Andhra Pradesh

News June 21, 2024

ప్రకాశం: 24న ఐటీఐ ప్రవేశాలకు కౌన్సెలింగ్

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలోని ప్రవేశాలకు ఈనెల 24, 25 తేదీలలో కౌన్సెలింగ్ జరుగుతుందని జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. పదవ తరగతి మార్కులు జాబితా కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు వంటి పత్రాలతో ఆ తేదీల్లో హాజరుకావాలన్నారు. కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత కళాశాల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వనున్నట్లు వివరించారు.

News June 21, 2024

నేడు అసెంబ్లీలోకి సుజనా.. ఆయన హామీలివే.!

image

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన సుజనా చౌదరి తాను ఓటర్లకు ఇచ్చిన కింది హామీలు నెరవేర్చాలని ప్రజానీకం ఆశిస్తున్నారు. కాగా నేడు సుజనా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
☞ కొండప్రాంత వాసులకు ఇళ్ల రిజిస్ట్రేషన్
☞ లేబర్ కాలనీలో స్టేడియం నిర్మాణం
☞ దుర్గ గుడి, భవానీ ద్వీపం అభివృద్ధికి కృషి
☞ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి
☞ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ
☞ హజ్ హౌస్ నిర్మాణం.

News June 21, 2024

కాకినాడ: తనతో మాట్లాడటం లేదని బాలిక సూసైడ్

image

తునికి చెందిన ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. SI విజయ్ బాబు వివరాల ప్రకారం.. తునిలోని రెల్లికాలనీకి చెందిన 16 ఏళ్ల బాలిక ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, అక్కడే పనిచేస్తున్న యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు తనతో మాట్లాడకుండా మరో యువతితో చనువుగా ఉంటున్నాడనే మనస్తాపానికి గురై బుధవారం పురుగుల మందు తాగింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.

News June 21, 2024

గుంటూరు : శాసనసభకు ఎవరెవరు ఎన్నోసారంటే..!

image

◆సీనియర్లు: ధూళిపాళ్ల నరేంద్ర (6వసారి)
◆యరపతినేని శ్రీనివాసరావు (4వసారి)
◆నాదెండ్ల మనోహర్ (3వసారి)
◆నక్కా ఆనంద్ బాబు (3వసారి)
◆అనగాని సత్యప్రసాద్(3వ సారి)
◆జీవీ ఆంజనేయులు (3వసారి)
◆తెనాలి శ్రావణ్ కుమార్ (2వసారి)
◆తొలిసారి: నారా లోకేశ్, మొహ్మద్ నసీర్ అహ్మద్, గళ్ళా మాధవి
◆ బూర్ల రామాంజనేయులు, చదలవాడ అరవింద్ బాబు
◆ భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, వేగేశన నరేంద్ర వర్మ

News June 21, 2024

కర్నూలు జిల్లాలో ఏడుగురి తొలిసారి అసెంబ్లీలోకి

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇవాళ ఏడుగురి తొలసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.
☞డోన్ ఎమ్మెల్యేగా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి
☞కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్
☞పత్తికొండ ఎమ్మెల్యేగా కేఈ శ్యాంబాబు
☞ కోడుమూరు ఎమ్మెల్యేగా బొగ్గుల దస్తగిరి
☞నందికొట్కూరు ఎమ్మెల్యేగా గిత్తా జయసూర్య
☞ఆదోని ఎమ్మెల్యేగా పీవీ పార్థసారథి
☞ఆలూరు ఎమ్మెల్యేగా విరుఫాక్షి

News June 21, 2024

తూ.గో.: ‘500 మార్కుల కంటే ఎక్కువ వస్తే బహుమతి’

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఈ ఏడాది టెన్త్ పరీక్ష ఫలితాల్లో 500 మార్కులు పైగా వచ్చిన భట్రాజు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు రూ.2 వేల నగదు ప్రోత్సాహక బహుమతి, జ్ఞాపిక అందిస్తామని తూ.గో జిల్లా భట్రాజు సంక్షేమ సంఘం అధ్యక్షుడు లోలభట్టు శ్రీనివాసరాజు రాజమండ్రిలో గురువారం తెలిపారు. మార్కుల జాబితా, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో ఈ నెలాఖరులోగా 94935 47944 నంబర్‌కు వివరాలు పంపాలని సూచించారు.

News June 21, 2024

విశాఖ షిప్ యార్డ్ 84వ వ్యవస్థాపక దినోత్సవం

image

విశాఖ షిప్ యార్డ్ 84వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. దేశంలో తొలి నౌక నిర్మాణ కేంద్రంగా విశాఖపట్నంలో హిందుస్థాన్ ప్రారంభమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. గత మూడేళ్లుగా సంస్థ లాభాలను చూస్తోంది.. 2021-22లో 51 కోట్ల లాభాన్ని, 2022-23 సంవత్సరంలో 65 కోట్ల లాభాన్ని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 109 కోట్ల లాభాన్ని అర్జించింది.

News June 21, 2024

ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌‌పై సస్పెన్షన్ ఎత్తివేత..!

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.లావణ్యదేవిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన భర్త అయిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తరఫున ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. తాజాగా ఆమె సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News June 21, 2024

నేడు అసెంబ్లీకి నారా లోకేశ్.. ఆయన హామీలివే.!

image

మంగళగిరి MLAగా నారా లోకేశ్ నేడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఆయన హామీలివే..
◆మంగళగిరి, తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు
◆ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు
◆నియోజకవర్గంలోని 20వేల మంది పేదలకు పక్కా ఇళ్లు
◆స్వర్ణ కార హబ్, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
◆చేనేత వస్త్రాలకు ప్రపంచస్థాయి గుర్తింపునకు చర్యలు
◆మంగళగిరి, తాడేపల్లి వాసులకు శుద్ధి చేసిన కృష్ణా జలాలను అందించడం.

News June 21, 2024

నేడు అసెంబ్లీలోకి గల్లా మాధవి.. ఆమె హామీలివే.!

image

గుంటూరు వెస్ట్ MLAగా గల్లా మాధవి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఆమె హామీలివే..
◆UGD పనులు పునఃప్రారంభం
◆హోటళ్లలో ఆహార కల్తీ నియంత్రణ
◆స్వచ్చ గుంటూరు సాకారానికి సులభ్ కాంప్లెక్సుల నిర్మాణం
◆ప్రీలెఫ్ట్‌తో పాటు పార్కులు అభివృద్ధి
◆కుక్కల బెడదపై చర్యలు
◆రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
◆గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారిపై ఉక్కుపాదం
◆శ్యామల నగర్ RUB, శంకరవిలాస్ ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి.