Andhra Pradesh

News June 24, 2024

నెల్లూరులో సినీ స్టూడియో ప్రారంభం

image

నెల్లూరు ఇస్కాన్ సిటీలో 25 కళా సంఘాల సినీ స్టూడియోను ఆ కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలోని కళాకారుల ప్రతిభను చాటుకునేందుకు అనుకూలంగా స్టూడియోను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైటెక్ ఫార్మా రమణారెడ్డి, నారాయణ గ్రూపు ఆఫ్ హాస్పిటల్స్ AGM సీహెచ్ భాస్కర్ రెడ్డి, నిర్మాత షంషుద్దీన్, దోర్నాల హరిబాబు, అమీర్ జాన్ తదితరులు పాల్గొన్నారు.

News June 24, 2024

తూ.గో.: ALERT.. 4 రోజులు వర్షాలు

image

నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం కాకినాడ, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.☛ SHARE IT

News June 24, 2024

లాడ్జిలో దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

image

విశాఖకు చెందిన దంపతులు హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. రవీంద్ర కుమార్ (56), రాఖి (49) ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. భర్త కొద్ది రోజులు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం అతను ఖాలీగా ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో ఈనెల 21న హైదరాబాద్‌లోని లాడ్జిలో నిద్రమాత్రలు మింగారు. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా రవీంద్ర మృతి చెందారు.

News June 24, 2024

VZM: జిల్లాలో 308 మందికి చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను సోమవారం వెల్లడించారు. MV నిబంధనలు అతిక్రమించిన 308 మందిపై రూ.58,575 ఈ-చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 18 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 35 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయన్నారు.

News June 24, 2024

ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది సర్వే చేయాలి: డీఎంహెచ్ఓ సుహాసిని

image

జిల్లాలోని అన్ని గ్రామాల్లో సోమవారం నుంచి వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని ఆదేశాలు జారీ చేశారు. అనుమానిత డయోరియా, మలేరియా, డెంగీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News June 24, 2024

విశాఖ; ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్‌ల నియామకం

image

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ 2024-2025 సంవత్సరానికి సంబంధించి కోచ్‌లను నియమించింది. కేరళకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్ యోహానన్‌ను సీనియర్ పురుషుల విభాగానికి ప్రధాన కోచ్‌గా నియమించింది. అండర్-23 పురుషులకు జై కృష్ణారావు, సీనియర్ మహిళలకు ఎస్.రమాదేవి, అండర్-19 మహిళలకు ఎస్.శ్రీనివాసరెడ్డి, అండర్-15 మహిళా విభాగానికి ఎం.సవిత ప్రధాన కోచ్‌లుగా నిరమితులయ్యారు.

News June 24, 2024

ఢిల్లీలో శ్రీకాకుళం వాసి మృతి

image

నందిగాం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఢిల్లీలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కామధేనువు గ్రామానికి చెందిన మధుబాబు మూడేళ్లుగా ఢిల్లీలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం ఢిల్లీ రైల్వే స్టేషన్లో అపస్మారక స్థితిలో ఉన్న ఆయణ్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధు మృతి చెందాడు. ఆధార్ కార్డ్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు స్థానికపోలీసులకు సమాచారం అందించారు.

News June 24, 2024

ANU: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన డిగ్రీ 5వ సెమిస్టర్(BA, BCom, BCA, BAOL) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూలై 2వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు https://nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చంది.

News June 24, 2024

నరసరావుపేట: ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు

image

బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నరసరావుపేటలోని ఓ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామీణ పోలీసుల వివరాల ప్రకారం.. చందు అనే యువకుడు అదే ప్రాంతంలో ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామీణ స్టేషన్ ఎస్సై రోశయ్య కేసు నమోదు చేశారు.

News June 24, 2024

ANU: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన డిగ్రీ 5వ సెమిస్టర్(BA, BCom, BCA, BAOL) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జులై 2వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు https://nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చంది.