Andhra Pradesh

News June 21, 2024

ఏ.యూలో ప్రభుత్వ ఉత్తర్వుల గుబులు

image

పదవీ విరమణ చేసి కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులను తక్షణం రాజీనామా చేయాలని ఉత్తర్వులు విడుదలైన నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గుబులు రేగుతోంది. ఇప్పటికే ఓఎస్డీగా పని చేస్తున్న మాజీ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణ మోహన్‌తో పాటు ఫార్మసీ, న్యాయ, సైన్స్, మహిళా ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పరిస్థితి ఏమిటనే సందేహం కలుగుతోంది. వీరంతా రాజీనామా చేసి కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే చర్చ నడుస్తోంది.

News June 21, 2024

‘కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అనే నేను’

image

డోన్ ఎమ్మెల్యేగా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డిగా ప్రమాణం స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఆయన చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. కాగా ఆయన మెుదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

News June 21, 2024

మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగ: ఎస్పీ

image

తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగ అన్నారు. పోలీసులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు 15 నిమిషాలు యోగ చేసి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలని ఆకాంక్షించారు.

News June 21, 2024

అనంత జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకోండి

image

అనంత జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అర్హులైన విద్యార్థుల దరఖాస్తులు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బుకొఠారి తెలిపారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంతపురం డివిజన్ల పరిధిలోని 38 ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 3,103, బాలికలకు 1,364 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. 17 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో బాలురకు 622, బాలికలకు 547 సీట్లు ఉన్నట్లు తెలిపారు.

News June 21, 2024

శ్రీకాకుళం: వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు గడువు పెంపు

image

తొగరం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు గడువు పెంచినట్లు ప్రిన్సిపల్ పైడి వెంకటరావు గురువారం తెలిపారు. విద్యార్థులు కోర్సుల్లో చేరేందుకు ఈనెల 30 వరకు అవకాశం ఉందని చెప్పారు. 2002 ఆగస్టు 31 నుంచి 2009 ఆగస్టు 31 మధ్యలో జన్మించి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. www.angrau.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 21, 2024

సవిత అనే నేను

image

పెనుకొండ ఎమ్మెల్యేగా సవిత ప్రమాణం స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఆమె చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. కాగా ఆమె బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

News June 21, 2024

ముందు నారాయణ.. తర్వాత ఆనం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. వీరిలో ముందుగా మంత్రి నారాయణ ఇవాళ అసెంబ్లీలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. మరికాసేపట్లో ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది.

News June 21, 2024

నేడు అసెంబ్లీలోకి గద్దె.. ఆయన హామీలివే.!

image

విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా 3వ సారి ఎన్నికైన గద్దె రామ్మోహన్ తాను ఓటర్లకు ఇచ్చిన కింది హామీలు నెరవేర్చాలని ప్రజానీకం ఆశిస్తున్నారు.
☞ కొండప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం
☞ డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కృషి
☞ పేదలకు ఇళ్ల పట్టాలు
☞ పథకాలను పారదర్శకంగా అమలు
☞ టిడ్కో ఇళ్లను పూర్తి చేయడం
☞ వాన నీటి మళ్లింపుకు డ్రైనేజ్ నిర్మాణం.

News June 21, 2024

కడప: 13 తులాల బంగారు ఆభరణాల చోరీ

image

మహిళ సంచిలో తెచ్చుకున్న 13
తులాల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం మేరకు.. గాలివీడు మండలానికి చెందిన పి.ప్రమీల ఫిబ్రవరి 28న దేవుని కడప వద్ద బంధువుల వివాహానికి ఆర్టీసీ బస్సులో వస్తున్నారు. దారిలో తాను తెచ్చుకున్న సంచి జిప్ తెరచి ఉండడంతో ఆందోళనగా తెరచిచూశారు. అందులో ఉన్న బంగారం అపహరణకు గురయ్యాయని గమనించి బోరున విలపించారు. కడప వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 21, 2024

శ్రీకాకుళం: డిగ్రీ ఫలితాల్లో ఎంతమంది పాస్ అయ్యారంటే..!

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ మేరకు మొత్తం 9,832 మంది విద్యార్థులు హాజరు కాగా 9,777 మంది ఉత్తీర్ణత సాధించారు. 99.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కోర్సులు వారీగా బీఏలో 1235 మందికి 1229 మంది, బీసీఏలో 160 మందికి 155 మంది, బీసిఏలో 158 మందికి 156 మంది, బీకాంలో 1519 మందికి 1509 మంది, బీఎస్సీలో 6760 మందికి 6728 మంది ఉత్తీర్ణత సాధించారు.