Andhra Pradesh

News June 20, 2024

తూ.గో: రేషన్ కార్డుదారులకు శుభవార్త

image

పేదలకోసం సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. జులై 1నుంచి రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు కందిపప్పు, పంచదార, బియ్యం పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరిలో కలిపి 50,06,194మందికి లబ్ధి చేకూరనుందని పౌర సరఫరాల శాఖ డీఎస్ వో విజయభాస్కర్ తెలిపారు.

News June 20, 2024

అది ఉద్యోగ ప్రకటన కాదు: విజయవాడ డివిజన్ రైల్వే

image

ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ (ATVM) ఫెసిలిటేటర్స్ కొరకు విజయవాడ రైల్వే డివిజన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఉద్యోగ ప్రకటన కాదని గమనించాలని అధికారులు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ATVM ఫెసిలిటేటర్స్‌కు ఎలాంటి పారితోషికం/వేతనం ఉండదని, వీరికి టికెట్ సేల్‌పై బోనస్ మాత్రమే ఉంటుందని వారు తెలిపారు. పూర్తి వివరాలకు https://scr.indianrailways.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలన్నారు.

News June 20, 2024

ప.గో: చుక్కలు చూపిస్తున్న టమాటా ధరలు

image

ప.గో జిల్లాలో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. నెల రోజుల నుంచి పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం కేజీ రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. అదే రైతుబజారులో అయితే రూ.66 ఉంది. ఆయా చోట్ల వర్షాలతో పంట నష్టం జరిగిందని అందుకు ఉత్పత్తి తగ్గి ఉన్న సరకుకి మంచి డిమాండ్‌ ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.

News June 20, 2024

చీమకుర్తి: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

image

చీమకుర్తి మండల పరిధిలో పరివర్తకం మార్పిడి పనుల కారణంగా కె.వి.పాలెం, ఏలూరివారిపాలెం, గోనుగుంట, రామచంద్రాపురం, పిడతలపూడి, మర్రిపాలెం, మువ్వవారిపాలెం, జీఎలప్పురం గ్రామాలకు.. గురువారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ కృష్ణారెడ్డి, ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. చీమకుర్తి ఉపకేంద్రం పరిధిలోని పరిశ్రమలకు సైతం అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.

News June 20, 2024

గుంతకల్లు: లైంగిక వేధింపులపై కేసు నమోదు

image

గుంతకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన సూర్యనారాయణపై ఎస్సీ, ఎస్టీ, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ సురేశ్ బుధవారం తెలిపారు. ఎస్ఐ వివరాలు.. సూర్యనారాయణ ఓ మహిళను గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. మంగళవారం రాత్రి ఆ మహిళ ఇంట్లోకి చొరబడి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత మహిళ, ఆమె భర్త బుధవారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News June 20, 2024

కర్నూలు: ఐదుగురు సీఐలకు స్థానచలనం

image

కర్నూలు జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఆదోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ తేజోమూర్తి వైఎస్సార్ జిల్లా చిన్న చౌక్ స్టేషన్‌కు, ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్‌లోని కంబగిరి రాముడు కర్నూలు సీపీఎస్‌కు బదిలీ అయ్యారు. చచిన్న చౌక్ పీఎస్‌ సీఐ భాస్కర్ రెడ్డి, ఖాజీపేట అర్బన్ సీఐ రామాంజనేయులును కర్నూలు రేంజ్ వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

News June 20, 2024

యద్దనపూడి: టీడీపీ ఫ్లెక్సీల చించివేత

image

యద్దనపూడి మండలం వింజనంపాడు అధికార పార్టీ ఫ్లెక్సీలను చించివేసిన ఘటన కలకలం రేపింది. వైసీపీకి చెందిన సీనియర్ నేత సమక్షంలోనే ఆ పార్టీ కార్యకర్త కావాలనే సమీపంలో ఉన్న టీడీపీ ఫ్లెక్సీ చించివేయడంపై ఆగ్రామ టీడీపీ నేతలు యద్దనపూడి పోలీసులను ఆశ్రయించారు. కావాలని వైసీపీ నాయకులు, శ్రేణులు అధికార టీడీపీకి చెందిన ప్లెక్సీలు చించివేయడంపై ఆ గ్రామాల్లో కలకలం రేపుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు.

News June 20, 2024

విశాఖలో పెరుగుతున్న టమాటో, ఉల్లి ధరలు

image

టమాట ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు వాటిని కొనలేక ఇబ్బంది పడుతున్నారు. గోపాలపట్నం రైతు బజార్‌లో బుధవారం కిలో టమాట రూ.58కి విక్రయించారు. బయట మార్కెట్లో కిలో ధర రూ.75 వరకు ఉందని వినియోగదారులు తెలిపారు. టమాటోతో పాటు ఉల్లి ధర కూడా కిలో రూ. 50 దాటింది. రోజు కూరల్లో వినియోగించే వీటి ధరలు తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.

News June 20, 2024

పుంగనూరులో నిధుల దుర్వినియోగంపై మెమో

image

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో రూ.1.36 కోట్ల జనరల్ ఫండ్ దుర్వినియోగం జరిగింది. ఈ విషయమై సంబంధిత అధికారులకు మెమో జారీ చేసినట్లు ఎంపీడీవో మునిరెడ్డి వెల్లడించారు. జడ్పీ సీఈవో గ్లోరియా ఆదేశాల మేరకు గతంలో పుంగనూరు ఎంపీడీవో, ఏవోగా పని చేసిన వారికి నిధుల దుర్వినియోగంపై సంజాయిషీ నోటీసులు ఇచ్చామని చెప్పారు. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

News June 20, 2024

కడప: రైతు బజార్లో కిలో రూ.60

image

వర్షాల కారణంగా టమాట పంటలు దెబ్బతింటున్నాయి. ఈ కారణంగా వ్యాపారులు టమాటాలను దిగుమతి చేయట్లేదు. వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ శాఖ పుంగనూరు నుంచి టమాటాలను కొనుగోలు చేసి కడప రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ ద్వారా అమ్మకాలు చేపట్టింది. వినియోగదారులకు కిలో రూ.60 విక్రయిస్తున్నారు. కాగా కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది.