Andhra Pradesh

News June 24, 2024

కావలిలో ప్రియురాలిపై ప్రియుడి దాడి

image

ఓ మహిళపై ఆమె ప్రియుడు దాడి చేసిన ఘటన కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలో జరిగింది. ఆదివారం ఈ మేరకు బాధిత మహిళ పోలీసులకు ఆశ్రయించింది. ఆమె భర్త మూడేళ్ల క్రితం మరణించడంతో తలకాయ రాజేశ్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కొన్నాళ్లుగా వీరి మధ్య విభేదాలు రావడంతో నిందితుడు దాడికి పాల్పడ్డాడు.

News June 24, 2024

అల్లూరి జిల్లాలో వైద్య బృందం పర్యటన

image

పెదబయలు మండలం చుట్టుమెట్టలో పలు విభాగాల సైకాలజిస్ట్ వైద్య బృందాన్ని పంపిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి జమాల్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 19న భూత వైద్యం చేస్తూ ఇద్దరు మృతి చెందిన ఘటనపై గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వైద్య బృందం పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందరూ ధైర్యంగా ఉండాలని ఆరోగ్య, నీటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

News June 24, 2024

మచిలీపట్నం: గుండెపోటుతో మార్నింగ్ వాకర్ మృతి

image

మచిలీపట్నం మున్సిపల్ మెయిన్ పార్కులో విషాదం చోటు చేసుకుంది. స్థానిక పంబలగూడెంకు చెందిన కర్ణపు శంకర్ రెడ్డి వాకింగ్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అదే పార్కులో వాకింగ్ చేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్, ఇనగుదురుపేట సీఐ విద్యాసాగర్ CPR చేసినా ఫలితం లేకపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

News June 24, 2024

శ్రీకాకుళం: భర్తను హత్య చేసిన భార్య

image

ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన కుప్పయ్యను ఆయన భార్య హారమ్మ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. గతేడాది కుప్పయ్య తన కుమారుడిని చంపి జైలులో ఉన్నాడు. ఇటీవలే ఆయన బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన కుప్పయ్యను రాత్రి హారమ్మ కత్తితో హత్య చేసింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

News June 24, 2024

కర్నూల్ జిల్లాకు వర్ష సూచన

image

కర్నూల్, నంద్యాల జిల్లాలకు నేడు వర్ష సూచన ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మంగళ, బుధవారాల్లో జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News June 24, 2024

మైపాడు బీచ్‌లో కడప యువకుడు మృతి

image

కడపకు చెందిన యువకుడు ఇమ్రాన్ నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ కు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కడపలోని ఆటో మెకానిక్ యూసుఫ్ కుమారుడైన ఇమ్రాన్ తన స్నేహితులతో కలిసి ఆటవిడుపు కోసం ఓ వాహనంలో ఆదివారం మైపాడు బీచ్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా సముద్రంలో గడుపుతుండగా పెద్ద అల ఇమ్రాన్‌ను తీసుకెళ్లింది. స్థానికుల సహకారంతో ఇమ్రాన్ మృతదేహాన్ని వెలికితీసి కడపకు తీసుకువచ్చారు.

News June 24, 2024

ప్రకాశం: కనిపించని వాన జాడ.. రైతుల ఎదురు చూపులు

image

జూన్ నెల పూర్తి కావొస్తున్న ప్రకాశం జిల్లాలో వర్షాల జాడ లేకపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ఖరీఫ్ సీజన్‌లో 90 వేల హెక్టార్లకు పైగా పంటలు జిల్లాలో సాగవుతుంటాయి. ఇందులో అత్యధికంగా 70-75 వేల హెక్టార్లలో కంది వేస్తుండగా, కొన్ని చోట్ల సజ్జ పండిస్తారు. ప్రస్తుతం కంది, పొగాకుకు మంచి ధరలు ఉండటంతో ఎక్కువ మంది వీటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఏ పంటలు వేయాలన్నా వరుణిడి కోసం రైతన్నలు ఎదురుచూపులు తప్పడం లేదు.

News June 24, 2024

కుప్పంలో చంద్రబాబు పర్యటన.. భారీ ఎత్తున వైసీపీ నేతల చేరిక?

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రానున్నారు. ఈ సమయంలో వైసీపీ నుంచి భారీ ఎత్తున ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు భారీ ఎత్తున పార్టీ మారనున్నట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో పార్టీ మారడంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

News June 24, 2024

భీమవరానికి వందే భారత్ రైలు

image

ప.గో. జిల్లావాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో భీమవరం మీదుగా ప్రయాణించనుంది. ప్రస్తుతం చెన్నై- విజయవాడల మధ్య నడుస్తున్న ఈ రైలు భీమవరం వరకు పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించింది. చెన్నై సెంట్రల్ రైల్వే సైతం పచ్చజెండా ఊపింది. ఈ రైలు ఏప్రిల్‌లోనే పట్టాలెక్కాల్సి ఉంది. ఎన్నికల కారణంగా పెండింగ్‌లో ఉన్న ఈ ట్రైన్ వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

News June 24, 2024

నెల్లూరులో సినీ స్టూడియో ప్రారంభం

image

నెల్లూరు ఇస్కాన్ సిటీలో 25 కళా సంఘాల సినీ స్టూడియోను ఆ కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలోని కళాకారుల ప్రతిభను చాటుకునేందుకు అనుకూలంగా స్టూడియోను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైటెక్ ఫార్మా రమణారెడ్డి, నారాయణ గ్రూపు ఆఫ్ హాస్పిటల్స్ AGM సీహెచ్ భాస్కర్ రెడ్డి, నిర్మాత షంషుద్దీన్, దోర్నాల హరిబాబు, అమీర్ జాన్ తదితరులు పాల్గొన్నారు.