Andhra Pradesh

News June 23, 2024

అన్నమయ్య: ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

image

అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సానిపాయ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ఎర్రచందనం దుంగలతో పాటు కారు, మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి సానిపాయ పరిధిలో కూంబింగ్ చేపట్టగా అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించగా, అరెస్ట్ చేశామని తెలిపారు.

News June 23, 2024

VZM: ఎస్సైపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు

image

ట్రాఫిక్ ఎస్సైపై దాడి చేసిన ఘటనలో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ బీ.వెంకటరావు అన్నారు. శనివారం రాత్రి ట్రాఫిక్ ఎస్సై లోవరాజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా మయూరి జంక్షన్ వద్ద విధులు నిర్వహిస్తుండగా గర్భాం గ్రామానికి చెందిన ఏ.నరేశ్ బైక్‌ను ఆపి పరీక్షలు నిర్వహిస్తుండగా అతను దుర్భాషలాడుతూ.. ఎస్సైపై దాడికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

News June 23, 2024

చంద్రగిరి: గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం

image

చంద్రగిరి మండల పరిధిలోని కందులవారిపల్లి గ్రామ సమీపంలోని భీమానది కట్టపై గుర్తుతెలియని యువకుడు మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడి చేతిపై ధనమ్మ అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడు ఆచూకీ ఎవరికైనా తెలిస్తే చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News June 23, 2024

రేపటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు: APSDMA

image

ఒడిశా తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో 4 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 25, 26, 27 తేదీలలో జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రేపు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News June 23, 2024

గూడూరులో దారుణం.. బాలికపై అత్యాచారం

image

గూడూరు మండలంలో ఓ బాలికపై జరిగిన అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన నరేశ్, గణేశ్ అనే యువకులు ఓ బాలికను భయభ్రాంతులకు గురిచేసి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసినట్టు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 23, 2024

పులివెందుల: ప్రజలకు భరోసానిచ్చిన వైఎస్ జగన్

image

పులివెందులలో నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మేయర్ సురేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

News June 23, 2024

బాపట్ల యువకుడు మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం

image

అమెరికాలో బాపట్ల నియోజకవర్గానికి చెందిన యువకుడు దాసరి గోపికృష్ణ మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. యువకుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. దుండగుల దాడి ఘటనలో గోపికృష్ణ మృతి చెందటం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

News June 23, 2024

నాదెండ్ల మనోహర్‌ను కలిసిన మాజీ ఎంపీ జయదేవ్

image

తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆదివారం గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మనోహర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పట్టణ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

News June 23, 2024

నీటి ఎద్దడి పరిష్కారమే లక్ష్యం: పెమ్మసాని

image

గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆదివారం కలెక్టరేట్‌లో పెమ్మసాని, ఎమ్మెల్యే నజీర్, ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గుంటూరు నగర అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులపై డీపీఆర్‌లను 30-45 రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు.

News June 23, 2024

‘బాలినేని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలి’

image

గత ఐదేళ్లలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. బాలినేని అనుచరులు భూకబ్జాలు చేస్తూ దొంగ రిజిస్ట్రేషన్లతో పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు. తక్షణమే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలన్నారు.