Andhra Pradesh

News April 19, 2025

రేపు జిల్లాకు రానున్న ఎంపీ మాగుంట

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మాగుంట కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొంటారు. 21వ తేదీన సాయంత్రం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.

News April 19, 2025

అనంతపురం జిల్లాలో 72 అటెండర్ పోస్టులు

image

అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 72 అటెండర్ పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం చేశామని DMHO దేవి తెలిపారు. ఇందులో MRI, MRN, OT టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, నెట్ అడ్మినిస్ట్రేటర్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, పెర్ ప్యూజినిష్ట్, అటెండర్ పోస్టులు ఉన్నాయన్నారు. 2023 నవంబర్‌లో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.

News April 19, 2025

జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

గుంటూరులో ఒక వ్యక్తి ఇంటి కల విషాదంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. ఫారూఖ్ ప్రగతినగర్‌లో తన ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి రాము అనే వ్యక్తికి రూ. 1 లక్ష ఇచ్చాడు. పనులు నెమ్మదిగా సాగడం, అడిగినా స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫారూఖ్, ఈ నెల 16న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2025

బూర్జ : స్విమ్మింగ్‌లో అరుదైన రికార్డు

image

బూర్జ మండలం డొంకలపర్తికి చెందిన గణేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి పారా స్విమ్మర్‌గా అరుదైన రికార్డు సాధించారు. ఏలూరు క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ గణేశ్ శుక్రవారం శ్రీలంకలోని తలైమన్నారు నుంచి భారతదేశంలోని ధనుష్కోటి వరకు పోటీజరిగింది. 28 కిలోమీటర్లను 10:30 గంటల్లో స్విమ్ చేసి రికార్డు నెలకొల్పారని AP పారాస్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి వి. రామస్వామి తెలిపారు.

News April 19, 2025

సంతనూతలపాడు MLA టికెట్ పేరుతో మోసం

image

ఎమ్మెల్యే టికెట్ పేరుతో ప్రకాశం జిల్లాలో మోసం జరిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ అదే పార్టీకి చెందిన నాగలక్ష్మి, ఆమె భర్త సతీశ్ రూ.10 లక్షలు తీసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. నగదు తీసుకుని తనను మోసం చేశారని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.

News April 19, 2025

విశాఖ మేయర్ పీఠం.. పార్టీల బలాబలాలు

image

మరికొద్ది గంటల్లో విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడనుంది. 2021లో జరిగిన GVMC ఎన్నికల్లో YCP 58 స్థానాలు నెగ్గి మేయర్ పీఠం కైవశం చేసుకుంది. TDP-30, JSP-3, CPM, CPI ఒక్కో స్థానం గెలిచాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమీకరణాలు మారాయి. దీంతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కూటమికి సుమారు 64 మంది, YCPకి 30 మంది కార్పొరేటర్‌లున్నారు. ఈ ఓటింగ్‌కు కమ్యూనిస్ట్ పార్టీలు దూరంగా ఉంటున్నాయి.

News April 19, 2025

బీచ్ ఫెస్టివల్‌లో తాబేళ్లు వదిలిన రామ్మోహన్ నాయుడు

image

సోంపేట మండలం బారువ సముద్రపు ఒడ్డున బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాబేలు పిల్లలను సముద్రంలో వదిలి పెట్టారు. ఫెస్ట్‌లో ఇసుకతో ఏర్పాటు చేసిన సైతక శిల్పం ఆకర్షణగా నిలిచింది. చుట్టు పక్క ప్రాంతాల వారు హాజరై ఆహ్లాదంగా గడుపుతున్నారు.

News April 19, 2025

శ్రీకాకుళం: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ గ్రామంలో జరిగిన వంటగ్యాస్ ప్రమాదంలో మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన జామి జయలక్ష్మి మార్చి 19వ తేదీన రాత్రి గ్యాస్ పేలి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని కేజీహెచ్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

News April 19, 2025

బొత్స వ్యూహాలు ఫలించేనా

image

విశాఖలో ఉదయం 11 గంటలకు GVMC మేయర్‌పై అవిశ్వాస ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం కూటమికి ఉందని MLAలు చెబుతున్నారు. YCP కార్పొరేటర్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ MLC బొత్స పిలుపునిచ్చారు. అదిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కూటమిలోని పలువురు కార్పొరేటర్‌లతో బొత్స సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. మరి మేయర్ పీఠంపై బొత్స వ్యూహాలు ఫలిస్తాయా?

News April 19, 2025

VJA: లాయర్ల మధ్య వివాదం

image

విజయవాడ కోర్టులో ఇద్దరు మహిళా న్యాయవాదుల గొడవ పడిన ఘటన చోటు చేసుకుంది. జూనియర్ లాయర్ మనిప్రియ మాట్లాడుతూ.. సీనియర్ లాయర్లు సౌందర్య, పిట్టల శ్రీనివాస్ కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని నిరసన తెలిపారు. సౌందర్య, శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనిప్రియపై 307 కేసు ఉందని, ఆమె జడ్జి ఎదుట అసభ్యంగా మాట్లాడి, బట్టలు చింపుకొని గొడవ చేసిందన్నారు. దీనిపై బార్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.