Andhra Pradesh

News April 19, 2025

టెక్కలి జిల్లా ఆసుపత్రి సేవలపై పబ్లిక్ కామెంట్స్

image

➤ <<16135497>>టెక్కలి జిల్లా ఆసుపత్రికి<<>> వచ్చే కేసులను ఎక్కువగా శ్రీకాకుళం రిఫర్ చేయడం➤ఇక్కడ పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేట్ క్లినిక్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం.➤ఆసుపత్రిలో అందరికీ ఫ్యాన్లు,తాగునీరు లేకపోవడం,బెడ్ షీట్లు వేయకపోవడం ➤అత్యవసర ప్రసూతి కేసులపై పర్యవేక్షణ లోపం.➤వేధిస్తున్న అధునాతన వైద్య పరికరాల కొరత ➤ఆసుపత్రిలో రోగులపై కొందరు నర్సులు,సిబ్బంది దురుసు ప్రవర్తన.➤కొన్ని ముఖ్యమైన మందులు కొరత.

News April 19, 2025

భీమవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన అడ్డాల చిన్న (24) భీమవరం రూరల్ మండలంలో లోసరి హైవేపై వ్యాన్ ఢీకొనడంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు చిన్న హైదరాబాదులో జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడని, బైక్‌పై హైదరాబాద్ నుంచి ప్రత్తిపాడు వెళుతుండగా లోసరిలో ఈ ప్రమాదం సంభవించింది అని తెలిపారు.

News April 19, 2025

ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

image

సబ్బవరం మండలం గణపతి నగర్‌లో డిగ్రీ చదువుతున్న విద్యార్థి కె.అప్పలనాయుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి ఇంటికి వచ్చి గదిలోకి వెళ్లాడు. గంట తర్వాత స్నేహితుడు సుబ్రహ్మణ్యంకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. స్నేహితుడు గణపతి నగర్‌కు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. తల్లి లీలా కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

News April 19, 2025

కడప: వచ్చి మీ ఫోన్ తీసుకెళ్లండి…!

image

కడపలో చాలా మంది తమ ఫోన్లు పొగొట్టుకున్నారు. పోలీసులు ఎంతోకష్టపడి 602 ఫోన్లు రికవరీ చేశారు. ఇందులో 275 మంది తమ మొబైల్స్ తీసుకెళ్లారు. ఇంకా 327 ఫోన్లు పోలీసుల దగ్గరే ఉన్నాయి. సరైన ఆధారాలు చూపింది వీటిని తీసుకెళ్లాలని కడప సైబర్ క్రైం పోలీసులు కోరారు. మరిన్ని వివరాలకు 08562 245490 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

News April 19, 2025

శ్రీనగర్ SSPగా కర్నూల్ వాసి.!

image

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌‌లోని శ్రీనగర్ SSPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ SSPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

News April 19, 2025

మలేషియా నుంచి విశాఖ రాని కూటమి మద్దత్తు కార్పొరేటర్

image

కూటమి కార్పొరేటర్లు విహార యాత్ర నుంచి శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. వీరిలో 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత వారితో కలిసి రాలేదు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తనను మాత్రమే పార్టీలో ఆహ్వానించారని, తన భర్తను ఆహ్వానించలేదని అలిగి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పల్లా ఆమెతో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించి శనివారం విశాఖ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సుజాత వైసీపీలో గెలిచి కూటమిలో చేరారు.

News April 19, 2025

ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్‌పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.

News April 19, 2025

ప.గో : మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

image

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310, ఎస్జీటీ కేడర్‌లో ఉన్న 260 పోస్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 19, 2025

GNT: మానవత్వం చాటుకున్న లాలాపేట పోలీసులు

image

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట స్టేషన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగడిగుంటలో ఏఎస్సై నరసింహారావు, కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తన భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుందని, వాహన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గస్తీ పోలీసులు గర్భిణిని తమ వాహనంలో జీజీహెచ్ కాన్పుల వార్డుకు తరలించారు.

News April 19, 2025

క్రికెట్ బెట్టింగ్.. చల్లపల్లిలో ఏడుగురు అరెస్ట్

image

చల్లపల్లిలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిని పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ ఆదేశాల మేరకు సీఐ ఈశ్వరరావు పర్యవేక్షణలో విస్తృత తనిఖీలు నిర్వహించి ఎనిమిది మంది క్రికెట్ బెట్టింగ్ జూదరులను గుర్తించినట్లు తెలిపారు. వారిలో ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.