Andhra Pradesh

News June 20, 2024

కర్నూలు: కుక్క కాటుకు గురై టీడీపీ కార్యకర్త మృతి

image

వెల్దుర్తి మండలం చెరుకులపాడులో టీడీపీ కార్యకర్త కొమ్ము రామాంజనేయులు(62) చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. 8 రోజుల
కిందట చెరుకులపాడులో కుక్క కాటుకు గురయ్యాడని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని తెలిపారు. మృతుడి కుటుంబాన్ని రైతు సంఘం అధ్యక్షుడు ఈదుల వెంకటరాముడు పరామర్శించారు.

News June 20, 2024

అందరి దృష్టి పెద్దిరెడ్డిపైనే..!

image

ఓటమి తర్వాత వైసీపీ అభ్యర్థులు, నేతలు ప్రజల్లోకి రాలేదు. కొందరు ఆ పరాభవం నుంచి ఇంకా తేరుకోలేదు. జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇటీవల పుంగనూరు పర్యటన ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఇవాళ జగన్ గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి పెద్దిరెడ్డి హాజరవుతారా? ఓటమిపై ఏమైనా సందేశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

News June 20, 2024

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి

image

మంత్రిగా వాసంశెట్టి సుభాష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

News June 20, 2024

కాకినాడ: జాతీయ రహదారిపై ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాలు

image

కాకినాడ జిల్లా జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లోని జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాల సంఖ్య భారీగా పెరగటం స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ మూడు మండలాల్లో జనవరి నుంచి ఇంత వరకు 39 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో 17 మంది మృత్యువాత పడ్డారు. 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలకు అతివేగం ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. దీనికి తోడు అధికారుల అలసత్వం కూడా ఒక కారణమని చెబుతున్నారు.

News June 20, 2024

వైసీపీ కౌన్సిలర్లపై దాడి దురదృష్టకరం: గడికోట

image

రాయచోటిలో వైసీపీ కౌన్సిలర్లపైన దాడి చేయడం దురదృష్టకరమని వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడ్డ రాయచోటి ప్రజలకు ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.

News June 20, 2024

గుంటూరు: కౌలు ఒప్పందాన్ని పొడిగించాలంటున్న రైతులు

image

రాజధాని అమరావతిలో రైతులతో ప్రభుత్వం చేసుకున్న కౌలు ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని రైతులు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో సీఎం ఈ అంశంపై హామీ ఇచ్చే అవకాశం ఉందని రైతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

News June 20, 2024

శ్రీసిటీలో 60 ఉద్యోగాలు

image

శ్రీ సిటీలోని ALSTOM కంపెనీలో ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSSDC తిరుపతి జిల్లా అధికారి లోకనాథం పేర్కొన్నారు. డిప్లమా, ఐటిఐ వెల్డర్ పూర్తిచేసి 18-22 సంవత్సరాల్లోపు యువతి, యువకులు అర్హులన్నారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://forms.gle/zHku28A3SuT8a24E6 వెబ్ సైట్ లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 28.

News June 20, 2024

నెల్లూరులో వైసీపీ నాయకులపై పోలీసు కేసు

image

YCP నేతలపై నెల్లూరు నగరంలోని మాజీ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ కోవాకొల్లు విజయలక్ష్మితో పాటు పలువురు నేతలపై కేసు నమోదైంది. మరోవైపు వైసీపీ క్లస్టర్ ఇంచార్జ్ ముడియాల రామిరెడ్డి, 19వ డివిజన్ నేతలు లక్ష్మీనారాయణ, పచ్చా రవి, జల్లి కుమార్‌పై బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 35వ డివిజన్ కార్పొరేటర్ శరత్ చంద్రపై చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు కోరారు.

News June 20, 2024

ఇద్దరు బాలికలపై వృద్ధుడి లైంగికదాడి

image

మనవరాళ్ల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులపై ఓ వృద్ధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతపురం రూరల్‌లోని ఓ గ్రామానికి చెందిన 7, 8 ఏళ్ల బాలికలను 63ఏళ్ల రంగనాయకులు ఇంట్లోకి పిలిపించి తన సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

News June 20, 2024

మీ సమస్య పరిష్కారం కాలేదా.. నాకు ఫోన్ చేయండి: నంద్యాల ఎస్పీ

image

పోలీస్ స్టేషన్ SHOల ద్వారా తమ సమస్య పరిష్కారం కాకపోతే ఫిర్యాదుదారుడు నేరుగా తనకు ఫోన్ చేయొచ్చు అని నంద్యాల జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి తెలిపారు. 9154987020కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా వివరాలు తెలిపి తమ సమస్యకు పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. కాగా మొదట SHO వద్దకు వెళ్లాలని, అక్కడ పరిష్కారం కాకపోతేనే తనకు ఫోన్ చేయాలని ఎస్పీ తెలిపారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.