Andhra Pradesh

News June 20, 2024

విద్యతోనే గిరిజనుల అభివృద్ధి: ఎస్టీ కమిషన్ సభ్యుడు

image

విద్యతోనే గిరిజనల అభివృద్ధి సాధ్యమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాముఖ్యం ఇస్తోందని ఎస్టీ కమిషన్ సభ్యుడు వాడిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం కర్నూలులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. జిల్లా పర్యటనలో గిరిజనుల నుంచి కొన్ని విజ్ఞాపనలు వచ్చాయని తెలిపారు.

News June 20, 2024

పిచ్చి కూతలు కూస్తే రోడ్లమీద తిరగనీయరు: ఎస్.అనంతలక్ష్మి

image

పిచ్చి కూతలు కూస్తే రోడ్లమీద ప్రజలు తిరగనీయరని మాజీ మంత్రి కొడాలి నానిని విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఎస్.అనంతలక్ష్మి హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం మీద కొడాలి నాని చేసిన విమర్శలపై స్పందించారు. ఈ మేరకు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని, దోచుకుతినే ప్రభుత్వం కాదన్నారు. కూల్చే ప్రభుత్వం మీది అయితే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం తమదన్నారు.

News June 20, 2024

ఒంగోలు: దోపిడీ కేసులో నిందితులు అరెస్ట్

image

దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఏఎస్పీ శ్రీధర్ రావు తెలిపారు. గురువారం ఒంగోలులోని SP కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొండపి మండలం వెన్నూరునకు చెందిన వంశీకృష్ణ తన బంధువుల ఫంక్షన్ నిమిత్తం ఈనెల 16న ఒంగోలు వచ్చారు. వంశీకృష్ణ కుమారుడు జయవర్ధన్ బాబును ఇద్దరు నిందితులు ఫంక్షన్లో మాయమాటలతో చెయిన్, బ్రాస్లెట్, ఉంగరం దొంగిలించారు. ఈమేరకు పోలీసు బృందాలతో పట్టుకున్నామన్నారు.

News June 20, 2024

ఒంగోలు: మార్పులకు అనుగుణంగా విద్యాబోధన జరగాలి

image

అంతర్జాతీయ సమాజంలో వస్తున్న మార్పులు ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఎంపిక చేసిన 20 పాఠశాలు, కె.జి.బి.వి.లు, ఏ.పి.మోడల్ స్కూల్స్ ఒకేషనల్ కోర్సులు కలిగిన జూనియర్ లెక్చరర్లకు గురువారం కొప్పోలులో కెరీర్ ఎడ్యుకేషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

News June 20, 2024

సిక్కోలు జిల్లాలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి

image

శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పాటుకు వేరువేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సరుబుజ్జిలి మండలం కటకమయ్యపేట గ్రామంలో పిడుగుపాటుకు దేవరపల్లి బారికయ్య (72) మృతి చెందారు. బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామంలో పిడుగు పాటుకు ఆవులు కాపరి చోడవరపు సత్యనారాయణ (30) మృతి చెందారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

News June 20, 2024

కృష్ణా: నిరుద్యోగులకు శుభవార్త

image

ఈ నెల 22న మచిలీపట్నంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా ఉంటుందన్నారు. 

News June 20, 2024

టీటీడీ ఛైర్మన్‌గా ఏలూరి సాంబశివరావు.?

image

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ఏలూరిని నియమించాలని చంద్రబాబు సర్కార్ చూస్తోందని సమాచారం. రాష్ట్ర మంత్రిమండలిలో ఏలూరికి స్థానం దక్కకపోవడంతో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని అధిష్ఠానం చూస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే బాపట్ల జిల్లాలో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి కారకులైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి టీటీడీ ఛైర్మన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు ధీమాగా ఉన్నారు.

News June 20, 2024

శ్రీ మఠంలో సినీ నిర్మాత రాచాల యుగంధర్ గౌడ్

image

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని సినీ నిర్మాత యుగంధర్ గౌడ్ తన సహచరులతో కలిసి దర్శించుకున్నారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళ హారతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుమన్ తేజ, గరీమ చౌహాన్ హీరో, హీరోయిన్లుగా నిర్మించిన ‘సీతా కళ్యాణ వైభోగమే’ చిత్రం శుక్రవారం విడుదల కానుందని, స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు.

News June 20, 2024

గుర్ల: పాముకాటుతో మహిళ మృతి

image

గుర్ల మండలం నడుపూరు గ్రామానికి చెందిన కర్రోతు కళావతి పాము కాటుతో గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కళావతి పశువుల కోసం గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లింది. అక్కడ గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. దీంతో స్థానికులు ఆమెను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మార్గంమధ్యలోనే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News June 20, 2024

YSR విగ్రహాన్ని తొలగించవద్దు: తులసిరెడ్డి

image

యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాంగణం నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కొందరు టీడీపీ నాయకులు తొలగించాలని వైస్ ఛాన్సలర్‌కు వినతిపత్రం అందించడం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ యోగివేమన విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడని, దాదాపు 16 ఏళ్ల నుంచి ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించబడి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల ద్వారా విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు అమోఘమన్నారు.