Andhra Pradesh

News June 22, 2024

కృష్ణా జిల్లాలో 2 నెలల పాటు ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’

image

జిల్లాలో డయేరియా నివారణకు జూలై 1 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహణకు అవసరమైన కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. తాగునీటి కాలుష్యం జరగకుండా ఓవర్ హెడ్ ట్యాంక్లను పరిశీలించి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు.

News June 22, 2024

వేటపాలెం: ఒడ్డుకు కొట్టుకొచ్చిన మరో ఇద్దరు యువకుల మృతదేహాలు

image

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో శుక్రవారం రాకాసి అలల తాకిడికి గల్లంతైన మరో ఇద్దరు యువకుల మృతదేహాలు శనివారం ఉదయం వాడరేవు వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. మొత్తం నలుగురు యువకులు గల్లంతు కాగా శుక్రవారం సాయంత్రమే రెండు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకురావడం తెలిసిందే. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాల వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు లాంఛనాలు పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

News June 22, 2024

శ్రీకాకుళం: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.మనజీర్ జీలాని సమూన్ ఆదేశించారు. నో డయేరియా పట్ల ముందస్తు చర్యలు చేపట్టి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. శనివారం కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖకు సంబంధించిన పలు విభాగాల అధికారులు చేపడుతున్న సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల గురించి సమీక్షీంచారు.

News June 22, 2024

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారాలకు దరఖాస్తులు

image

2025 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు, సంస్థలు చేసిన అద్భుతమైన కృషిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. జులై 1 నుంచి ఆగస్టు 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News June 22, 2024

వైఎస్ జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా రామరాజు పల్లి వద్ద ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు ఢీ కొన్నాయి. వాహన శ్రేణిలోని ఓ ఇన్నోవాను అదుపు తప్పి ఫైర్ ఇంజిన్ ఢీకొంది. అయితే ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇవాళ సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు జగన్ వెళ్తున్నారు.

News June 22, 2024

ఇకపై అయ్యన్న హుందాతనం చూస్తారు: పవన్ కళ్యాణ్

image

అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో <<13488653>>అయ్యన్నపాత్రుడు<<>> ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25వ యేటనే రాజకీయాల్లోకి వచ్చి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తనదైన ముద్రవేశారన్నారు. ఐదేళ్లలో ఆయనపై అనేక కేసులు పెట్టినా నిలబడ్డారన్నారు. అటు ఇన్ని దశాబ్దాల్లో అయ్యన్న వాడివేడి, వాగ్దాటిని చూసిన ప్రజలు ఇక ఆయన హుందాతనం చూస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషకరమన్నారు.

News June 22, 2024

అమలాపురంలో 24వ తేదీన జాబ్‌మేళా

image

అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వసంతలక్ష్మి తెలిపారు. ఆ రోజు ఉదయం 10:30 నుంచి మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, డిప్లమా ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.

News June 22, 2024

వైసీపీ ప్రభుత్వంలో ఆ అవమానాలు నేను భరించా: బీసీ జనార్దన్ రెడ్డి

image

సభాపతి స్థానానికి ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి రోడ్డు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అక్రమ కేసుల బాధను తాను అనుభవించానన్నారు. అరెస్ట్‌చేసి 32రోజులు జైలు పెట్టినప్పుడు జరిగిన అవమానాలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఎలా ఉంటాయో తెలుసనన్నారు. ఎన్ని కేసులు, ఇబ్బందులు పెట్టినా పోరాడిన అయ్యనపాత్రుడి రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు.

News June 22, 2024

లక్కవరపుకోటలో అత్యధిక వర్షపాతం

image

విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. లక్కవరపుకోటలో అత్యధికంగా 57.2 మిల్లీమీటర్లు, నెల్లిమర్లలో 54.8 మిల్లీమీటర్లు, శృంగవరపుకోటలో 40.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.

News June 22, 2024

ప్రకాశం: ఆయనొక్కరే ఇంగ్లిష్‌లో.. మిగిలిన వాళ్లంతా తెలుగులో

image

నిన్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ ఒక్కరే ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. మిగతా 11 మంది తెలుగులో చేశారు. వీరందరితో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి దైవసాక్షిగా ప్రమాణం చేయించారు.