Andhra Pradesh

News June 21, 2024

ATP: డ్రైవింగ్ స్కూల్‌లోనే రెన్యువల్

image

అనంతపురం నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లోనే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌ను పొందవచ్చని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగ భూపాల్ ప్రకటనలో తెలిపారు. అనంతపురం రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు ఒక రోజు నాన్ రెసిడెన్సియల్ ట్రైనింగ్ ఇచ్చి రెన్యువల్‌ను అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆర్టీసీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

News June 21, 2024

ప్రశంసా పత్రం అందుకున్న పవన్ కుమార్

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో విధి నిర్వహణలో అందించిన విశేష సేవలకు గాను ఆత్రేయపురం మండల తహశీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఎం.పవన్ కుమార్ ప్రభుత్వం నుంచి ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ మేరకు అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రెవెన్యూ దినోత్సవ వేడుకలలో ఆయన కలెక్టర్ హిమాన్సు శుక్లా చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఆయనను మండలాధికారుల అభినందించారు.

News June 21, 2024

షర్మిలను కలిసిన కాంగ్రెస్ కర్నూలు జిల్లా నాయకులు

image

విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళావెంకట్రావు భవన్‌లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో గురువారం జిల్లా అభ్యర్థుల సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి షర్మిల వివరించారని ఆ పార్టీ ఆదోని ఇన్‌ఛార్జ్ రమేశ్ యాదవ్ తెలిపారు. క‌ర్నూలు ఎంపీ అభ్య‌ర్థి రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్ ఉన్నారు.

News June 21, 2024

రాయచోటి: ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’

image

నీట్ పరీక్ష పత్రం లీకేజ్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని కొత్తపేట బాలికల కళాశాల ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

News June 21, 2024

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు క్యూ కట్టిన తల్లిదండ్రులు

image

చిత్తూరు: పుంగనూరులోని కొత్త ఇండ్లు మున్సిపల్ పాఠశాలలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. పాఠశాలలో 750 మంది విద్యార్థులకు చదువుకోవడానికి మౌళిక వసతులు ఉన్నప్పటికీ ఇప్పటికే దాదాపు 1000 మందికిపైగా విద్యార్థులు ఉన్నట్లు హెచ్ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. 6వ తరగతిలో ఇప్పటికి 150 మంది చేరారని అన్నారు.

News June 21, 2024

జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తాం: ఎస్పీ దీపిక

image

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ నెల 24 నుంచి ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని ఎస్పీ ఎం.దీపిక గురువారం తెలిపారు. ఇకపై ప్రతీ సోమవారం యధావిధిగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.

News June 21, 2024

జిల్లా ప్రజలను ఆదుకోవాలి: మంత్రి స్వామి

image

ప్రకాశం జిల్లాలో పరిస్థితిలను పరిశీలించి, సమగ్ర నివేదిక తయారుచేసి జిల్లా ప్రజలను ఆదుకోవాలని మంత్రి స్వామి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లాలో కరవు పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చిన బృందంతో ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని కరవు పరిస్థితులను కలెక్టర్, మంత్రి స్వామి బృందానికి తెలియజేశారు.

News June 21, 2024

నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవాలి: బీజేపీ

image

నెల్లూరు నగరంలోని బర్మా షేల్ గుంటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదం ఘటన హృదయ విధారకమైందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి అన్నారు. ప్రభుత్వం తోపాటు స్వచ్చంద సంస్థలు బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 14ఇళ్ళు అగ్నికి అహుతి అయ్యాయని ఆ ఇండ్లలో ఉన్న సామానులు బట్టలు పూర్తిగా కాలిపోవడంతో వారు నిరాశ్రయులు అయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

News June 21, 2024

వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో తనిఖీలు

image

వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలోని బొబ్బిలి, విజయనగరం, రాయగడ రైల్వే స్టేషన్లలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్ వాల్ గురువారం తనిఖీలు నిర్వహించారు. రైల్వే ప్రయాణికులకు భద్రతతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నిర్మాణంలోనూ ఉన్న వివిధ ప్రాజెక్టుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. జీఎం వెంట వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ ఉన్నారు.

News June 21, 2024

అమరావతి: ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ

image

ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్‌ఛార్జ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాద్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. అతుల్ సింగ్‌కి ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని పీవీ సునీల్ కుమార్‌కి ఆదేశాలిచ్చింది.