Andhra Pradesh

News June 20, 2024

అల్లూరి జిల్లా: మద్యం మత్తులో కొట్లాట.. ఒకరు మృతి

image

పాడేరు మండలం మినుములూరులో బంధువుల మధ్య వివాదం జరిగగా ఒకరు మృతి చెందారు. ఈనెల 18న దాగరి సూరిబాబు (63)కు బంధువైన సాగరి.నరసింహమూర్తి మధ్య ఆర్థిక లావాదేవీల విషయమై వివాదం చెలరేగింది. మద్యం మత్తులో నరసింహ మూర్తి సూరిబాబును కర్రతో కొట్టాడు. గాయపడిన సూరిబాబు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. బంధువుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 20, 2024

కార్మికుడిలా పని చేస్తా-మంత్రి సుభాష్

image

కార్మికులకు అందుబాటులో ఉంటూ అన్ని శాఖలను సమన్వయ పరచి ఒక కార్మికుడిలా పనిచేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గురువారం పండితుల వేదశ్వీరచనల మధ్య తొలిసారిగా తన ఛాంబర్‌లోకి ప్రవేశించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికులకు ఉపయోగపడే 13 చట్టాలని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.

News June 20, 2024

నారా భువనేశ్వరికి బర్త్ డే విషెస్ చెప్పిన ఎమ్మెల్యే శ్రావణి

image

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే బండారు శ్రావణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని ఆమె కొనియాడారు. ప్రజలపై భువనేశ్వరి చూపే ప్రేమ, ఆప్యాయత మరవలేనిదని తెలిపారు. మరోవైపు శింగనమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణి రేపు అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు.

News June 20, 2024

కృష్ణా: ANU డిగ్రీ రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూలై 2వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. ఫీజు వివరాలకు https://nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

News June 20, 2024

తిరుపతి కలెక్టర్‌కు ఘన సత్కారం

image

తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బదిలీ అయ్యారు. మైనింగ్, జియాలజీ శాఖ కమిషనర్‌గా పదోన్నతిపై వెళ్తుండడంతో కలెక్టరేట్ అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.

News June 20, 2024

బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలి: DEO

image

5 నుంచి15 సంవత్సరాల పిల్లలు అందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలని అల్లూరి జిల్లా DEO బ్రహ్మాజీరావు అధికారులను, హెచ్‌‌ఎం‌లను ఆదేశించారు. రంపచోడవరంలో గురువారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతీ ఉపాధ్యాయుడు, విద్యార్థుల హాజరు నిర్ణీత సమయంలో వేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News June 20, 2024

విశాఖ: ‘యోగా డేలో అధికారులు, ఉద్యోగులంతా పాల్గొనాలి’

image

అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తోంది ఎంపీపీ కాలనీలోని స్పోర్ట్స్ ఎరీనా ప్రాంగణంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో యోగాడే వేడుకలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం తెలిపింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొవాలని జిల్లా కలెక్టర్ తరఫున తెలిపారు.

News June 20, 2024

మైపాడు బీచ్‌లో ఆదిశంకర కాలేజ్ విద్యార్థి మృతి

image

మైపాడు బీచ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గూడూరు ఆదిశంకర కాలేజ్‌కి చెందిన కొందరు విద్యార్థులు మైపాడు బీచ్‌కు వెళ్లి సముద్రంలో ఈత కొడుతుండగా వారిలో ఒక విద్యార్థి సముద్రంలో మునిగిపోయాడు. తోటి విద్యార్థులు గమనించి అతనిని ఒడ్డుకు చేర్చారు. కొన ఊపిరితో ఉన్న అతనిని వెంటనే మైపాడులోని ప్రజా వైద్యశాలకు తరలించి అత్యవసర వైద్యం అందించినా అతను మరణించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 20, 2024

సంబేపల్లి: గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మ‌ృతి

image

సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామం మొటుకువాండ్లపల్లికు చెందిన సంతోష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ కుమారుడు సంతోష్ ఇటీవలే బీటెక్ పూర్తి చేశారు. బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఉన్నట్లుండి ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

News June 20, 2024

ఎవరెస్ట్ శిఖిరంపై నారా కుటుంబం ఫొటో పాతిన గుత్తి కుర్రాడు

image

గుత్తి మండలం ఇసుకరాళ్లపల్లికి చెందిన ఉపేంద్ర అనే యువకుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేశ్‌తో వెంట నడిచాడు. ఆ క్రమంలో తన లక్ష్యం గురించి చెప్పడంతో రూ.22 లక్షల ఆర్థిక సాయం అందించారు. తనకు సహకరించిన నారా కుటుంబం ఫొటో, టీడీపీ జెండాను ఎవరెస్ట్‌‌పై పాతి అందరి దృష్టిని ఆకర్షించాడు. వచ్చే ఏడాది మరోసారి ఎవరెస్ట్ ఎక్కి రెండుసార్లు ఎక్కిన ఘనత దక్కించుకుంటానని తెలిపారు.