Andhra Pradesh

News June 22, 2024

వైఎస్ షర్మిలతో కలిసి నిరసనలో పాల్గొన్న సోమశేఖర్ రెడ్డి

image

నీట్ పరీక్ష ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల విజయవాడ లెనిన్ సెంటర్‌లో శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పీలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో పేపర్‌ లీక్‌ అయిందన్నారు. ప్రశ్నపత్రం లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.

News June 22, 2024

VZM: కూరగాయల ధరలను నియంత్రించాలి..జేసీ

image

విజయనగరం కేంద్రంలో కూరగాయల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలను అదుపు చేయాలని రైతులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్ కే.కార్తీక్ ప్రజలకు కూరగాయల ధరలు తగ్గించాలని కోరారు. హోల్సేల్ వ్యాపారులు, జిల్లా పౌరసరఫరాల అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెట్ వారితో చర్చించి రైతులతో మాట్లాడి ధరలు అదుపు చేయాలని సూచించారు. ఉల్లిపాయలు, టమోటా, బంగాళాదుంపల ధరల పట్టికను విడుదల చేశారు.

News June 22, 2024

సీజన్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి: కలెక్టర్

image

సీజన్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మున్సిపల్ శాఖ అధికారులు, మెడికల్ అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. నివాస ప్రాంతాలలో మురుగునీరు నిలువ ఉండకుండా చూడాలని, నీటి కుంటల వద్ద ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.

News June 22, 2024

శ్రీకాకుళం: డిప్లొమా, ITI పాసైన వారికి ముఖ్య గమనిక

image

2021, 22, 23, 24 సంవత్సరాలలో డిప్లొమా, ITI పాసైనవారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నైపుణ్య శిక్షణ & ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 28లోపు రిజిస్టర్ చేసుకోవాలని APSSDC సూచించింది. ఎంపికైనవారికి 45 రోజులపాటు ఉచిత శిక్షణ అందించి తిరుపతిలోని శ్రీసిటీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంది. పూర్తి వివరాలకు APSSDC వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది.

News June 22, 2024

ఎవరూ అధైర్య పడొద్దు: MLCతో జగన్

image

అసెంబ్లీ ఛాంబర్‌లో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తినీ ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. ఓడిపోయినందుకు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై పోరాటం సాగించాలని కోరినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పార్టీకి అన్నివేళలా అందుబాటులో ఉంటామన్నారు.

News June 22, 2024

విశాఖ: కూరగాయల ధరలపై జేసీ సమీక్ష

image

పెరుగుతున్న కూరగాయల ధరలపై కలెక్టరేట్‌లో విశాఖ జేసీ వివిధ శాఖల అధికారులు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. టమాటో, ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కారణంగా టమాటో దిగుబడి తగ్గినట్లు అధికారులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. మార్కెటింగ్ శాఖ జిల్లాకు కేటాయించిన రివాల్వింగ్ ఫండ్‌తో ఇతర జిల్లాల నుంచి టమాటా, ఉల్లి కొనుగోలు చేసి తక్కువ ధరలకు వినియోగదారులకు అందించాలన్నారు.

News June 22, 2024

29న గుంటూరు జిల్లాలో జాతీయ లోక్అదాలత్

image

ఈనెల 29న గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోపం జిల్లా అంతటా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ బెంచెస్ ద్వారా సివిల్ కేసులు, రాజీపడే క్రిమినల్ కేసులు, వివాహ కేసులు, పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.

News June 22, 2024

కృష్ణా: నూతన డీజీపీని కలిసిన ఎస్పీ అద్నాన్

image

రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావును కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతల గురించిన నూతన డీజీపీకి ఎస్పీ వివరించారు.

News June 22, 2024

మహానందిని వదలని చిరుతపులి.. స్పందించని అటవీ శాఖ అధికారులు

image

మహానంది పుణ్యక్షేత్రంలోని పార్వతిపురం టోల్‌గేట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. చిరుత సంచారంతో భక్తులు, గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోసారి చిరుత సంచారంతో ఆ మార్గంలో నడిచే భక్తులు, స్థానికులు భయపడుతున్నారు. వారం రోజులుగా చిరుత పులి మహానందిలో సంచరిస్తోందని, టోల్‌గేట్ సమీపంలో చిరుత పులి రోడ్డు దాటుతుండగా చూశామని అక్కడి స్థానికులు తెలిపారు.

News June 21, 2024

పశ్చిమగోదావరి జిల్లాకు వర్ష సూచన

image

ద్రోణి ప్రభావంతో శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రైతులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.