Andhra Pradesh

News June 21, 2024

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే బంపరాఫర్

image

మడకశిర నుంచి విజయం సాధించిన ఎంఎస్ రాజు డీఎస్సీకి సిద్ధమవుతున్న వారికి బంపరాఫర్ ప్రకటించారు. డీఎస్సీ కోసం ఉచితంగా శిక్షణ ఇస్తామని ప్రకటించారు. మడకశిర నియోజకవర్గంలో డీఎస్సీ ఎస్జీటీ పోస్టులకు సన్నద్ధమవుతున్న వారికి మాత్రమే ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన కార్యాలయ సిబ్బంది ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

News June 21, 2024

విజయవాడలో దారుణం.. ఉరివేసుకొని భార్యాభర్తలు మృతి

image

విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భార్యాభర్తలు ఫ్యాన్‌కు ఉరివేసుకొని శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పడమట సీఐ మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇరువురు మృతిచెందడంతో ఒక్కసారిగా రామలింగేశ్వర నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

News June 21, 2024

SLKM: దర్శకుడు అవుతారా? ఎస్పీ GOODNEWS

image

జూన్ 26 తేది అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించేలా 3నిమిషాల నిడివిగల లఘు చిత్రాన్ని చిత్రీకరించి 6309990940 (PRO) జూన్ 25 తేది ఉదయానికి వాట్సాప్ ద్వారా పంపించాలని జిల్లా ఎస్పీ జీ.ఆర్ రాధిక శుక్రవారం కోరారు. వచ్చిన లఘు చిత్రాలను ఎంపిక చేసి రూ.5 వేలు, 3 వేలు నగదు బహుమతి అందజేస్తామన్నారు.

News June 21, 2024

జమ్మలమడుగు: వ్యక్తి అనుమానాస్పద మృతి

image

జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం వద్దిరాల సచివాలయం వద్ద శుక్రవారం వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుడు పెద్దముడియం గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్ వలిగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గొల్లపల్లె క్రషర్ మిషన్ ఆపరేటర్ గా పని చేసేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యం సేవించడం అలవాటు ఉంది. మృతికి గల కారణాలు తెలియాలి.

News June 21, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి: DEO

image

ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, పిల్లలను చేర్పించాలని ఏజెన్సీ DEO మల్లేశ్వరావు కోరారు. దేవీపట్నం గ్రామం సమీపంలో నిర్వాసితుల కాలనీలో శుక్రవారం అడ్మిషన్స్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పలువురు విద్యార్థులను జడ్పీ పాఠశాలలో చేర్పించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News June 21, 2024

సత్తెనపల్లి: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

image

మండలంలోని అబ్బూరు గ్రామంలో బ్రహ్మయ్య(47) అనే రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్రహ్మయ్య ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశారు. అయితే పంట సరిగా పండకపోవడంతో సుమారు రూ.20 లక్షలు అప్పులు మిగిలాయి. అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 21, 2024

వేటపాలెం: సముద్ర తీరం వద్ద తీవ్ర విషాదం

image

వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సముద్ర స్నానానికి వచ్చిన నలుగురు యువకులు గల్లంతైన ఘటన వెలుగు చూసింది. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు వ్యక్తులు గల్లంతు అయినట్లు స్థానికులు తెలిపారు. తీరానికి మూడు మృతదేహాలు కొట్టుకు రాగా నాలుగో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

నెల్లూరు: ఆటోని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

నెల్లూరు రూరల్ మండలం మాదరాజగూడూరు, రంగాచార్యుల కండ్రిగ మధ్యలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ముత్తుకూరుకి వెళ్తున్న ఆటోని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటోలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

News June 21, 2024

కృష్ణా: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుంది వీరే

image

ఉమ్మడి కృష్ణా నుంచి ఈ సారి ఆరుగురు నాయకులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాస్, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, బీజేపీ నుంచి సుజనా చౌదరి శాసనసభకు మొదటిసారి ఎన్నికయ్యారు. వీరిలో కృష్ణప్రసాద్(పెడన), వెంకట్రావు(గన్నవరం) 2019లో పోటీ చేసి ఓడిపోయి రెండో పర్యాయం గెలుపొందగా, మిగతా నలుగురు తొలిసారి పోటీ చేసి విజయం అందుకున్నారు.

News June 21, 2024

పవన్ ఆదేశాలతో త్వరలో బొమ్మూరు సైన్స్ మ్యూజియం ప్రారంభం

image

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బొమ్మూరు సైన్స్ మ్యూజియం భవనం త్వరలో ప్రారంభం కానుంది. ఈ సైన్స్ పార్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2017లో మంజూరు కాగా.. 2018 రూ.16.82 కోట్లతో శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు సైన్స్ ప్రాజెక్టుల కోసం ఉపయోగపడేలా కేంద్రాన్ని తీర్చిదిద్దారు. నిర్మాణం పూర్తయినా గత ప్రభుత్వం ప్రారంభించకుండా వదిలేసింది.