Andhra Pradesh

News June 21, 2024

కడప: నీట్‌లో సీటు రాలేదని యువతి ఆత్మహత్యాయత్నం

image

నీట్‌లో సీటు రాలేదని యువతి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. చిట్వేలి మండల కేంద్రంలో నివాసం ఉంటున్న మల్లెంపల్లికి చెందిన నారాయణ కుమార్తె సృజన నీట్‌లో సీటు రాలేదని శుక్రవారం రాత్రి గుంజన నది బ్రిడ్జి పైనుంచి దూకింది. విషయం తెలుసుకున్న చిట్వేలి ఎస్సై సుధాకర్, సిబ్బంది అంబులెన్సులో ఎక్కించి చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

విశాఖ: ‘పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ద్వారా గంజాయి రవాణా జరిగితే చర్యలు’

image

పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ద్వారా తెలియకుండా గంజాయి రవాణా జరిగినా సంబంధిత ఏజెన్సీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సెబ్ ఏడీసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిరోధానికి వందరోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నగరంలోని పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ప్రతినిధులతో నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల రవాణా నేరమని హెచ్చరించారు.

News June 21, 2024

వేటపాలెం: గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

image

వేటపాలెం మండలం రామాపురం తీరం వద్ద నలుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాలకి చెందిన నలుగురు యువకులుగా పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. మృతి చెందిన యువకులలో నితిన్ (26), అమలరాజ (27), కిషోర్ (25) మృతదేహాలు లభ్యమయ్యాయి. నాని (23) అనే యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News June 21, 2024

కృష్ణా: డిప్లొమా, ITI పాసైన వారికి ముఖ్య గమనిక

image

2021, 22, 23, 24 సంవత్సరాలలో డిప్లొమా, ITI పాసైన వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నైపుణ్య శిక్షణ & ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 28లోపు రిజిస్టర్ చేసుకోవాలని APSSDC సూచించింది. ఎంపికైన వారికి 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించి తిరుపతిలోని శ్రీసిటీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపింది.

News June 21, 2024

ఆల్ ఇండియా శ్రేష్టలో మద్దికేర విద్యార్థి సత్తా

image

మద్దికేర మండల కేంద్రానికి చెందిన పారా రాజేంద్ర కుమార్, సుమలత దంపతుల కుమార్తె పారా షారోన్ గత నెలలో నిర్వహించిన ఆల్ ఇండియా శ్రేష్ట పరీక్షలో 75వ ర్యాంకుతో మంచి ఫలితాలను సాధించింది. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. వీరి తండ్రి ప్రభుత్వ చౌక దుకాణం డీలర్‌గా ఉన్నారు. తల్లి మాజీ వాలంటీర్‌. కూతురి ఇష్టం మేరకే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయించామని తల్లిదండ్రులు తెలిపారు.

News June 21, 2024

మా తాత కల నెరవేరింది: ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

ఇవాళ తమ తాత కల నెరవేరిందంటూ శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ట్వీట్ చేశారు. ‘నేను ఎమ్మెల్యే కావాలన్నది మా తాత బండారు నారాయణ స్వామి కల. అది నెర వేర్చేందుకు నా వెన్నంటి ఉన్న తల్లిదండ్రులు, నాకు తోడుగా నిలిచిన శింగనమల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ చేయూతతో అసెంబ్లీలో శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశా’ అని పోస్ట్ పెట్టారు.

News June 21, 2024

కందుకూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ బుర్రాకి మాతృ వియోగం

image

మాజీ శాసనసభ్యులు, కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి బుర్రా లక్ష్మమ్మ వయోభారం వలన శుక్రవారం మరణించారని బుర్రా అనుచరులు తెలిపారు. కాగా శనివారం ఉదయం 10:00 గంటలకు టంగుటూరు మండలం, శివపురం గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు సూచన మేరకు తెలియజేశారు.

News June 21, 2024

శ్రీకాకుళం మహిళలకు వసతి భోజనంతో శిక్షణ

image

ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 25 నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళల కోసం టైలరింగ్‌లో 30 రోజుల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనుంది. శిక్షణాకాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయని సంస్థ డైరెక్టర్ కల్లూరు శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. వివరాలకు మండల కేంద్రంలో ఉన్న శిక్షణ సెంటర్లో సంప్రదించాలని కోరారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య మహిళలు అర్హులని అన్నారు.

News June 21, 2024

ఆ వైసీపీ కార్యాలయాలను కూల్చివేయాలి: విశాఖ కార్పొరేటర్

image

విశాఖ నగరం ఎండాడ, అనకాపల్లి జిల్లా రాజుపేటలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనాలను చట్టపరంగా కూల్చివేయాలని జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ సురేశ్‌కు వినతి పత్రం అందజేశారు. విశాఖలో కార్యాలయ స్థలానికి ఏడాదికి ఎకరానికి కేవలం రూ.1000 అద్దె చెల్లించడానికి 33ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు తెలిపారు.

News June 21, 2024

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సౌరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న చర్యలు గురించి ఆయనకు కలెక్టర్ వివరించారు.