Andhra Pradesh

News June 22, 2024

ఈనెల 24, 25 తేదీల్లో పలు రైళ్లు రద్దు

image

పలాస-విజయనగరం లైన్లో వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. ఈనెల 24న పలాస-విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైలు, 24న విశాఖ-బ్రహ్మపూర్ 25న బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 25న భువనేశ్వర్-విశాఖ రైళ్లు రద్దు చేశామన్నారు.

News June 22, 2024

మనుబోలు : కరెంటు షాక్ తో మహిళ మృతి

image

నెల్లూరు జిల్లా మనుబోలు అరుంధతీయ వాడలో కంట్లం హారిక(36) శనివారం వంటలో భాగంగా మిక్సీలో పచ్చడి వేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్లగ్ నుంచి ఉన్నట్లుండి విద్యుత్తు రావడంతో తీవ్రమైన విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు ఎస్ఐ అజయ్ కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

News June 22, 2024

3 రోజులు పిఠాపురంలోనే డిప్యూటీ సీఎం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో పిఠాపురం రానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ తొలిసారి పిఠాపురం వస్తుండటంతో నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారంలో ఈ పర్యటన ఉండనుండగా.. మూడురోజుల పాటు పవన్ కళ్యాణ్ అక్కడే ఉండనున్నారట. స్థానిక సమస్యలు, పెండింగ్‌ ప్రాజెక్టులపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. సమగ్ర సమాచారంతో సమీక్షకు రావాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

News June 22, 2024

రేపు పెనుకొండకు మంత్రి సవిత రాక

image

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రేపు జిల్లాకు రానున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి జిల్లాకు వస్తున్నారు. ఉదయం 6.15 గంటలకు విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి ఉ.9.20 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో ఉ.11 గంటలకు బాగేపల్లి టోల్గేట్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా పెనుకొండకు చేరుకుంటారు. నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. సోమవారం తిరిగి విజయవాడ వెళ్లనున్నారు.

News June 22, 2024

అనంతపురం వైసీపీ కార్యాల‌యానికి నోటీసులు

image

తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని ఇవాళ ఉద‌యం కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అనంతపురం ప‌రిధిలోని HLC కాలనీలో వైసీపీ కార్యాల‌యానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమ‌తులు లేకుండా నిర్మించార‌ని అభ్యంత‌రం వ్యక్తం చేశారు. నోటీసుకు ఏడురోజుల్లో వివరణ ఇవ్వాలని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ అధికారులు వైసీపీ జిల్లా అధ్యక్షుడికి ఈ నోటీసులు జారీ చేశారు.

News June 22, 2024

విశాఖ: ఘాట్ రోడ్‌లో బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్

image

గూడెం కొత్తవీధి మండలం దారాలమ్మ తల్లి ఘాట్ రోడ్ సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద శనివారం ఓ ఆయిల్ ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపుతప్పి లోయలో పడింది. ఈ సంఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి సీలేరు పెట్రోల్ బంకుకు ఆయిల్ తీసుకొచ్చిన ట్యాంకర్ తిరిగి బయలుదేంది. ఈ క్రమంలో మలుపు వద్ద ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయి 100 అడుగుల లోయలోకి ట్యాంకర్ జారిపోయింది.

News June 22, 2024

తిరుమలకు చేరుకున్న హోం మంత్రి అనిత

image

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం శనివారం రాత్రి హోం శాఖ మంత్రి అనిత తిరుమల చేరుకున్నారు. ముందుగా పద్మావతి సమీపంలో ఉన్న శ్రీ కృష్ణ అతిథి గృహం వద్ద హోం మంత్రికి రిసెప్షన్ అధికారి భాస్కర్, ఓఎస్డి సత్రా నాయక్ స్వాగతం పలికి బస ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె రాత్రి తిరుమలలో బస చేసి ఆదివారం ఉదయం నైవేద్యం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోనున్నారు.

News June 22, 2024

టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో కర్నూలు, నంద్యాల ఎంపీలు

image

తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. కర్నూలు, నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, పలువురు ఎంపీలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు బాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం సందర్భంగా ఎంపీలు మంత్రి నారా లోకేశ్‌ను సత్కరించారు.

News June 22, 2024

తిరుపతి: హోమ్ మినిస్టర్ పర్యటనలో అపశ్రుతి!

image

హోంమినిస్టర్‌ వంగలపూడి అనితను కలవడానికి వచ్చిన బీజేపీ నాయకుడు గాయపడినట్లు సమాచారం. తిరుమల దర్శనార్థం హోం మినిస్టర్ వెళ్తుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద తిరుపతి పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు ప్రభాకర్ నాయుడు వంగలపూడి అనితను సన్మానించడానికి వచ్చారు. కాన్వాయ్ లోని ఓ వాహనం దూసుకురావడంతో గాయపడడంతో రుయా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

News June 22, 2024

తిరుమల శ్రీవారి ప్రసాదానికి సిక్కోలు బెల్లం

image

ఆముదాలవలస మండలం నిమ్మతోర్లాడ గ్రామంలో స్థానిక రైతులు పూర్తిగా ప్రకృతి సేద్యం ద్వారా బెల్లం తయారు చేస్తున్నారు. శ్రీవారి ప్రసాద పంపిణీలో ఈ బెల్లం వినియోగించేందుకు ఇటీవల అధికారులు దీని నాణ్యతను పరీక్షించారు. పూర్తి నాణ్యతగల బెల్లం కావడంతో శనివారం శ్రీవారి ప్రసాద వితరణకు ఆ బెల్లాన్ని తరలించారు. ఇది యావత్ సిక్కోలు ప్రజానీకానికి గర్వకారణమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.