Andhra Pradesh

News June 22, 2024

ప్రకాశం: 44 వేల టన్నుల ఇసుక నిల్వలు

image

జిల్లాలో ఇసుక నిల్వలను మైన్స్ శాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. ప్రస్తుతం 44 వేల టన్నుల నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, జరుగుమల్లిలో ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఒంగోలు మార్కెట్ యార్డులోని ఇసుక నిల్వ కేంద్రం, జరుగుమల్లిలో రెండు కేంద్రాలలో మొత్తం 44 వేల టన్నులు ఇసుక ఉన్నట్లు జిల్లా మైనింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు.

News June 22, 2024

పరవాడ: అదృశ్యమైన వ్యక్తి మృతి

image

పరవాడ మండలం గొర్లివానిపాలెం JNNURM కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీ.అప్పారావు కుమారుడు చంద్రశేఖర్ (47) తల్లితో కలిసి కాలనీలో నివాసం ఉంటూ ఫార్మా కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న తాగడానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అదృశ్యమైన చంద్రశేఖర్ శుక్రవారం కాలనీ సమీపంలో చెరువు వద్ద శవమై కనిపించాడు.

News June 22, 2024

శ్రీకాకుళం: ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన

image

ప్రియుడి ఇంటిముందు న్యాయం కోసం ప్రియురాలు నిరసనకు దిగిన ఘటన సోంపేట మండలంలో జరిగింది. రాజాం గ్రామానికి చెందిన డొక్కరి చిరంజీవి తనని ప్రేమించి, పెళ్లిచేసుకుంటానని నమ్మించి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని మందస మండలం జిళ్లందకు చెందిన ఓ యువతి తెలిపింది. శుక్రవారం ప్రియుడి ఇంటి ఎదుట నిరసన తెలిపింది. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకుంది. ఈ మేరకు మందస పోలీసులకు ఫిర్యాదుచేసింది

News June 22, 2024

కురబలకోటలో భార్యను హత్య చేసిన భర్త

image

భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని లక్కసముద్రం గ్రామం, మేకలవారిపల్లెకు చెందిన లక్ష్మిరెడ్డి రాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఆగ్రహించిన భర్త భార్యను కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపేశాడు. విషయం తెలుసుకున్న ముదివేడు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 22, 2024

ఉదయగిరి: అది చిరుత పులి కాదు కుక్క..?

image

ఉదయగిరి సమీపంలో దుర్గంపల్లికి వెళ్లే మార్గం పక్కన మేక మృతి చెందింది. అయితే చిరుతపులి దాడి చేసినట్లు అధికారులు అనుమానించారు. కాగా పరిశీలించిన అటవీ రేంజ్ అధికారి ఉమామహేశ్వర రెడ్డి కుక్కల దాడి అని చెప్పారు. మరికొందరు అధికారులు మాత్రం చిరుత లేదా హైనా చంపి ఉంటుందిని అనుమానించారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ఎటూ తేలని పరిస్థితి నెలకొంది.

News June 22, 2024

శ్రీకాకుళం: లవ్ మ్యారేజ్.. వివాహిత కిడ్నాప్

image

వివాహిత కిడ్నాప్ ఘటనపై కేసు నమోదుచేసినట్లు వన్‌టైన్ SI శ్యామల రావు తెలిపారు. వివరాలు.. శ్రీకాకుళంలోని మంగువారితోటకు చెందిన జి.తేజేశ్వరరావు పొన్నాడకు చెందిన వల్లంగి పల్లవి ప్రేమ పెళ్లిచేసుకున్నారు. మంగువారితోటలో నివాసముంటున్నారు. కాగా ఈ నెల 20న సుశీల కొంతమందితో తేజేశ్వరరావు ఇంటికి వెళ్లి పల్లవిని తీసుకెళ్లిపోయింది. దీంతో తేజేశ్వరరావు తన భార్యను కిడ్నాప్ చేశారని ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

News June 22, 2024

జొన్నగిరిలో వజ్రం లభ్యం

image

తుగ్గలి మండలం జొన్నగిరిలో శుక్రవారం వజ్రం లభ్యమైంది. జొన్నగిరికి చెందిన ఒక రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని గ్రామానికే చెందిన వ్యాపారస్థుడు రూ.2.8 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు మండలంలో ఈ సంవత్సరం 40వజ్రాలకు పైగా దొరికాయి. వర్షం పడితే వజ్రాల కోసం ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వస్తుంటారు.

News June 22, 2024

అనంత జిల్లాలో పది రోజుల్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం

image

జిల్లాలో విస్తారంగా వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు 10 రోజుల్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు పంపారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేర్చారు. ఈనెల 24నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రహదారులకు ఇరువైపులా 100 కి.మీలలో ప్లాంటేషన్ చేయనున్నట్లు తెలిపారు.

News June 22, 2024

తిరుపతి : దరఖాస్తులకు గడువు పొడిగింపు

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి శాస్త్రి, ఆచార్య, డిప్లొమా, సర్టిఫికెట్ మొదలైన 21 విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ రాఘవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు svvedicuniversity.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 30.

News June 22, 2024

విజయవాడ: కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిలపై ఫిర్యాదు

image

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నాయకత్వంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌కి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట‌లు సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరగలేదన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారని మండిపడ్డారు.