Andhra Pradesh

News June 22, 2024

తిరుమల శ్రీవారి ప్రసాదానికి సిక్కోలు బెల్లం

image

ఆముదాలవలస మండలం నిమ్మతోర్లాడ గ్రామంలో స్థానిక రైతులు పూర్తిగా ప్రకృతి సేద్యం ద్వారా బెల్లం తయారు చేస్తున్నారు. శ్రీవారి ప్రసాద పంపిణీలో ఈ బెల్లం వినియోగించేందుకు ఇటీవల అధికారులు దీని నాణ్యతను పరీక్షించారు. పూర్తి నాణ్యతగల బెల్లం కావడంతో శనివారం శ్రీవారి ప్రసాద వితరణకు ఆ బెల్లాన్ని తరలించారు. ఇది యావత్ సిక్కోలు ప్రజానీకానికి గర్వకారణమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 22, 2024

శ్రీకాకుళం: పెరిగిన మద్దతు ధరతో అన్నదాతకు ఊరట

image

కేంద్ర ప్రభుత్వం 14 రకాల ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచుతూ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వరి పంటకు మద్దతు ధర అధనంగా రూ.117 పెంచడంతో క్వింటాకు రూ.2300 చొప్పున రైతులకు గిట్టుబాటు కానుంది.
@ వేరుశనగ క్వింటాకు రూ.406,
@ మొక్కజొన్న రూ.135,
@ రాగి రూ.444,
@ మినుములు రూ.450 చొప్పున పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

News June 22, 2024

జగన్ ఇంటి పై ఎటువంటి దాడి జరగలేదు

image

కడప జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ ను చూసేందుకు పులివెందులలోని ఆయన క్యాంప్ ఆఫీస్ కు కార్యకర్తలు, నాయకులు పోటెత్తారు. జగన్ వచ్చిన వెంటనే ఆయనతో కరచాలనం చేసి మాట్లాడేందుకు కొంత మంది యువకులు ఒక్కసారిగా పోటీపడ్డారు. జగన్ ను కలిసేందుకు తోసుకోగా పక్కనే ఉన్న కిటికీపై పడటంతో కిటికీ అద్దం పగిలి, ఓ యువకుడికి చేతికి కూడా గాయమైంది. ఇంటిపై దాడి అని వచ్చిన కథనాలను వైసీపీ నాయకులు ఖండించారు.

News June 22, 2024

తూ.గో: స్నానానికి దిగి మహిళ మృతి

image

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఓ గుర్తుతెలియని మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలానికి కొవ్వూరు పట్టణ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

News June 22, 2024

విశాఖ: 24, 25 తేదీల్లో రద్దయిన రైళ్ల జాబితా ఇదే..

image

పలాస-విజయనగరం లైన్‌లో వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. 24న పలాస-విశాఖ-పలాస, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైలు 24న విశాఖ-బ్రహ్మపూర్, 25న బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా 24న విశాఖ-భువనేశ్వర్, 25న భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశామన్నారు.

News June 22, 2024

పుంగనూరు: ముగ్గురికి షోకాజ్ నోటీసులు

image

ఎంపీడీవో కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి రూ.1.36 కోట్ల నిధులను స్వాహా చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఎంపీడీవోలుగా విధులు నిర్వహిస్తూ.. బాధ్యులైన రామనాథరెడ్డి, నారాయణ, ఏవో రాజేశ్వరికి షోకాజు నోటీసులు జారీ చేయాలని జడ్పీ సీఈవో గ్లోరియా ఆదేశించారు. దీంతో ఎంపీడీవో వెంగమునిరెడ్డి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. వివరణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News June 22, 2024

నెల్లూరు: గునపాటిపాలెంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

చిట్టమూరు మండలం గుణపాటిపాలెం గ్రామం నందు గల స్వర్ణముఖి నది పంట కాలవలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గుర్తించి సచివాలయం సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చిట్టమూరు పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందజేశారు. ఆ మృతదేహాన్ని బయటకి తీసి నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 22, 2024

విశాఖ: మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తున్నాం: స్పీకర్ అయ్యన్న

image

గత ప్రభుత్వం మీడియా మీద పెట్టిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ మేరకు ఆంక్షలు ఎత్తివేస్తూ మొదటి సంతకం చేశానన్నారు. జగన్ తనసై చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు.

News June 22, 2024

రాయలసీమ మాండలికం

image

★ బొరుగులు – మరమరాలు
★ ఎచ్చులు/ఎచ్చలు – ఆడంబరం
★ శెనక్కాయలు/బుడ్డలు – వేరుశనగ
★ చెనిక్కాయ పప్పులు – పల్లీలు
★ పొద్దుగొంకులూ – రోజంతా
★ బారాకట్ట – అష్టాచెమ్మ
★ జాంకులు – మాటిమాటికీ
★ ఊరిబిండి/పచ్చడి – చట్నీ
★ ఊపిరిబుడ్డ – బెలూన్ ★ తావు – చోటు

News June 22, 2024

శ్రీకాకుళం: మంత్రి వెంకటస్వామికి ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు

image

నగరానికి చెందిన సంఘ సేవకుడు డాక్టర్ మంత్రి వెంకటస్వామిని ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు వరించింది. ఆస్ట్రో, మెడికల్, రత్నాల శాస్త్రవేత్తగా వెంకటస్వామి 4దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ బృందం ప్రకటించింది. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వెంకటస్వామికి ఈ అవార్డు అందజేస్తారు.