Andhra Pradesh

News June 23, 2024

చేయూత నగదు జమ చెయ్యండి: సీపీఎం

image

మహిళల బ్యాంక్ అకౌంట్‌లలో చేయూత నగదు జమ చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పీ.శంకరరావు డిమాండ్ చేశారు. ఆదివారం బొబ్బిలిలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేయూత పథకం కింద బటన్ నొక్కినా చాలా మందికి డబ్బులు ఇంకా జమ కాలేదన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం అర్హులకు నిధులు విడుదల చేయాలని కోరారు.

News June 23, 2024

మంగళగిరి: సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల మృతి

image

సముద్ర స్నానానికి వెళ్లి మంగళగిరి యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన 12మంది యువకులు ఆదివారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రామాపురం బీచ్‌కు వెళ్లారు. వీరంతా సముద్ర స్నానానికి దిగగా.. ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిని బాలసాయి(26), బాలనాగేశ్వరరావు(27)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఈ బీచ్‌లో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.

News June 23, 2024

ప్రభుత్వ స్కూల్లో చదివి IAS అయ్యారు..!

image

చిత్తూరు జిల్లా కొత్త కలెక్టర్‌గా సుమిత్ కుమార్ నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన హరియాణా రాష్ట్రం రోహతక్(D) కోనూరు‌లో పుట్టారు. మధ్య తరగతి కుటుంబం కావడంతో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. ఇంజినీరింగ్ తర్వాత ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేశారు. 2014లో రెండో ప్రయత్నంలో IASకు ఎంపికయ్యారు. 29 ఏళ్లలోనే నరసాపురం సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. తర్వాత ప్రమోషన్ పొంది కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు.

News June 23, 2024

నెల్లూరు హైవేపై ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

image

నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మోటారు సైకిల్ ను లారీ ఢీకొనడంతో ఓ మహిళ ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

News June 23, 2024

విశాఖ: ‘బీహెచ్ సిరీస్ వాహనాలపై ప్రత్యేక దృష్టి’

image

బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ నంబర్లతో తిరుగుతున్న వాహనాల యజమానులు వెంటనే పన్ను చెల్లించాలని విశాఖ ఉప రవాణా కమిషనర్ తెలిపారు. బీహెచ్ సిరీస్ వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. తనిఖీలు చేసి పన్ను చెల్లించకుండా తిరుగుతున్న 56 వాహనాలపై కేసులు నమోదు చేసి, రూ.1.19 కోట్లు పన్ను, రూ.10 లక్షల అపరాధ రుసుము వసూలు చేశామని చెప్పారు. తనిఖీలు కొనసాగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు.

News June 23, 2024

చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన కలెక్టర్

image

నెల్లూరు నగరంలోని సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో గల జయభారత్ హాస్పిటల్ లో డయోరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న ఆరుగురు చిన్నారులను జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. చిన్నారులందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అన్ని పరీక్షలు కూడా బాగున్నాయని కలెక్టర్ కు వైద్యాధికారులు వివరించారు.

News June 23, 2024

ఎమ్మిగనూరు: సెంచరీ కొట్టిన టమోటా ధరలు

image

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి.రూ. 80 లోపు ఉన్న టమోటా ధర ఆదివారం ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్‌లో సెంచరీ కొట్టింది. టమోటా కేజీ ధర రూ. 100కు చేరుకోవడంతో సామాన్యులు కొనలేక బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి సబ్సిడీ కింద ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్‌లో సరఫరా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

News June 23, 2024

నుడా ఛైర్మన్ కుర్చీ ఎవరికో..?

image

నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) ఛైర్మన్ పదవికి డిమాండ్ ఏర్పడింది. నుడా పరిధి జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉండటంతో పలువురు నాయకులు ఈ పదవిపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. చివరకు ఈ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.

News June 23, 2024

చీరాలలో యువకుడి దారుణహత్య

image

చీరాల పట్టణంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ థియేటర్ సమీపంలో నడిరోడ్డుపై గుర్తుతెలియని దుండగుడు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడిని కంచర్ల సంతోశ్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 23, 2024

ప.గో.: ఆపరేషన్ భయం

image

జనాభా నియంత్రణకు ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై అవగాహన కల్పిస్తున్నా.. ఉమ్మడి ప.గో. జిల్లాలో ఆశించిన ఫలితాలు రావట్లే. ప్రధానంగా పురుషులు వేసక్టమీ ఆపరేషన్లకు ముందుకు రావట్లేదు.
☛ ప.గో. జిల్లాలో 2022 నుంచి ఇప్పటివరకు 12,352 మంది మహిళలు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకోగా.. పురుషులు 108 మంది వేసక్టమీ చేయించుకున్నారు.
☛ ఏలూరు జిల్లాలో మహిళలు 10,224, పురుషులు 52మంది చేయించుకున్నారు.