Andhra Pradesh

News June 23, 2024

నర్రవాడ: విద్యుత్ దీపాలంకరణలో వెంగమాంబ దేవస్థానం

image

మండలంలోని నర్రవాడ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా ఉంది. అంతేకాక పరిసర ప్రాంతాలలో పలు దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అష్టలక్ష్మి దేవతలు, వినాయక స్వామి, దుర్గామాత, వెంగమాంబ ఇతర దేవత మూర్తుల విద్యుత్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం నుండి బ్రహ్మోత్సవాలు నిలుపుకార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి.

News June 23, 2024

సీజనల్‌పై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ డా.సృజన

image

డయేరియా వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కర్నూలు కలెక్టర్ డా.సృజన వైద్య, సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తరచూ RWS శాఖ అధికారులు నీటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డయేరియా నివారణలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వర్షాల వల్ల డయేరియా, డెంగ్యూ, మలేరియా, తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.

News June 23, 2024

డయేరియా ప్రబలకుండా చర్యలు: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో డయేరియాతో ఏ ఒక్కరూ బాధపడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డయేరియాపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అనుసరించి ఆయా శాఖల జిల్లా అధికారులు వారి శాఖల పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు.

News June 23, 2024

విశాఖ: 24, 25 తేదీల్లో రద్దయిన రైళ్ల జాబితా ఇదే..

image

పలాస-విజయనగరం లైన్‌లో వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. 24న పలాస-విశాఖ-పలాస, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైలు 24న విశాఖ-బ్రహ్మపూర్, 25న బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా 24న విశాఖ-భువనేశ్వర్, 25న భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశామన్నారు.

News June 23, 2024

గరుగుబిల్లి: తోటపల్లి సమీపంలో ఏనుగుల గుంపు

image

గరుగుబిల్లి మండలం తోటపల్లి పంప్ హౌస్ సమీపంలో ఏడు ఏనుగులు గుంపుగా సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. సమీప ప్రాంతం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ముఖ్యంగా రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో ఏనుగులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని కోరారు. వ్యవసాయ క్షేత్రాలలో పశువులను ఉంచరాదన్నారు.

News June 23, 2024

ఏలూరు: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

image

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీఎల్‌టీసీ సహాయ సంచాలకులు ఎస్.ఉగాది రవి తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఫీల్డ్ టెక్నీషియన్-ఎయిర్ కండిషనర్ కోర్సులో 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఆ పైన ఉత్తీర్ణులైన వారు, 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. చివరి తేదీ 28-06-2024.

News June 23, 2024

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, మండల వైద్యాధికారులతో డయేరియా నియంత్రణ, సీజనల్ వ్యాధులు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News June 23, 2024

ప్రకాశం: ‘పద్మా అవార్డులకు దరఖాస్తు చేసుకోండి’

image

భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానం చేసే పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులకు అర్హత కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విశిష్ట సేవలు అందించిన వారు తమ వివరాలను వెబ్‌సైట్లో నమోదు చేసుకొని, ఆ దరఖాస్తును జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జులై 5లోపు ధ్రువీకరణ పత్రాలతో సమర్పించాలన్నారు.

News June 23, 2024

బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

image

బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ మణికంఠ శనివారం తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పలు రికార్డులను ఆయన పరిశీలించారు. పెండింగ్ కేసులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సమీక్షించారు. విలేజ్ పోలీసింగ్ సమర్థవంతంగా నిర్వహించి, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సై కృష్ణయ్య సిబ్బంది, పాల్గొన్నారు.

News June 23, 2024

బాపట్ల: 24న మొదలవనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ నెల 24వ తేదీన సోమవారం మొదలవుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం పని దినాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా రాసుకొని కలెక్టర్ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ఉత్తర్వులు వెలువడ్డాయి.