Andhra Pradesh

News June 22, 2024

ప్రకాశం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నాగులుప్పలపాడు మండలంలోని కోల్డ్ స్టోరేజ్ సమీపంలో 216 జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై బ్రహ్మనాయుడు వివరాల మేరకు వేటపాలెం మండలం రావురు గ్రామానికి చెందిన ఎండ్లూరి ఎలీషా(45) ఉప్పుగుండూరు నుంచి బైక్‌పై ఒంగోలు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News June 22, 2024

అట్లూరులో ఇరువర్గాల దాడి

image

అట్లూరు మండల పరిధిలోని క్రాస్ రోడ్లో నివాసముండే నాగమునయ్య యాదవ్‌పై అదే గ్రామానికి చెందిన రెడ్డయ్య తన వర్గంతో దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ దాడిలో నాగమునయ్య తలకి గాయమైంది. వెంటనే అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణం అని పోలీసులు అంచనా వేస్తున్నారు.

News June 22, 2024

విశాఖ: వందే భారత్ రైలు రీ షెడ్యూల్

image

విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు శనివారం బయలుదేరాల్సిన వందే భారత్ రైలును రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 5:45 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు ఉదయం 10 గంటలకు బయలుదేరుతుందని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సీ-9 కోచ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా రీ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News June 22, 2024

శ్రీకాకుళం: 502 మందికి ప్రవేశాలు

image

శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ మేరకు శుక్రవారం 1400 నుంచి 1642 మధ్య ర్యాంకు విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 474 మందికి 230 మంది హాజరయ్యారు. ఇందులో 113 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఇప్పటివరకు 502 మందికి ప్రవేశాలు కల్పించారు. శనివారం 1874 నుంచి 2083 మధ్య కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

News June 22, 2024

ఆచంట MLA పితాని ప్రమాణస్వీకారం నేడే

image

అసెంబ్లీలో ఆచంట ఎమ్మెల్యేగా పితాని సత్యనారాయణ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా శుక్రవారం ఆయన అనివార్య కారణాలతో అసెంబ్లీకి రాని విషయం తెలిసిందే. ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది ఎమ్మెల్యేలలో 14 మంది నిన్న ప్రమాణస్వీకారం చేశారు.

News June 22, 2024

చిలకలూరిపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

పట్టణ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మున్సిపల్ రోడ్డులోని చెట్టు కింద శుక్రవారం అపస్మారక స్థితిలో ఓ వ్యక్తి పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 సహాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News June 22, 2024

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సంతకం ఫోర్జరీకి గురైంది. ఈ కేసులో టౌన్ ప్లానింగ్ అధికారులు బి.ప్రవీణ్, ఎం.దేవేంద్ర, సచివాలయ వార్డు ప్లానింగ్ కార్యదర్శులు పి.నాగేంద్ర బాబు, కార్తీక్ మాలవ్యను కమిషనర్ సస్పెండ్ చేశారు. ఆరోపణపై షోకాష్ నోటీసులు జారీ చేసినా..వివరణ సరిపోలలేదని కమిషనర్ తెలిపారు. వీరితో పాటు ఎల్‌టీపీ దిలీప్ కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. వివరణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.

News June 22, 2024

త్రిపురాంతకం: గుండెపోటుతో VRO మృతి

image

త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామ VRO బోర్ర తిరుమలయ్య(52) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఛాతిలో నొప్పి రావడంతో సిబ్బందికి తెలియజేశారు. సిబ్బంది వెంటనే 108 సహాయంతో వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. తోటి ఉద్యోగి మృతి చెందడంతో ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.

News June 22, 2024

కడప: టమాట యమ రేటు గురూ!

image

చిన్న, మధ్య తరగతి కుటుంబాలకు టమాట దడ పుట్టిస్తోంది. రోజు రోజుకు రేటు పెరుగుతూ పోతోంది. శుక్రవారం అత్యధికంగా కిలో టమాట రూ.88 పలికింది. వారం రోజుల కిందట రూ.60 ఉన్న టమాట ఇవాళ రూ.80 పైగా ఉండటంతో ప్రజలు ‘ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లొస్తాయి.. టమాట కొనాలంటేనే కన్నీళ్లొస్తున్నాయి’అని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

News June 22, 2024

విజయవాడలో మండుతున్న కూరగాయల ధరలు

image

కూరగాయలు ధరలు భారీగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రైతు మార్కెట్లో కేజీ రూ.50గా విక్రయిస్తుండగా.. టమాటా ధర రిటైల్ మార్కెట్లో రూ.70 నుంచి రూ.90 పలుకుతోంది. రాబోయే రోజుల్లో దీని ధరలు ఎంత పెరుగుతాయో అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో రేకెత్తుతోంది. ఇక మిగతా కూరగాయలు పరిస్థితి కూడా ఇలానే ఉన్నాయి. పచ్చిమిర్చి కేజీ రూ.44 ఉంటే, కాకరకాయ రూ.48, బెండ రూ.60, బీరకాయ రూ.55గా ఉన్నాయి.