Andhra Pradesh

News June 20, 2024

తిరుపతి: సమర్థవంతంగా పనిచేయాలి

image

జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల అధికారులు సిబ్బందితో బుధవారం సమావేశమై వారి పనితీరును సమీక్షించారు. స్థానిక పోలీసు గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. 2024 సంవత్సరంలో క్రైమ్ పోలీస్ స్టేషన్ లో 34 కేసులు నమోదు కాగా.. అన్నింటిని ఛేదించి 83% రికవరీ రేటుతో సమర్థవంతంగా పనిచేసిన తిరుపతి క్రైమ్ పోలీసులను ప్రశంసించారు. కేసుల చేదనలో ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్నారు.

News June 20, 2024

రామచంద్రపురం మంత్రిని కలిసిన ఎస్పీ శ్రీధర్

image

రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి పదవి చేపట్టిన వాసంశెట్టి సుభాశ్‌ను అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ మంత్రికి దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. రామచంద్రపురం నియోజవర్గం అభివృద్ధికి ఎస్పీ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News June 20, 2024

జిల్లాలో అల్లరిమూకలు ఆట కట్టించాలి : ఎస్పీ

image

నెల్లూరు జిల్లా SP ఆరిఫ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల ప్రారంభం, ముగింపు సమయాలలో విద్యార్థినులకు భరోసా కల్పిస్తూ విజబుల్ పోలీసింగ్ ను నెల్లూరు పోలీసులు నిర్వహిస్తున్నారు. భావితరాల భవిష్యత్‌కు పునాది అయిన బాలికలకు రక్షణ, భద్రత కల్పించాలని ఆదేశించారు. ఈవ్ టీజింగ్, ఇతర నేరాలు అరికట్టాలని, అల్లరిమూకల ఆటకట్టించాలన్నారు. స్కూల్స్, కళాశాలల వద్ద గస్తీ నిర్వహించాలన్నారు.

News June 20, 2024

గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన బాపట్ల SP

image

బాపట్ల పర్యటనకు విచ్చేసిన ఆంధ్రరాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

News June 20, 2024

ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

image

విజ‌య‌వాడ‌ క్యాంపు కార్యాల‌యంలో బుధవారం ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ బాధ్య‌త‌ల స్వీక‌రణ సంద‌ర్భంగా.. ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌ డిల్లీరావు బుధవారం మ‌ర్యాద‌ పూర్వ‌కంగా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News June 20, 2024

వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

image

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆమదాలవలస మండలం తొగరం గ్రామంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.పైడి వెంకట్రావు తెలిపారు. దరఖాస్తు చేసేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువును పెంచుతున్నట్లు చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ విద్యార్ధుల వినతి మేరకు దరఖాస్తు గడువును పొడిగించామన్నారు.

News June 19, 2024

నరసరావుపేట సైబర్ నేరాలు.. లోన్ యాప్‌లపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

image

శాంతిభద్రతల స్థాపనలో సచివాలయ, మహిళా పోలీసులు భాగస్వామ్యులు కావాలని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పేర్కొన్నారు. మహిళా పోలీసులు వారి విధులు గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గర కావాలని సూచించారు. సైబర్ నేరాలు లోన్ యాప్‌లపై అవగాహన పెరగాలన్నారు. రౌడీషీటర్లపై అవగాహన కలిగి ఉండి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News June 19, 2024

ప్రజల కోసం నిరంతరం పనిచేస్తా: మాజీ మంత్రి కొట్టు

image

గెలిచినా, ఓడినా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలోని వైసీపీ కార్యాలయంలో రూరల్ మండల పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా అబద్ధపు ప్రచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించారన్నారు.

News June 19, 2024

యుద్ధ ప్రాతిపదికన వంశధార కాలువ పనులు: మంత్రి అచ్చెన్న

image

పలాస మండలం టెక్కలిపట్నం గ్రామ సమీపంలో ఉన్న వంశధార ప్రధాన కాలువను బుధవారం మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి పలాస ఎమ్మెల్యే శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ గత ఐదేళ్లలో సాగునీరు రాక పిచ్చి మొక్కలు, పొదలతో నిండిన కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి శివారు పొలాలకు నీరందించాలని అధికారులను ఆదేశించారు.

News June 19, 2024

కర్నూలు: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7,476 పలికింది. మంగళవారంతో పోలిస్తే పత్తి ధర స్వల్పంగా రూ.20 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.4,002గా ఉంది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,246, కనిష్ఠ ధర రూ.4,169 పలికింది. ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,200, కనిష్ఠ ధర రూ.4,560 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.