Andhra Pradesh

News June 23, 2024

విజయనగరం జోన్ పరిధిలో లీజ్‌కు ఆర్టీసీ స్థలాలు

image

విజయనగరం ఆర్టీసీ జోన్ పరిధిలో ఉన్న తొమ్మిది ఆర్టీసి ఖాళీ స్థలాలను లీజ్‌పై ఔత్సాహిక వ్యాపారస్తులకు ఇవ్వనున్నామని డిప్యూటీ సిటీఎం బి.అప్పలనాయుడు తెలిపారు. జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఖాళీ స్థలాల లీజుకు ఆసక్తి చూపుతున్న శనివారం సమావేశమయ్యారు. ఈ నెల 26 మధ్యాహ్నం 2 గంటల లోపు జోనల్ వర్క్ షాప్ వద్ద దరఖాస్తులు స్వీకరించి, మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు.

News June 23, 2024

SKLM: అమానుష ఘటనలో ఐదుగురి అరెస్ట్

image

ఎచ్చెర్ల(M) నవభారత్ జంక్షన్‌కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. SI చిరంజీవి ఘటన జరిగిన శ్రీకాకుళం నగరం దమ్మల వీధిలో విచారణ చేపట్టారు. బాధితురాలిని అల్లిపల్లి రాధ, నీలిమ, కోడ భవాని, కుందు జయ, మైలపిల్లి కృష్ణవేణి చిత్రహింసలకు గురిచేయగా.. మరో ఇద్దరు బట్టలు విప్పి ఊరేగించారని పోలీసులకు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు.

News June 23, 2024

తూ.గో.: ఐదేళ్లు రాక్షసపాలన సాగింది: యనమల

image

గత ఐదేళ్లు రాష్ట్రంలో రాక్షసపాలన సాగిందని, వ్యవస్థలను మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ధ్వంసం చేశారని, రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టారని, మీడియాని అణచివేశారని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. తేటగుంటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలు పాటించకపోవడంతో, ప్రజలు వారికి బుద్ధి చెప్పి 11 సీట్లే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు.

News June 23, 2024

అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతి

image

అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. కర్లపాలెం మండల పరిధిలోని యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి అమెరికాలో నివాసం ఉంటున్నారు. అయితే దుండగులు జరిపిన కాల్పుల్లో గోపీ కృష్ణ అక్కడి కక్కడే మృతిచెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 23, 2024

తూ.గో.: పిడుగులు పడే అవకాశం.. జాగ్రత్త

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో రాజమండ్రి రూరల్, కాకినాడ, కోనసీమ, సామర్లకోట, పెద్దాపురం, రాజానగరం ఏజెన్సీ ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.☛ SHARE IT

News June 23, 2024

అనంత:గుండెపోటుతో వ్యక్తి మృతి

image

సీపీఎం అనంతపురం జిల్లా కమిటీ సభ్యులు ముష్కిన్ గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన అనంతపురంలోని మార్కెట్ యార్డు వద్ద అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ముస్లిం మైనార్టీ విభాగం ఆవాజ్ రాష్ట్ర నాయకులుగా ఉన్నారు.

News June 23, 2024

విశాఖ వైసీపీ ఆఫీసుకు జనసేన MLA పేరుతో కరెంట్ బిల్లు

image

విశాఖ ఎండాడ న్యాయ కళాశాల రోడ్డులో వైసీపీ జిల్లా కార్యాలయానికి సంబంధించిన కరెంట్ బిల్లు పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పేరు మీద కొనసాగుతోంది. పంచకర్ల వైసీపీని వీడి జనసేనలో చేరి ఏడాది అవుతోంది. 2021-23 కాలంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పంచకర్ల పనిచేశారు. విద్యుత్ మీటర్‌ను ఆయన పేరుతో దరఖాస్తు చేయడంతో ఆయన పేరు మీదనే నేటికి విద్యుత్ బిల్లులు వస్తున్నాయి.

News June 23, 2024

NLR: రైతులకు ఉచితంగా పంపిణీ

image

నెల్లూరు జిల్లాకు 700 పొద్దు తిరుగుడు విత్తనాల కిట్స్ వచ్చాయని వ్యవసాయ అధికారి సత్యవాణి తెలిపారు. ఒక్కో కిట్‌లో 2 కిలోల విత్తనాలు ఉంటాయని, వీటిని రైతులకు ఉచితంగా అందజేస్తామన్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలు అవసరమైన రైతులు మండల వ్యవసాయ అధికారులను లేదా జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఓ రైతుకు ఒక కిట్ మాత్రమే అందజేస్తామన్నారు.

News June 23, 2024

ఏయూలో అధికారుల మార్పు

image

పదవీ విరమణ చేసి, పదవుల్లో కొనసాగుతున్న ఉద్యోగులు తక్షణం వైదొలగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మార్పు మొదలైంది. సైన్స్, మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌ను శనివారం నియమించారు. ఫార్మసీ, న్యాయ కళాశాల, ఐఏఎస్ఈ, ఏయు దూరవిద్యా కేంద్రం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఓఎస్డీలను సైతం మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను అధికారులు ఆచరణలో పెట్టారు.

News June 23, 2024

పెనమలూరు: వేరే కాపురం పెట్టమన్నందుకు కుమారుడు సూసైడ్

image

తండ్రి తన ఇంట్లో వద్దు వేరే కాపురం పెట్టుకోమన్నాడనే
మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టా దుర్గ, ఆనంద్ ప్రసాద్ భార్యాభర్తలు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుమారుడిని, తండ్రి ఓంకార్ వేరే కాపురం పెట్టుకోవాల్సిందిగా కొద్ది రోజుల కిందట సూచించాడు. ఈ ఘటనతో కలత చెందిన కుమారుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.