Andhra Pradesh

News June 20, 2024

అమరావతి: ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ

image

ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్‌ఛార్జ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాద్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. అతుల్ సింగ్‌కి ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని పీవీ సునీల్ కుమార్‌కి ఆదేశాలిచ్చింది.

News June 20, 2024

విజయవాడ: ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ

image

ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్‌ఛార్జ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాద్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. అతుల్ సింగ్‌కి ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని పీవీ సునీల్ కుమార్‌కి ఆదేశాలిచ్చింది.

News June 20, 2024

నెల్లూరు: బీద రవిచంద్రకు మరోసారి ఎమ్మెల్సీ!

image

కావలికి చెందిన బీద రవిచంద్ర యాదవ్‌ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈ క్రమంలో బీదరవిచంద్రకు మరోసారి ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

News June 20, 2024

బొండపల్లిలో మృతదేహం కలకలం

image

బొండపల్లి మండలంలో ముచ్చర్ల గ్రామానికి చెందిన మజ్జి కృష్ణ (33) ఈనెల 17న తన భార్యను రూ.400 అడిగి బయటికి వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. గురువారం రవీంద్రం గ్రామంలో విగతజీవిగా పడిఉన్న కృష్ణను స్థానికులు గుర్తించారు. ఘటనపై మృతిని భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్నట్లు ఎస్సై కే.లక్ష్మణరావు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 20, 2024

గవర్నర్‌ను కలిసిన అనంతపురం జిల్లా మంత్రులు

image

అనంతపురం జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌నును మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్ భవన్‌లో ఆయన్ను కలిసి పూలమొక్కను అందించారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని వారికి గవర్నర్ సూచించారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వారు గవర్నర్‌ను కలిశారు. 

News June 20, 2024

518 ఫోన్లు రికవరీ చేశాం: ఎస్పీ రాధిక

image

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మొబైల్ ఫోన్స్ రికవరీపై ఎస్పీ జి.ఆర్ రాధిక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు సుమారు 72 ఫోన్‌లను ట్రాక్ చేసి ఎస్పీ చేతుల మీదగా అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 518 ఫోన్లు రికవరీ చేశామని వాటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని ఎస్పీ రాధిక తెలిపారు.

News June 20, 2024

తిరుపతి: ఆహారంలో జెర్రి ప్రత్యక్షం!

image

ఆహారంలో విషపూరిత జెర్రి ప్రత్యక్షమైన ఘటన తిరుపతిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఓ సినిమా హాలు సమీపంలోని ఓ హోటల్‌లో తినే ఆహారంలో జెర్రి ప్రత్యక్షం కావడంతో కస్టమర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 20, 2024

కడప: త్వరలో పోలీసు శాఖలో భారీగా బదిలీలు?

image

టీడీపీ అధికారంలోకి రావడంతో పోలీసుశాఖ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో సీఐలు, ఎస్ఐల బదిలీలు ప్రారంభమయ్యాయి. బుధవారం కొంతమందిని వివిధ ప్రాంతాలకు మార్చారు. మరో రెండు రోజుల్లో సీఐ, ఎస్ఐలతో పాటు డీఎస్పీలకు స్థానచలనం కలగనుంది. వైసీపీ ప్రభుత్వంలో లూప్‌లైన్‌లో ప్రాధాన్యం లేని విభాగాల్లో ఉన్న వారందరూ ప్రస్తుతం తెరపైకి వస్తున్నారు. కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.

News June 20, 2024

శ్రీకాకుళం: విశాఖపట్నం-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

image

ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా
విశాఖపట్నం- అమృత్‌సర్ మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజులపాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైలు నం.20807 విశాఖపట్నం- అమృత్‌సర్ ట్రైన్‌ను జూలై 5, 6, 9 తేదీలలో, నం.20808 అమృత్‌సర్- విశాఖపట్నం ట్రైన్‌ను జూలై 6, 7, 10 తేదీలలో రద్దు చేసినట్లు తెలిపారు.

News June 20, 2024

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి: ఎస్పీ రాధిక

image

జిల్లాలో పూర్తిస్థాయిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమవేశాన్ని నిర్వహించారు. కొత్త వ్యక్తులు సమాచారం సేకరణ, అనుమానిత వ్యక్తులపై నిఘా, లాడ్జిలు, వాహనాలను విసృతంగా తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాహన తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు.