Andhra Pradesh

News June 19, 2024

కర్నూలు: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7,476 పలికింది. మంగళవారంతో పోలిస్తే పత్తి ధర స్వల్పంగా రూ.20 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.4,002గా ఉంది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,246, కనిష్ఠ ధర రూ.4,169 పలికింది. ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,200, కనిష్ఠ ధర రూ.4,560 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

News June 19, 2024

ATP: జిల్లా మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

image

జిల్లా మంత్రులందరికీ సాధారణ పరిపాలన శాఖ అమరావతిలోని సచివాలయంలో ఛాంబర్లు కేటాయించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు రెండో బ్లాకులోని తొలి అంతస్తులో 212వ ఛాంబరు కేటాయించారు. ఇవాళ ఆయన బాధ్యతలు చేపట్టారు. వైద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఐదో బ్లాకు గ్రౌండ్‌ ఫ్లోర్‌‌లో 211వ ఛాంబర్ కేటాయించగా ఈ నెల 16న బాధ్యతలు చేపట్టారు. మంత్రి సవితకు నాలుగో బ్లాకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 131వ ఛాంబర్ కేటాయించారు.

News June 19, 2024

TPT: అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో ఉచిత శిక్షణ

image

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) నందు APSSDC, PMKV సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి, యువకులకు అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడి సతీశ్ చంద్ర పేర్కొన్నారు. పదో తరగతి పాసై, 15-45 సంవత్సరంలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు SV మెడికల్ కళాశాల ఎదురుగా NAC కార్యాలయంలో సంప్రదించగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 24.

News June 19, 2024

తూ.గో: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష: సీఐ

image

రంపచోడవరానికి చెందిన మద్దికొండ సుధాకర్‌కు కాకినాడ పొక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పిందని సీఐ వెంకటేశ్వరావు తెలిపారు. 2019లో అదే గ్రామానికి చెందిన ఒక బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా వైజాగ్ తీసుకెళ్లాడన్నారు. రేప్, కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారించగా.. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందని వెల్లడించారు.

News June 19, 2024

వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

image

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆమదాలవలస మండలం తొగరం గ్రామంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.పైడి వెంకట్రావు తెలిపారు. దరఖాస్తు చేసేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువును పెంచుతున్నట్లు చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ విద్యార్ధుల వినతి మేరకు దరఖాస్తు గడువును పొడిగించామన్నారు.

News June 19, 2024

మాజీ కలెక్టర్ శివశంకర్‌ని కలిసిన MLA చదలవాడ

image

పల్నాడు జిల్లా మాజీ కలెక్టర్ శివశంకర్ లోతేటిని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు బుధవారం కలెక్టర్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చేసిన కృషి అభినందనీయం అన్నారు. నియోజకవర్గాన్ని దేశంలోనే అభివృద్ధికి మోడల్‌గా నిలపాలని అనుకుంటున్నట్లు, ఐఏఎస్ అధికారి తగు సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.

News June 19, 2024

జిల్లాలో అల్లరిమూకలు ఆట కట్టించాలి : ఎస్పీ

image

నెల్లూరు జిల్లా SP ఆరిఫ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల ప్రారంభం, ముగింపు సమయాలలో విద్యార్థినులకు భరోసా కల్పిస్తూ విజబుల్ పోలీసింగ్ ను నెల్లూరు పోలీసులు నిర్వహిస్తున్నారు. భావితరాల భవిష్యత్‌కు పునాది అయిన బాలికలకు రక్షణ, భద్రత కల్పించాలని ఆదేశించారు. ఈవ్ టీజింగ్, ఇతర నేరాలు అరికట్టాలని, అల్లరిమూకల ఆటకట్టించాలన్నారు. స్కూల్స్, కళాశాలల వద్ద గస్తీ నిర్వహించాలన్నారు.

News June 19, 2024

విశాఖ: గంజాయి నిర్మూలనకు 100 రోజుల యాక్షన్ ప్లాన్

image

గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలనకు గట్టి చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశించారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కమిషనర్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. గంజాయి మాదకద్రవ్యాల నివారణపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించారు.

News June 19, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో 10th క్లాస్ విద్యార్థి మృతి

image

ఆటో బోల్తాపడి గాయపడ్డ విద్యార్థి మృతి చెందినట్లు ముదివేడి SI మల్లికార్జునరెడ్డి తెలిపారు. కురబలకోట మండలంలో ఆటో బోల్తా పడిన విషయం తెలిసిందే. ముదివేడుకు చెందిన ఎస్.రఫీ కొడుకు ఎస్.జియావుల్లా(15)స్థానిక మోడల్ స్కూల్లో10వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ వదలగానే ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. దారిలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.

News June 19, 2024

పాడేరులో విషాదం

image

అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్త పాడేరు సమీపంలో నూతిలో ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం కొందరు యువకులు కొత్త పాడేరు నుయ్యి వద్ద మద్యం సేవించారు. ఓ స్నేహితుడి సెల్ నూతిలో పడిపోవడంతో తాను దిగి తీస్తానని గంగ పూజారి అశోక్ కుమార్ అనే యువకుడు నూతిలో దిగాడు. తిరిగి పైకి రాలేదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. పాడేరు పోలీసులు కేసు నమోదు చేశారు.