్లు పరీక్షల విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను www.Andhrauniversity.edu.in నుంచి పొందవచ్చును.