Andhra Pradesh

News June 22, 2024

ప.గో.: యాక్సిడెంట్.. పరీక్షకు వెళ్తుండగా మహిళ మృతి

image

పెనుమంట్ర మండలం నెగ్గిపూడి పరిధిలోని చించినాడ కాలువ కల్వర్టు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన గీతావాణి(23) పెనుగొండలో MBA చదువుతోంది. ఈమెకు రెండేళ్ల క్రితమే వివాహం కాగా.. పరీక్షల కోసం వారం క్రితం పుట్టిల్లు మార్టేరులోని శివరావుపేటకు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం కళాశాలకు బైక్‌పై వెళ్తుండగా లారీని ఢీ కొని చనిపోయింది.

News June 22, 2024

గుంటూరు: వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

image

వృద్ధురాలి మెడలో గుర్తు తెలియని ఓ మహిళ గొలుసు లాక్కుని పరారైన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. చౌత్రా సెంటర్‌కు చెందిన శేషారత్నం అనే వృద్ధురాలు శుక్రవారం మధ్యాహ్నం ఇంటి బయట కూర్చుని ఉన్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని ఓ మహిళ అకస్మాత్తుగా శేషా రత్నం వద్దకు వెళ్లి ఆమె మెడలోని గొలుసు లాక్కొని పరారైంది. బాధితురాలు లాలాపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News June 22, 2024

పెనమలూరు: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.. వ్యక్తిపై కేసు నమోదు

image

రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నగదు వసూలు చేసిన వ్యక్తిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాలు మేరకు పెనమలూరుకు చెందిన మహిధర్ అనే వ్యక్తి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుడు అనిల్ కుమార్ అనే వ్యక్తి వద్ద రూ.15లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఎంతకీ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు.

News June 22, 2024

అనంత: తొలిసారి అసెంబ్లీలోకి 8మంది ఎమ్మెల్యేలు

image

జిల్లాలో తొలిసారి అసెంబ్లీలోకి 8మంది ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టారు.☞అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి వెంకటశ్వరప్రసాద్ ☞శింగనమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణిశ్రీ☞పెనుకొండ ఎమ్మెల్యేగా సవిత☞పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డి ☞కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబు☞తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి☞ధర్మవరం ఎమ్మెల్యేగా వై.సత్యకుమార్ యాదవ్☞ మడకశిర ఎమ్మెల్యేగా ఎంఎస్ రాజు.

News June 22, 2024

తూ.గో.: టీడీపీ నేత కన్నుమూత

image

తూ.గో. జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడుకు చెందిన గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు లగడ్డ భాస్కర చౌదరి(33) శుక్రవారం మృతిచెందారు. కాగా ఈయన కొంతకాలం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈయనకు చంద్రబాబును సీఎంగా అసెంబ్లీలో చూడాలన్నది కల అని కుటుంబీకులు చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ విజయం కోసం అహర్నిశలు పనిచేశాడు. అసెంబ్లీ సమావేశాలు చూసేందుకు నిన్న ఆసుపత్రిలో ఆయన గదిలో టీవీ సైతం ఏర్పాటుచేశారు.

News June 22, 2024

పులివెందులకు మాజీ సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే

image

మాజీ సీఎం జగన్ నేడు పులివెందులకు రానున్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో కడపకు బయలుదేరుతారు. 12.15 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 12.25 గంటలకు కడప నుంచి పులివెందులకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 1.25గంటలకు పులివెందులలోని భాకరాపురంలోని తన స్వగృహానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

News June 22, 2024

కొండపి: టైలరింగ్, కంప్యూటర్ కోర్సులకు ఉచిత శిక్షణ

image

కొండపిలోని స్కిల్ హబ్‌లో నిరుద్యోగ యువతీ, యువకులకు ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, కంప్యూటర్ కోర్సులలో 3నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, స్కిల్ హబ్ నిర్వాహకులు గోపికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాస్ లేక ఫెయిల్ లేదా ఆ పైన చదివిన వారికి ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. 25వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News June 22, 2024

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

image

ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షన్మోహన్ పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసీ శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

News June 22, 2024

సత్యసాయి: భూ సేకరణపై జేసీ సమావేశం

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారులకు సంబంధించి భూ సేకరణపై జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెనుకొండ సబ్ కలెక్టర్‌తో కలిసి పెనుకొండ, కదిరి, ధర్మవరం ఆర్డీవోలతో పాటు సంబంధిత మండలాల తహాసిల్దార్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. భూ సేకరణకు సంబంధించి పలు సూచనలు చేశారు.

News June 22, 2024

విహారయాత్ర విషాద ఘటనపై ఎమ్మెల్యే చింతమనేని దిగ్భ్రాంతి

image

బాపట్లలో జరిగిన విహారయాత్ర విషాద ఘటనపై ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దుగ్గిరాల నుంచి 11 మంది యువకులు రామాపురం బీచ్‌‌కు విహార యాత్రకు వెళ్లగా నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే.