Andhra Pradesh

News April 19, 2025

గన్నవరం: లారీ డ్రైవర్‌కు గుండె పోటు.. ఇద్దరి దుర్మరణం

image

విజయవాడ గన్నవరం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నవరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ డ్రైవర్‌కు ప్రసాదం పాడు వద్ద గుండెపోటు రావడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ఫుట్ పాత్‌పై లారీ దూసుకెళ్లడంతో నడుచుకొని వెళ్తున్న రామసాయి(18) స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పామర్రుకు చెందిన  వ్యక్తిగా గుర్తించారు.

News April 19, 2025

ఘోర ప్రమాదం.. కడప ప్రయాణికులు సేఫ్

image

కడప ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి దాదాపు 20మందితో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కడప నుంచి బయల్దేరింది. గద్వాల(D) ఇటిక్యాల(M) మండలంలోని ప్రియదర్శి హోటల్ వద్ద హైదరాబాద్ నుంచి నంద్యాల వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి కడప బస్సు పైకి దూసుకొచ్చింది. కారులోని ఇద్దరు చనిపోగా.. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్యామేజ్ కావడంతో కడప ప్రయాణికులను మరో వాహనంలో HYD తరలించారు.

News April 19, 2025

నరసన్నపేట: వీడిన మిస్టరీ.. గుండెపోటుతో ఉద్యోగి మృతి

image

నరసన్నపేట మండల కేంద్రంలో స్థానిక మారుతీనగర్ ఒకటో వీధిలో అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న కొర్రాయి వెంకటరమణ గత మూడు రోజుల కిందట ఇంటి వద్ద ఉన్న సమయంలో గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

News April 19, 2025

ప్రకాశం: వీరిద్దరే దొంగలు.. జాగ్రత్త

image

ఇటీవల ప్రకాశం జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాళ్లూరు పోలీసులు శుక్రవారం ఇద్దరు దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా వీళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అనాథాశ్రమానికి సహాయం చేయండంటూ ముందుగా మహిళ తాళాలు వేసిన ఇళ్లను గమనిస్తుంది. ఆ తర్వాత మరో వ్యక్తికి సమాచారం అందిస్తే అతను దొంగతనం చేస్తాడు. వీరితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

News April 19, 2025

కలెక్టర్‌ను కలిసిన జీవియంసీ కాంట్రాక్టర్లు

image

విశాఖ కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్‌ను కలిసిన జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఛైర్మన్ఆధ్వర్యంలో శుక్రవారం కలిశారు. జీవీఎంసీలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరారు. కోట్లాది రూపాయలు అప్పులు చేసి వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు. కలెక్టర్ వెంటనే స్పందించి రూ.ఆరు కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడం ఇచ్చారు.

News April 19, 2025

GNT: ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ, ఎక్సైజ్ కమిషనర్ నీషాంత్ కుమార్, జేసీ భార్గవ్ తేజ, ఎంటీఎంసీ కమిషనర్ అలీబాషా, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా హెలీప్యాడ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News April 19, 2025

అనంత: స్వర్ణాంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష

image

అనంతపురంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం అన్ని శాఖలతో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణ ఆంధ్రా- స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ జరిగిందన్నారు. గ్రామస్థాయిలో పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News April 19, 2025

కర్నూలు: సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే రక్షణ

image

సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. ప్రజలు వారి విలువైన సమాచారం నష్టపోడానికి, మోసపోవడానికి ప్రధానంగా అత్యాశ, అశ్రద్ధ కారణాలని సూచించారు. మోసానికి గురైనవారు వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అప్రమత్తతే రక్షణని ఆయన హెచ్చరించారు.

News April 19, 2025

సోంపేట: బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు పరిశీలన

image

శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం బారువా బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం  కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పర్యాటకులు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జెసీ, ఆర్డీఓ తదితరులు ఉన్నారు.

News April 19, 2025

ప.గో: జేసీ హెచ్చరికలు 

image

షాపులు నిర్వాహకులు రోడ్ల పక్కన చెత్త వేస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జేసీ భీమవరం పట్టణంలో పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డు పక్కన వ్యాపారస్తులు వద్దకు వెళ్లి చెత్త ఎక్కడ వేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లను వాడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.