Andhra Pradesh

News June 24, 2024

శ్రీకాకుళం: ప్రశ్నార్థకంగా 8,784 మంది వాలంటీర్లు భవిష్యత్తు

image

జిల్లాలో సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించిన పలువురి వాలంటీర్ల భవిష్యత్తు నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలకు ముందు దాదాపు 8,784 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. ప్రభుత్వం మారడంతో వారంతా లబోదిబో మంటున్నారు. వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడికి వారంతా మొర పెట్టుకున్నారు.

News June 24, 2024

శ్రీకాళహస్తి: లారీ ఢీకొని జూనియర్ లైన్‌మెన్ స్పాట్ డెడ్

image

లారీ ఢీకొనడంతో విద్యుత్తు శాఖలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న హేమంత్ దుర్మరణం చెందారు. భాస్కరపేటలో నివాసముంటున్న హేమంత్ ఆదివారం మిట్టకండ్రిగలోని సొంతింటికి వెళ్లి రాత్రి బైకుపై భార్య దివ్యతో కలిసి బయలుదేరారు. హౌసింగుబోర్డు కాలనీ వద్ద బైకును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 24, 2024

ప్రకాశం: భార్యాభర్తలిద్దరూ కలెక్టర్లే

image

ప్రకాశం జిల్లాకు నూతన కలెక్టర్ గా తమీమ్ అన్సారియాను నియమితులైన విషయం తెలిసిందే. 2015 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అన్సారియా గతేడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈమె భర్త 2012 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మనజీర్ జిలానీ సామూన్ ప్రస్తుతం శ్రీకాకుళం కలెక్టర్‌గా ఉన్నారు. గతేడాది ఒకేసారి ఇద్దరు శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వచ్చారు. తాజాగా అన్సారియా ప్రకాశం కలెక్టర్‌గా నియమితులయ్యారు.

News June 24, 2024

నేడు కర్నూల్, నంద్యాల జిల్లా ఎంపీల ప్రమాణ స్వీకారం

image

18వ లోక్‌సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా జిల్లా ఎంపీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిలతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయిస్తారు. వీరిరువురూ తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బైరెడ్డి శబరి వ్యవహరించనున్నారు.

News June 24, 2024

ATP: టమాట కిలో రూ.80

image

టమాట ధరలు కొండెక్కాయి. ఎన్నికల సీజన్ ముగిశాక వాటి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. సామాన్యులు టమాటలను కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అనంతపురంలోని పాతూరు మార్కెట్లో కిలో టమాట రూ.80 ధర పలుకుతుంది. రెండు రోజుల కిందట కిలో రూ.60 ఉండగా ఒక్కసారిగా రూ.20 పెరగడంతో ప్రజలు కొనలేని పరిస్థితి. దీంతో పాటు క్యారెట్, బీన్స్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. పచ్చిమిర్చి కిలో రూ.120 పలుకుతోంది.

News June 24, 2024

ఏర్పేడు : IISERలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

ఏర్పేడు సమీపంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నందు కాంట్రాక్టు ప్రాతిపదికగా రీసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సోమవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/job/ వెబ్ సైట్ చూడగలరు. ఆసక్తి కలిగిన వారు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని కోరారు.

News June 24, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు

image

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన LLB కోర్సు 1వ, BA.LLB కోర్సు 5వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు రేపటిలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ తెలిపింది. ఫీజు చెల్లింపు వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు

News June 24, 2024

విజయవాడ: వరల్డ్ కప్‌లో ధీరజ్‌కు రెండు పతకాలు

image

అట్లాంటా టర్కీలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-3లో విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్ పతకాలు కైవసం చేసుకున్నాడు. రికర్వ్ రౌండ్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం, మిక్సీడ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధీరజ్ పతకాలు సాధించి వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో బెర్త్ సాధించాడు. ఈ సందర్భంగా ధీరజ్ ను ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు అభినందించారు.

News June 24, 2024

భీమవరం: రేపు కలెక్టరేట్‌లో ఫిర్యాదుల స్వీకరణ

image

భీమవరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఆర్ఓ ఉదయ భాస్కర్ రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తామని అన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

News June 24, 2024

అనంతపురంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు: సవిత

image

అనంతపురం జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మంత్రిగా మొదటిసారి పెనుకొండకు వచ్చిన ఆమె పట్టణంలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆమె మాట్లాడుతూ.. జులై 1న ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా చేనేతల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.